సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. డాలరు మారకంలో ఆరంభంలోనే 17పైసలు నష్టపోయిన రూపాయి మిడ్ సెషన్ తరువాత ఈ ఏడాదిలో అత్యంత కనిష్టాన్ని నమోదు చేసింది. 37 పైసలు నష్టపోయి 71.92 స్థాయికి చేరింది. ప్రస్తుతం 71.97 వద్ద కొనసాగుతూ రూపాయి 72 స్థాయి దిశగా కదులుతోంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బలం, చములు ధరల క్షీణత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం రూపాయ రికార్డు పతనానికి కారణమని ట్రేడరు చెబుతున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు 440 పాయింట్లకు పైగా కుదేలయ్యాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లలో అమ్మకాలుకొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment