
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. శుక్రవారం రూపాయి విలువ రికార్డు స్థాయిలో బలహీనపడింది గురువారం నాటి ముగింపుతో పోలిస్తే మరింత దిగజారిన రూపాయి మరోసారి ఆల్ టైం కనిష్టానికి చేరింది. విశ్లేషకులు అంచనా వేసినట్టేగానే ఆరంభంలోనే డాలరు మారకంలో రూపాయి 71 స్థాయిని టచ్ చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 70.74 వద్ద ముగిసింది. అటు చైనా దిగుమతులపై మరిన్ని టారిఫ్‌లను విధిస్తారనే భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఆసియా కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. జీడీపీ అంచనాలు, భారీగా పెరిగిన చమురు ధరలు రూపాయి విలువను ప్రభావితం చేశాయని ట్రేడర్లు చెబుతున్నారు.
ప్రపంచంలో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ నిధుల స్థిరమైన ప్రవాహం, దేశీయ కరెన్సీపై కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న భయాలు రూపాయిని పతనం దిశగా లాక్కెడుతున్నాయి. మరోవైపు గణాంకాల మంత్రిత్వశాఖ జూన్ త్రైమాసిక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈరోజు విడుదల చేయనుంది.