
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి అందరూ భయపడినట్టుగానే అత్యంత కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత కొన్ని సెషన్లుగా భారీగా నష్టపోతున్న రూపాయి గురువారం డాలరుమారకంలో 72.10 వద్ద చారిత్రాత్మక దిగువకు చేరింది. నేడు మధ్యాహ్నానికి రూపాయి 29పైసలు నష్టపోయి 72.05 వద్ద ట్రేడ్‌అయింది.
మరోవైపు రూపాయి వరుస పతనంపై ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేవలం అంతర్జాతీయ కారణాల కారణంగా రూపాయి విలువ క్షీణిస్తోందని, ఇతర కరెన్సీలతో పోలిస్తే దేశీయ యూనిట్ బాగానే ఉందని అన్నారు. కాగా బుధవారం 71.75 వద్దరికార్డు ముగింపును నమోదు చేసింది. ఇంట్రా డే లో చారిత్రాత్మక కనిష్టం 71.97ని టచ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా గత ఐదేళ్లలోలేని విధంగా డాలరుతో మారకంలో రూపాయి గడిచిన నెల రోజుల్లోనే 5 శాతం పతనంకాగా.. ఏడాది కాలంలో 13 శాతం బలహీనపడింది.