
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం మరింత బలహీనపడింది. చరిత్రలో తొలిసారి అత్యంత దిగువకు పడిపోయింది. డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారి రూ. 70ని టచ్ చేసింది. సోమవారం నాటి 68.93 ముగింపుతో పోలిస్తే నేడు ఆరంభంలో స్వల్పంగా పుంజుకుంది. కానీ ప్రారంభ లాభాలను కోల్పోయిన రూపాయి డాలరు మారకంలో 0.21 శాతం క్షీణించి 70.07 ను తాకింది. ఈ సందర్భంగా కేంద్రబ్యాంకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోనుందనే అంచనా మార్కెట్ వర్గాల్లో నెలకొంది. రీటైల్ ద్రవ్యోల్బణం 9నెలల కనిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment