సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్‌లు రెండు రోజుల వరుస లాభాలకు చెక్ పెట్టాయి. ఆరంభ లాభాలను కోల్పోయి వారాంతంలో ఫ్లాట్‌గా ముగిసాయి. అయితే సెన్సెక్స్ 200 పాయింట్లు పడి 58014 స్థాయిని తాకింది. చివర్లో బాగా పుంజుకుని సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 58191 వద్ద, నిఫ్టీ 17పాయింట్లు క్షీణించి 17314 వద్ద స్థిరపడ్డాయి.
టాటా, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. టైటన్, పవర్ గ్రిడ్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి చేరింది. ఏకంగా 54 పైసల నష్టంతో 82.32 ఆల్ టైం కనిష్టం వద్ద ముగిసింది. గత సెషన్‌లో 81.88 వద్ద క్లోజ్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment