పాకిస్తాన్ కరెన్సీ రుపీ పాతాళానికి పడిపోయింది. డాలర్ మారకంలో 144 రూపాయిల కనిష్ట స్థాయికి చేరుకుంది పాక్ కరెన్సీ. శుక్రవారం ఒక్కరోజే భారీగా నష్టపోయిన రూపాయి ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. గురువారం రోజు డాలర్‌కు 134 పాక్ రూపాయిలకు చేరిన మారకం విలువ.. మరో 10 రూపాయలకు పైగా పతనమై చారిత్రక కనిష్టాన్ని తాకింది.
మరోవైపు పాకిస్తాన్ కేంద్ర బ్యాంకు తన ప్రామాణిక వడ్డీరేట్లను 10శాతం పెంచింది.150బేసిస్ పాయింట్ల మేర సవరించిన కీలక వడ్డీరేట్లు డిసెంబరు 3నుంచి అమల్లోకి వస్తాయని శుక్రవారం వెల్లడించింది. అధిక కరెంట్ అకౌంట్ రేటు, ద్రవ్యలోటు ద్రవ్యోల్బణ ఒత్తిడి తదితర అంశాలను పరిశీలించాల్సి ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకటించింది. ప్రస్తుత అధ్వాన్న మార్కెట్ పరిస్థితుల్లో రోజురోజుకీ కరెన్సీ విలువ భారీగా పడిపోతోంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది.
మరోవైపు 2018-2019 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి సంబంధించి దేశ సగటు ద్రవ్యోల్బణం 5.9 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.5 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment