
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రుపీ బలహీనత కొనసాగుతోంది. గత కొన్ని సెషన్లుగా కీలక మద్దతు స్థాయికి దిగువన 15 నెలల కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. డాలర్ మారకరంలో 67 రూపాయల స్థాయికి దిగువన ట్రేడ్ అవుతున్న రూపాయి బుధవారం మరింత దిగజారింది. అటు చమురు ధరలు నింగిని తాకుతుండగా, రూపాయ పాతాళానికి పడిపోయింది. మంగళవారం నాటిముగింపుతో పోలిస్తే బుధవారం మరింత క్షీణించింది. డాలర్‌మారకంలో రూపాయి మరో 26పైసలు నష్టపోయి 67. 34 వద్ద ప్రారంభమైంది. నిన్నటి ముగింపు 67.07 రూపాయలుగా ఉంది.
వాణిజ్య లోటు, ఇరాన్ న్యూక్లియర్ డీల్, క్రూడ్ రికార్డ్ స్థాయిలో పెరగడం తదితర కారణాలు రూపాయి వాల్యూని ప్రభావితం చేసినట్టు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు మూడేళ్ల క్రితం ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గాముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment