
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ అత్యంత కనిష్ట స్థాయిని నమోదు చేసింది. దిగుమతిదారుల నుంచి అమెరికా డాలరుకు డిమాండ్ పెరగడంతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. బుధవారం మధ్యాహ్నం డాలర్ మారకంలో 39 పైసలు క్షీణించి 70.49కి చేరింది. ఆరంభంలోనే 22పైసలు పతనమైన రూపాయి అనంతరం మరింత కనిష్ట స్థాయికి దిగజారింది. డాలరులో కొనుగోళ్లతో రూపాయి మరింత బలహీనపడుతోందని ట్రేడర్లు తెలిపారు. అయితే ఇటీవల స్వల్పంగా కోలుకున్న రూపాయి మంగళవారం 6 పైసలు బలపడి 70,16 స్థాయి వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment