క్రెడిట్ కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్ట్ | The arrest of a gang of credit card cloning | Sakshi
Sakshi News home page

క్రెడిట్ కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్ట్

Published Sat, Dec 6 2014 4:29 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

క్రెడిట్ కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్ట్ - Sakshi

క్రెడిట్ కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్ట్

విదేశీయుల కార్డులే లక్ష్యం  
నైజీరియా దేశస్తుడి హస్తం


ఖమ్మం క్రైం: నకిలీ క్రెడిట్ కార్డులతో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తూ, కార్డుదారుల డబ్బును కాజేస్తున్న ముఠాను ఖమ్మం వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా వివరాల ను ఖమ్మం డీఎస్పీ దక్షిణమూర్తి శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం...
 
విలాసవంత జీవితం కోసం..

రాజస్థాన్‌కు చెందిన కునాల్ శర్మ అలియాస్ సునీల్ ఆశూజైన్, కుష్వంత్ వ్యాస్ అలియాస్ కల్ఫేష్ జైన్, మహీంద్ర సింగ్ రావ్ అలియాస్ మాలి, బవర్‌లాల్ చున్నీలాల్ మాలి కొంతకాలం ముంబైలో ఉద్యోగం చేశారు. ఈ నలుగురూ అక్కడ స్నేహితులయ్యూరు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఈ నలుగురు యువకులు.. ఎలాగైనా లక్షల రూపాయలు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం అక్రమ మార్గంలోనైనా వెళ్లేందుకు సిద్ధమయ్యూరు. ఈ క్రమంలోనే వీరికి నైజీరియన్ దేశస్తుడు పరిచయమయ్యూడు. అతడు అప్పటికే నెట్ ద్వారా క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్నాడు. అతడు ఈ ‘విద్య’ను వారికి నేర్పించాడు.

క్లోనింగ్ ముఠాగా ఏర్పాటు..

ఈ నలుగురు యువకులు క్లోనింగ్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ప్రధానంగా విదేశస్తుల క్రెడిట్ కార్డులనే క్లోనింగ్ చేసేవారు. విదేశస్తుల పేర్లు, వారి బ్యాంక్ క్రెడిట్‌కార్డుల నంబర్లను నైజీరి యన్ సేకరించి ఈ ముఠాకు పంపేవాడు. ఆన్‌లైన్ ద్వారా సేకరించిన క్రెడిట్ కార్డుల నెంబర్ల ఆధారంగా, మేగ్నట్ వీల్‌తో కూడిన స్క్రాచింగ్ మిషిన్ ద్వారా నకిలీ (క్లోనింగ్) క్రెడిట్ కార్డులను ఈ ముఠా తయారుచేసేది. ఇవి అచ్చంగా అసలు కార్డుల్లాగానే ఉంటారుు. వాటిపై ఫొటోలు మాత్రం ఈ నలుగురివి ఉంటారుు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో షాపింగ్..

ఈ కార్డుల ద్వారా వీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేసేవారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసి వాటిని ఎవరో ఒకరికి అమ్మేవారు. ఆ డబ్బుతో జల్సాగా గడిపేవారు. ఇలా అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ కారు కూడా కొన్నారు. వీరు తమ అక్రమ ఆదాయంలో కొంత మొత్తాన్ని నైజీరియన్‌కు ‘వాటా’గా ఇస్తుంటారు.
 
విదేశీయుల కార్డులే ఎందుకంటే..

విదేశీయుల కార్డులను మాత్రమే క్లోనింగ్ చేసేందుకు ఓ కారణముంది. రాత్రి, పగటి వేళలు మనకూ, విదేశాలకు పూర్తి భిన్నంగా ఉంటారుు. మనకు ఇక్కడ పగలు.. (కొన్ని) విదేశాలలో రాత్రి అవుతుంది. అలాగే, అక్కడ వారికి రాత్రి వేళ.. మనకు ఇక్కడ పగలుగా ఉంటుంది. ఈ ముఠా సభ్యులు మన దేశంలో పట్టపగలు మాత్రమే షాపింగ్ చేస్తుంటారు. క్రెడిట్ కార్డును స్క్రాచ్ చేయగానే.. ఎప్పుడు, ఎక్కడ షాపింగ్ చేసిందీ.. వెంటనే, కార్డుదారుడి సెల్‌కు మెసేజ్ వెళుతుంది. సదరు షాపు ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంటుంది. ఈ మెసేజ్ వెళ్లేసరికి కార్డుదారులు నిద్రలో ఉంటారు. కాబట్టి, వారు దానిని చూసుకుని వెంటనే స్పందించే అవకాశాలు తక్కువ. అందుకే, ఈ ముఠా కేవలం పగటి వేళలోనే షాపింగ్ చేస్తుంటుంది.
 
ఇలా పట్టుబడింది..

గత నెల 27న రాజస్థాన్ నుంచి ఈ ముఠా కారులో ఖమ్మం చేరుకుని, గాంధీచౌక్‌లోగల బడ్జెట్ హోటల్‌లో గది అద్దెకు తీసుకుంది. 28వ తేదీన ఈ ముఠాలోని కునాల్ శర్మ అనే యువకుడు.. స్టేషన్ రోడ్డులోని బిగ్-సి మొబైల్ షాపులో రెండు సెల్ ఫోన్లు కొన్నాడు. నకిలీ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు చెల్లించాడు. ఆ కార్డు స్క్రాచ్ చేయగానే కార్డుదారుడి సెల్ ఫోన్‌కు మెసేజ్ వెళ్లింది. తమిళనాడుకు చెందిన ఆ కార్డుదారుడు విదేశంలో ఉంటున్నాడు ఈ యువకుడు కార్డు స్క్రాచ్ చేసే సమయూనికి అతడు (విదేశీయుడు) తమిళనాడులోనే ఉన్నాడు. తన ఖాతా నుంచి 20వేల రూపాయలతో ఖమ్మంలోని మొబైల్ షాపులో సెల్ ఫోన్లు కొన్నట్టుగా అతడి సెల్‌కు మెసేజ్ వచ్చింది. అతడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కూడా వేగంగా స్పందించి, ఆ కార్డు స్క్రాచ్ చేసిన షాపునకు ఫోన్ చేసి, ఆ కొనుగోలుదారుడిని అక్కడే ఆపేసి, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారమివ్వాలని కోరారు. ఈ షాపు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేంత వరకు ఆ కొనుగోలుదారుడిని (కునాల్ శర్మ)ను మాటల్లోకి దింపి అక్కడే ఉండేలా చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వీరు హోటల్ గదికి వెళ్లేసరికి మిగతా ముగ్గురు కారులో పరారయ్యూరు. వన్ టౌన్ సీఐ రమణమూర్తి, సీసీఎస్ ఎస్‌ఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆ కారును వెంటాడి పట్టుకున్నారు.

అందులోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కారు, ల్యాప్‌టాప్, నకిలీ క్రెడిట్ కార్డులు, వీటి తయూరీకి ఉపయోగించే స్క్రాచింగ్ మిషన్, వివిధ బ్యాంకుల పేరుతోగల ఏటీఎం కార్డులు స్వాధీనపర్చుకున్నారు. సమావేశంలో సీఐలు రమణమూర్తి, అంజలి, ఎస్‌ఐలు సత్యనారాయణరెడ్డి, కరుణాకర్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement