చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్ ఫోనులో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి. కిరాణాకొట్టులోని చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు అన్నింటికీ యూపీఐ వాడుతున్నారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు యూపీఐని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటితోపాటు తమ వినియోగదారులకు మరింత సేవలందించేలా ఈ కామర్స్ సంస్థలు మరోఅడుగు ముందుకేసి ఇతర బ్యాంకులతో కలిసి యూపీఐను పరిచయం చేస్తున్నాయి.
తాజాగా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవల్లోకి అడుగుపెట్టింది. యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ సేవలను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. తొలుత ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదార్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా?
వినియోగదార్లు ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో, యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవడం ద్వారా వ్యాపారులు, ఇతరులకు చెల్లింపులు చేసుకోవచ్చు. థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లైన పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకే ఈ సేవలు తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment