ప్రస్తుతం జనం ఆన్‌లైన్ షాపింగ్‌కు బాగా అలవాటు పడ్డారు. దుస్తుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నీ ఆన్‌లైన్‌లోనే కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫ్రీ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. అయితే ఆ ఫ్రీ డెలివరీ రోజులు పోయాయి.
(గూగుల్‌పే యూజర్లకు సర్‌ప్రైజ్.. ఫ్రీగా సిబిల్ స్కోర్)
ఈ కామర్స్ సంస్థల్లో వాస్తవానికి ఉచిత షిప్పింగ్ వంటివి ఏవీ ఉండవు. ఓ వైపు ఉచిత డెలివరీ అంటూ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు డెలివరీ చార్జీలు రాబట్టుకోవడానికి ఈ-కామర్స్ సంస్థలు ఎత్తులు వేస్తున్నాయి. త్వరగా ఉత్పత్తుల డెలివరీ కోసం అదనపు చార్జీలు, ఉచిత డెలివరీ కావాలంటే కనీస కొనుగోలు మొత్తం అధికంగా పెంచడం వంటివి చేస్తున్నాయి.
(కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!)
ఈ కామర్స్ సంస్థల్లో ఫ్రీ డెలివరీ రోజులు పోయాయని కేంబ్రిడ్జ్ రీటైల్ అడ్వైజర్స్ మేనేజింగ్ పార్టనర్ కెన్ మోరిస్ తెలిపారు. ఉత్పత్తి ద్రవ్యోల్బణం, విపరీతమైన షిప్పింగ్ ఖర్చులు ఈ-కామర్స్ సంస్థలకు ఇబ్బందిగా పరిణమించాయని, మాంద్యం ప్రభావంతో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment