Shocking Incident: South Korea Man Finds Rs 96 Lakhs Under Refrigerator - Sakshi
Sakshi News home page

సెకండ్‌ హ్యాండ్‌ ఫ్రిడ్జ్‌ ఆర్డర్‌ చేస్తే ఇంట్లో కురిసిన డబ్బుల వర్షం

Published Mon, Aug 16 2021 9:02 PM | Last Updated on Tue, Aug 17 2021 11:49 AM

Man Find Cash Under refrigerator In South Korea - Sakshi

ఆన్‌లైన్‌లో సెకండ్‌ హ్యాండ్‌ ఫ్రిడ్జ్‌ ఆర్డర్‌ చేయగా ఫ్రిడ్జ్‌తో పాటు దాదాపు రూ.కోటి వరకు డబ్బులు ఇంటికి వచ్చాయి. ఈ డబ్బులు చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి చివరకు ఏమైందో ఏమోగానీ ఆ డబ్బులను తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించాడు. అతడి నిజాయతీని పోలీసులు మెచ్చుకుని అసలు ఫ్రిడ్జ్‌ విక్రయించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే ఆ డబ్బుల విషయం చెప్పకుండా ఉంటే కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని ఆయన నిజాయతీ చాటుకుని కోల్పోయాడు. ఈ సంఘటన దక్షిణ కొరియాలో జరిగింది. 

దక్షిణ కొరియాలోని జెజు ద్వీపానికిచెందిన  ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో సెకండ్‌ ఫ్రిడ్జ్‌ ఆర్డర్‌ చేయగా ఆగస్ట్‌ 6వ తేదీన ఇంటికి వచ్చింది. వచ్చిన ఫ్రిడ్జ్‌ శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలో ఫ్రిడ్జ్‌ కింద ఓ స్టిక్కర్‌ కనిపించగా తొలగించాడు. వెంటనే డబ్బుల కట్టలు బయటకు వచ్చాయి. వందలు.. వేలు కాదు ఏకంగా రూ.96 లక్షల (లక్షా 30 వేల డాలర్లు) నగదు లభ్యమైంది. ఈ నగదు చూసిన అతడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే తేరుకుని సంబరపడ్డాడు. ఆ తర్వాత ఏం ఆలోచించాడో ఏమో.. వెంటనే ఆ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. నగదును తీసుకున్న పోలీసులు ఫ్రిడ్జ్‌ విక్రయించిన వ్యక్తి ఎవరోనని గాలిస్తున్నారు. అయితే విక్రయించిన వ్యక్తి దొరకకపోతే ఫ్రిడ్జ్‌ కొన్న వ్యక్తికే ఆ డబ్బు చెందుతుంది. అయితే కొరియా చట్టం ప్రకారం ఆ నగదులో 22 శాతం పన్ను కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement