దక్షిణ కొరియాలో పడవ ప్రమాదం, 290 మంది గల్లంతు
దక్షిణ కొరియా లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఒక భారీ ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మందికి పైగా గల్లంతయ్యారు. పడవలో మొత్తం 477 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరో 164 మంది క్షేమంగా బతికి బట్టగట్టారు. మిగతా వారి కోసం వెతుకులాట కొనసాగుతోంది. కనీసం 290 మందికి పైగా గల్లంతయ్యారు. చనిపోయిన వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
సియోల్ పడవ ప్రమాదం
మొత్తం ప్రయాణికులు | 477 |
మృతులు | 2 |
క్షేమంగా బయటపడ్డవారు | 164 |
కోస్టు గార్డు పడవలు, హెలికాప్టర్లు ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. పడవలో ఉన్న వారిలో ఎక్కువ మంది స్కూలు పిల్లలే. వీరంతా దక్షిణ కొరియా దక్షిణ ప్రాంతం లోని జెజు ద్వీపానికి పిక్నిక్ కి వెళ్తున్నారు.
పడవ ఉన్నట్టుండి ఒక పక్కకి ఒరిగిపోయి, ఆ తరువాత కొద్ది సేపటికే పూర్తిగా మునిగిపోయిందని ప్రమాదం తాలూకు ఫోటోలను చూస్తే తెలుస్తోంది. ఈ భారీ పడవ 6825 టన్నుల బరువు ఉంటుంది.