Best Credit Card Cashback Offers: దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా చాలా మంది షాపింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ సంస్థలు పలు రకాల ఆఫర్లను ప్రకటించాయి. వీటితోపాటు వివిధ బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డులతో షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ క్రెడిట్‌కార్డ్‌తో ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాపారి పరిమితులు లేకుండా ఆన్‌లైన్ షాపింగ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదే ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తే అదనంగా మరో 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇక డిజిటల్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. అయితే, క్యాష్‌బ్యాక్ నెలకు రూ. 5,000 మాత్రమే ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్
యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు అనువైనది. గూగుల్‌పే ద్వారా బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అలాగే స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై 4 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈ క్రెడిట్ కార్డుతో పొందవచ్చు. అయితే, ఈ క్యాష్‌బ్యాక్‌ల గరిష్ట మొత్తం నెలకు రూ. 500 మాత్రమే. అదనంగా ఈ కార్డ్ ఇతర అన్ని చెల్లింపులపైనా 2 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డ్‌ను తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డ్ ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. దీంతోపాటు స్విగ్గీ, క్లయర్‌ట్రిప్, కల్ట్‌ఫిట్, పీవీఆర్, టాటా ప్లే, ఉబెర్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో చెల్లింపులపై 4 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో విమాన, హోటల్ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్‌లను ఎలాంటి పరిమితి లేకుండా నెలంతా వినియోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment