కిడ్స్..డైమండ్ | kids diamond | Sakshi
Sakshi News home page

కిడ్స్..డైమండ్

Published Sat, Feb 7 2015 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

కిడ్స్..డైమండ్

కిడ్స్..డైమండ్

పెద్దవాళ్లకేనా... ఈ రోజుల్లో పిల్లలూ ఎవరి టేస్టును
 వారే ప్రజంట్ చేసుకోగలుగుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం... ప్రపంచాన్ని క్లిక్‌లో ముందుంచే అంతర్జాలం... మొత్తానికి అదీఇదీ అని లేకుండా చిన్నారులూ అన్నింటా అప్‌డేట్ అయిపోతున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో నాలుగేళ్ల పిల్లలు వారికేం కావాలో తెలుసుకోగలుగుతున్నారనేది ఓ స్టడీ సారాంశం. వేసుకొనే డ్రెస్ నుంచి తినే బర్గర్ వరకు అన్నీ వారిష్టమే! కేవలం వారి అభిరుచులను బేస్ చేసుకొనే ఎన్నో బిజినెస్‌లు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్నాయి. నమ్మలేకపోయినా స్టాటిస్టిక్స్ సాక్షిగా ఇది నిరూపితం.
 
  పిల్లలతో కలసి షాపింగ్‌కు వెళ్లేది మనమే గానీ... చాలా సందర్భాల్లో ఏ మోడల్ కొనాలో డిసైడ్ చేసేది వారే! అలా చిన్నారుల కోసమే మార్కెట్‌ను ముంచెత్తుతున్న మరో నయా ఐటెమ్ డైమండ్ జ్యువెలరీ! జిగేల్‌మంటూ చూడగానే వారికి నచ్చేలా... ధగధగలకు మురిసి అదే కావాలని మారాం చేసేలా ఆకర్షణీయమైన బడా బ్రాండెడ్ వెరైటీలెన్నో ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి.
 
 చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే బొమ్మలే ఈ డెమైండ్ ఆభరణాల్లో కనిపిస్తాయి. టెడ్డీబేర్, సీతాకోకచిలుక, తాబేలు, కుందేలు... ఇలాంటివెన్నో ఎక్స్‌క్లూజివ్ పెండెంట్ కలెక్షన్స్ షాపుల్లో కొలువుదీరాయి. బంగారంతో చేసిన రకరకాల పెండెంట్స్ వజ్రాల హంగులద్దుకుని అబ్బురపరుస్తున్నాయి. ఇవే కాదు... మల్టీ కలర్ స్టోన్స్, ఎనామిల్ కోటింగ్‌లతో మరిన్ని వన్నెలద్దుకున్న చైన్లు పిల్లల మనసు దోచేస్తున్నాయి. విశేషమేమంటే... పెద్దలనూ ఈ డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి.
 బాబ్ డైమండ్ అండ్ ఎనామిల్, క్రష్ టర్టిల్ డైమండ్, డోరీ డాల్ఫిన్ డైమండ్, ఫ్రిల్లీ బటర్‌ఫ్లై డైమండ్, జుంబో ఎలిఫెంట్ డైమండ్, పాండా హార్ట్ డైమండ్... ఇలా ఒకటేమిటీ ఒక్కో పెండెంట్ ఒక్కో ప్రత్యేకమైన డిజైన్‌లో మెరిసిపోతున్నాయి. ఇవే కాదు... ఆడ పిల్లలకైతే ఇయర్ రింగ్స్, రింగ్స్, బ్రేస్‌లెట్స్ వంటివెన్నో ఆభరణాలు షాపుల్లో జిగేల్‌మంటున్నాయి.
 
 ఫ్యాషన్ ట్రెండ్స్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే పేరెంట్స్ తమ పిల్లల కోసం వినూత్నమైనవే కాకుండా... సౌకర్యంగా ఉండాలని కూడా ఆలోచిస్తున్నారు. బరువైన సంప్రదాయ ఆభరణాలకు బదులు పిల్లలకు సౌకర్యంగా ఉండేలా లైట్ వెయిట్ ఫ్యాషన్ ఫార్వర్డ్ వెరైటీలను కొనుగోలు చేస్తున్నారు.
 
 అందుకు తగ్గట్టుగానే స్లీక్‌గా, బరువు తక్కువగా ఉండేలా ఈ డైమండ్ సెట్స్ రూపొందిస్తున్నారు నగల వ్యాపారులు. బర్త్‌డేలు, బేబీషవర్స్ వంటి కార్యక్రమాల్లో వీటిని గిఫ్ట్‌లుగా ఇచ్చేందుకు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. షాపుల్లోనే కాదు... జామోర్ డాట్ కామ్ వంటి ఆన్‌లైన్ స్టోర్స్‌లో కూడా కిడ్స్ జ్యువెలరీ అందుబాటులో ఉంది. ధర సుమారు పది వేల రూపాయల నుంచి మొదలు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement