అమెరికాలో జోయాలుక్కాస్ షోరూమ్! | Joyalukkas set to open first showroom in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో జోయాలుక్కాస్ షోరూమ్!

Published Fri, Nov 18 2016 12:52 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

అమెరికాలో జోయాలుక్కాస్ షోరూమ్! - Sakshi

అమెరికాలో జోయాలుక్కాస్ షోరూమ్!

హైదరాబాద్: బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘జోయాలుక్కాస్’ తాజాగా అమెరికాలో తన తొలి షోరూమ్ ను ప్రారంభించనుంది. హూస్టన్‌లోని హిల్‌క్రాఫ్ట్‌లో ఈ ఔట్‌లెట్ ఏర్పాటవుతుందని సంస్థ ఒక ప్రటకలో తెలిపింది. షోరూమ్ ప్రారంభోత్సవం ఈ నెల 19న ఉంటుందని పేర్కొంది. ఔట్‌లెట్‌ను ప్రారంభిస్తే తాము అంతర్జాతీయంగా 11 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహించినట్లు అవుతుందని తెలిపింది. కొత్త షోరూమ్‌లో పలు డిజైన్లతో కూడిన ఆభరణాలను అందుబాటులో ఉంచామని, వినియోగదారులు నాణ్యమైన జువెలరీని అత్యుత్తమ విలువకు పొందొచ్చని సంస్థ చైర్మన్, ఎండీ జోయ్ అలుక్కాస్ తెలిపారు. త్వరలో న్యూజెర్సీ, చికాగో ప్రాంతాల్లో షోరూమ్‌లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement