
జోయ్ ఆలుక్కాస్ బంగారు ఆభరణాల ఎక్స్చేంజీ ఆఫర్
బంగారు ఆభరణాల ఎక్స్ఛేంజీ అవకాశాన్ని ప్రముఖ బంగారు ఆభరణాల రిటైల్ చెయిన్ సంస్థ జోయాలుక్కాస్ అందిస్తోంది.
హైదరాబాద్: బంగారు ఆభరణాల ఎక్స్ఛేంజీ అవకాశాన్ని ప్రముఖ బంగారు ఆభరణాల రిటైల్ చెయిన్ సంస్థ జోయాలుక్కాస్ అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు తమ పాత బంగారు ఆభరణాలను, కొత్త ఆభరణాలతో ఉచితంగా మార్చుకోవచ్చని జోయాలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు తాము ఎంచుకున్న కొత్త బంగారు ఆభరణాలకు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకుండా మార్చుకోవచ్చని జోయాలుక్కాస్ గ్రూప్ సీఎండీ జోయ్ ఆలుక్కాస్ పేర్కొన్నారు.
ఎలాంటి మేకింగ్, వేస్టీజీ చార్జీలు వసూలు చేయబోమని వివరించారు. జోయాలుక్కాస్, లేదా ఇతర నగల దుకాణాల్లో కొనుగోలు చేసిన ఆభరణాలను కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని వివరించారు. భారత్‌లోని అన్ని జోయాలుక్కాస్ షోరూమ్‌ల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు.