దుబాయ్ గ్లోబల్ విలేజ్లో జోయాలుక్కాస్ ఔట్లెట్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘జోయాలుక్కాస్’ తాజాగా దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్‌లో (ఇండియన్ పెవిలియన్‌లో) కొత్త ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పలు ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన వివిధ దేశాలకు చెందిన ఆభరణాలను కస్టమర్లు/టూరిస్ట్‌ల కోసం అందుబాటులో ఉంచామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డైమండ్ జువెలరీపై 70 శాతం, పొల్కి జువెలరీపై 65 శాతం, పెరల్ జువెలరీపై 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఎంపిక చేసిన ఆభరణాలపై తయారీ చార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ పాల్ అలుక్కాస్, డెరైక్టర్ సోనియా జాన్ పాల్ సహా పలువురి ప్రముఖుల సమక్షంలో జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ జాయ్ అలుక్కాస్ ఈ కొత్త ఔట్‌లెట్‌ను ప్రారంభించారు.