జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు | Joyalukkas announces Cashback Celebrations offer for Akshaya Tritiya | Sakshi
Sakshi News home page

జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు

Apr 25 2022 4:23 AM | Updated on Apr 25 2022 4:23 AM

Joyalukkas announces Cashback Celebrations offer for Akshaya Tritiya - Sakshi

హైదరాబాద్‌: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్‌ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్‌ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్‌బీఐ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు ఈ ఆఫర్‌ దేశవ్యా ప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement