Akshaya thrithiya
-
Akshaya Tritiya 2023: ‘అక్షయ’కు పుత్తడి మెరిసేనా?
ముంబై: ఈ అక్షయకు పుత్తడి వెలుగులు విరజిమ్మేనా? ప్రస్తుత ధరలు అమ్మకాలను ప్రభావితం చేస్తాయా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పరిమాణం పరంగా విక్రయాలు 20 శాతం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల పుత్తడి ధర 24 క్యారెట్లు రూ.60,930, అలాగే 22 క్యారెట్లు అయితే రూ.55,850 పలికింది. ‘ఇటీవల 10 గ్రాములకు రూ.60 వేలు దాటడంతో వినియోగదార్లు పుత్తడి కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత ధర స్వల్పంగా తగ్గినప్పటికీ.. ధరలు మాత్రం బుల్లిష్‌గానే ఉన్నాయి. విలువైన లోహాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే అక్షయ తృతీయ సమయంలో ఇది అమ్మకాలపై ప్రభావం చూపుతుంది’ అని ఆల్ ఇండియా జెమ్, జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ సైయమ్ మెహ్రా తెలిపారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వస్తోంది. దక్షిణాది వాటాయే అధికం.. అక్షయ విక్రయాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 40 శాతం ఉంది. పశ్చిమ భారత్ 25 శాతం, తూర్పు 20, ఉత్తరాది రాష్ట్రాలు 15 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. ధరలు అధికంగా ఉండడం డిమాండ్‌పై ప్రభావం చూపనుందని జీజేసీ మాజీ చైర్మన్, ఎన్ఏసీ జ్యువెల్లర్స్ ఎండీ అనంత పద్మనాభన్ తెలిపారు. ధరలు పెరిగిన ప్రభావం ఇప్పటికే కనపడుతోంది. 2022తో పోలిస్తే విలువ పరంగా అక్షయ అమ్మకాల్లో ఈ ఏడాది 10 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని చెప్పారు. పరిమాణం పరంగా 20 శాతం క్షీణతకు చాన్స్ ఉందన్నారు. అకస్మాత్తుగా పుత్తడి ధర తగ్గితే అమ్మకాలకు బూస్ట్‌నిస్తుందని వివరించారు. స్థిరంగా పసిడి ధర.. ప్రస్తుతం కొనసాగుతున్న బంగారం ధరలు బుల్లిష్‌గా ఉన్నప్పటికీ.. కొంతకాలం స్థిరంగా ఉండే అవకాశం ఉందని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. ‘ప్రస్తుతం యూఎస్ ఆర్థిక పరిస్థితుల మాదిరిగా పసిడి ధరలను అస్థిరంగా మార్చడానికి కారణాలేవీ లేవు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల వంటి ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ఇటీవల పుత్తడి ధరలను ప్రభావితం చేయలేదు. భారత్‌లోని వినియోగదార్లకు బంగారం ధరల పెరుగుదలకు అలవాటుపడటానికి ఎల్లప్పుడూ సమయం పడుతుంది. కాబట్టి ఈ సవత్సరం అక్షయ తృతీయ సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది’ అని వివరించారు. విడదీయలేని బంధం.. లక్షలాది మంది భారతీయులకు అక్షయ తృతీయ వేడుకల్లో బంగారం కొనుగోళ్లు విడదీయరాని భాగం అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత్ సీఈవో సోమసుందరం పీఆర్ వివరించారు. ‘పుత్తడిని సంపద చిహ్నంగా భావిస్తారు. అక్షయకు కాలానుగుణ కొనుగోలు ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రధాన బంగారం కొనుగోలు పండుగ అయినప్పటికీ.. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పసిడి జీవితకాల అధిక ధరలను ఎదుర్కొంటోంది. గత కొన్ని వారాలుగా వినియోగదారుల నుండి మోస్తరు స్పందన ఉంది’ అని తెలిపారు. మహమ్మారి కారణంగా రెండేళ్ల మందకొడి పనితీరు తర్వాత బంగారు పరిశ్రమకు తిరిగి మెరుపు వచ్చిందని కామా జ్యువెల్లరీ ఎండీ కోలిన్ షా అన్నారు. ‘కొంతకాలంగా పసిడి ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరంలో పెరుగుతున్న ధరలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో వినియోగదారులు తమ కొనుగోళ్లతో మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. అయితే పెట్టుబడిదారుల వర్గం రాబోయే కాలంలో పుత్తడి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు’ అని చెప్పారు. -
Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా?
అక్షయ తృతీయ హిందువులకు పవిత్రమైన రోజు. దీన్ని అఖ తీజ్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజున బంగారం కొంటే అంతులేని సిరి సంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఏప్రిల్ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాల కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు మోసపోకుండా గమనించాల్సిన విషయాలు తెలుసుకోవడం అవసరం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించడాన్ని నిషేధించింది. బంగారం స్వచ్ఛతను పరిశీలించడం ఎలా? HUID హాల్‌మార్క్ 3 మార్కులను కలిగి ఉంటుంది. BIS లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఒక్కో బంగారు వస్తువు లేదా ఆభరణానికి ఒక్కో విశిష్టమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. BIS లోగో BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి బంగారు వస్తువు, ఆభరణంపైనా BIS లోగో ఉంటుంది. ఇది ఉంటే ఆ ఆభరణం BIS అధీకృత ల్యాబ్‌లో పరీక్షించి ధ్రువీకరించినట్లు అర్థం. కొనుగోలుదారులు బంగారు ఆభరణంపైనా ఈ లోగో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. భారతదేశంలోని బంగారు వస్తువులు, ఆభరణాల స్వచ్ఛతను ధ్రువీకరించే ఏకైక సంస్థ BIS. స్వచ్ఛత గ్రేడ్ ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారాన్ని ధ్రువీకరించే మరో గుర్తు ఫైన్నెస్ నంబర్, క్యారెట్ (KT లేదా Kగా పేర్కొంటారు). వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కూడిన బంగారు మిశ్రమాలలో నాణ్యతను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం చాలా మృదువైనది కావడంతో ఆభరణాల కోసం ఇతర లోహాలను దీనికి కలుపుతారు. 916 అనేది ఫైన్నెస్ నంబర్. 22 క్యారెట్ల బంగారానికి మరో పదం. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బరువు ఉంటే అందులో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ (HUID) బంగారు ఆభరణాలను అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్లో మాన్యువల్‌గా ప్రత్యేక నంబర్‌తో స్టాంప్ చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేకమైన HUID ఉంటుంది. ఇది విశ్వసనీయతకు కీలకం. పాత బంగారు ఆభరణాలు? ఇది వరకే ఉన్న నిబంధనల ప్రకారం.. వినియోగదారుల వద్ద ఉన్న పాత హాల్‌మార్క్ ఆభరణాలు కూడా చెల్లుబాటులో ఉంటాయి. BIS రూల్స్ 2018 సెక్షన్ 49 ప్రకారం.. ఆభరణాలపై పేర్కొన్న దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉన్నట్లు గుర్తించినట్లయితే కొనుగోలుదారులు నష్టపరిహారం పొందవచ్చు. -
జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ క్యాష్ బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు ఈ ఆఫర్ దేశవ్యా ప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ తెలిపింది. -
అక్షయతృతీయపై కరోనా ఎఫెక్ట్
-
మలబార్లో ఆన్లైన్ కొనుగోలు సౌకర్యం
కాప్రా: అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో బంగారు ఆభరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏఎస్‌రావునగర్ స్టోర్స్ ఇన్చార్జి పీకె.షిహాబ్ తెలిపారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రామిస్ టు ప్రొటెక్ట్’క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఆన్లైన్లో మీ ఇంటి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చని, ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆయన పేర్కొన్నారు. -
భారీగా తగ్గిన బంగారం ధర..
సాక్షి, ముంబై : అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో గతవారం భయపెట్టిన బంగారం ధరలు దిగి వస్తూ కొనుగోలుదారులను ఊరిస్తున్నాయి. గత రెండుసెషన్లుగా దిగి వచ్చిన పుత్తడి ధర ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో అరశాతం క్షీణించి (రూ.235) రూ.45,500 వద్ద ట్రేడవుతోంది. మునుపటి సెషన్లో గోల్డ్ రేట్ 10 గ్రాములు రూ.1600 తగ్గింది. సోమవారం కూడా ధర దిగి వచ్చింది. డెరివేటివ్ మార్కెట్లో గత శుక్రవారం రికార్డ్ స్థాయిలో రూ.47327కు చేరింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా పుంజుకుంది. మే ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర 0.3శాతం పెరిగి రూ.42,940 కు చేరింది. ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఎంసీఎక్స్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని బులియన్ వర్తకులు తెలిపారు. (హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం) గత వారం రికార్డ్ స్థాయి గరిష్టానికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతం కాస్త శాంతించింది. ముఖ్యంగా ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 26న జరుపుకోనున్న తరుణంలో గత రెండు రోజుల్లో పసిడి ధర రూ.1800 తగ్గింది. వెండి ధర మాత్రం ఇవాళ స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ బంగారం దర తగ్గడంతో వారం రోజుల కనిష్ట స్థాయికి పడిపోయింది. లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడే అవకాశముందని ఇన్వెస్టర్లు ధీమాతో ఉన్నారు. దీంతో ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర అరశాతం తగ్గి 1675.92 డాలర్లకు చేరింది. గత సెషన్లో కూడా గోల్డ్ రేట్ 2శాతం దిగివచ్చింది. వెండి ధర కూడా 0.3శాతం తగ్గి 15.08 డాలర్లకు తగ్గింది. ఇతర విలువైన మెటల్స్ విషయానికి వస్తే ప్లాటినమ్ 0.9 శాతం తగ్గి 768.12 డాలర్లకు చేరింది. (లాక్డౌన్.2 : జియో గుడ్ న్యూస్) మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో 2020-21 సిరీస్ గోల్డ్ బాండ్స్ సబ్స్క్రిప్షన్ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద గోల్డ్ బాండ్ గ్రాము ధరను రూ.4639 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇష్యూ ఈనెల 24తో ముగిస్తుంది. ఏప్రిల్ 28న బాండ్లను జారీ చేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ఉన్నప్పటికీ అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు జరపాలని ప్రముఖ బంగారం దుకాణ సంస్థలు నిర్ణయించాయి. టాటా గ్రూప్ తనిష్క్ జ్యూయలరీ ఏప్రిల్ 18 నుంచి 27 వరకు కస్టమర్లు తమ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ మేరకు తమ సిబ్బంది వీడియో కాల్, ఆన్ లైన్ ఛాటింగ్ ద్వారా కొనుగోలు చేయొచ్చని, లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం వినియోగదారులు సంబంధిత నగలను పొందవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అక్షయ తృతీయ తిధిని పురస్కరించుకొని కనీసం గోరెడు బంగారమైనా కొంటే కలిసొస్తుందని భారతీయుల విశ్వాసం. మరోవైపు కరోనా వైరస్ ఉధృతికి ఇంకా అడ్డుకట్ట పడకపోవడంతో లాక్ డౌన్ గడువు మే 3వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. -
అక్షయ తృతీయ : భారీ సేల్స్‌పై జ్యూవెలర్ల అంచనా
సాక్షి, న్యూఢిల్లీ : అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి అమ్మకాలు రెట్టింపవుతాయని జ్యూవెలర్లు అంచనా వేస్తున్నారు. ధరలు నిలకడగా ఉండటం, కొనుగోలుదారులు బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతుండటంతో ఈ ఏడాది అక్షయ తృతీయ అమ్మకాలు రికార్డుస్ధాయిలో నమోదవుతాయని ట్రేడర్లు, రిటైల్ వర్తకులు భావిస్తున్నారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారానికి డిమాండ్ 20 శాతం పెరుగుదల ఉంటుందని భారత బులియన్, జ్యూవెలర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది.మరోవైపు దేశంలో పలు ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడం, తొలివారంలో వేతన జీవులు వేతనాలు అందుకునే సమయం కావడంతో అక్షయ తృతీయ సేల్స్ ప్రోత్సాహకరంగా ఉంటాయని భారత బులియన్, జ్యూవెలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సౌరవ్ గాడ్గిల్ అంచనా వేశారు. ఈనెల 7న అక్షయ తృతీయ సందర్భంగా పలు జ్యూవెలరీ సంస్ధలు, దుకాణాలు బంగారు ఆభరణాలపై ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. -
గోల్డెన్ డే
తణుకు: నీ ఇల్లు బంగారం గానూ.. అని ఎవరైనా అంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ దీవెన నిజమవుతుందన్న నమ్మకమే అక్షయ తృతీయ. పసిడి పండుగగా పేరొందిన ఈ రోజున మహిళలంతా తమ శక్తి కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఆనవాయితీగా వస్తున్న బంగారం కొనుగోళ్లు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుండటంతో పాటు పుత్తడి అమ్మకాలు ఊపందుకునేలా చేస్తున్నాయి. అయితే ఈ సారి పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా కలిసి రావడంతో కొనుగోలు దారుల్ని ఆకర్షించేందుకు జిల్లాలోని అన్ని దుకాణాలు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. అక్షయం అంటే...అక్షయ తృతీయ రోజున పిసరంత బంగారమైనా కొంటే... లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. అక్షయం అంటే ఎప్పుడు తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే తరిగిపోని సంపదగా ఉంటుందని నమ్మకం. ఈ పండుగ ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పాల సముద్రం నుంచి మహాలక్ష్మి ఉద్భవించిన సువర్ణమైన రోజని కొందరు చెబుతారు. అందువల్లనే కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేయడం సెంటిమెంట్‌గా వచ్చిందని అంటారు. పాండవులు అక్షయపాత్ర పొందిన శుభదినంగా మరి కొందరు అభివర్ణిస్తారు. పరశురాముడు పుట్టిన రోజని, సూర్యచంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉండే రోజని ఇంకొందరు చెబుతుంటారు. త్రేతాయుగం అక్షయ తృతీయ రోజే మొదలైందని పెద్దలు చెబుతారు. ఈ రోజు ఏ పనైనా ముహూర్తం చూడకుండానే ప్రారంభించుకోవచ్చని చెబుతుంటారు. ఆఫర్ల జోరు.. బంగారం కొనుగోలు చేసేవారికి కొండెక్కిన ధర భారంగా మారింది. 10 గ్రాముల 24 కా>్యరెట్లు బంగారం రూ.32,400 పలుకుతుండగా 22 క్యారెట్లు బంగారం రూ.29,800 పలుకుతోంది. మహిళలు సెంటిమెంటుగా ఎంతోకొంత బంగారాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో కనీసం రెండు, మూడు గ్రాములైనా కొనుగోలు చేయడానికి మహిళలు ఉత్సుకత చూపిస్తున్నారు. జిల్లాలోని ప్రధానంగా నరసాపురం, భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో అన్ని పసిడి దుకాణాల్లో ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ఒకవైపు.. అక్షయ తృతీయ మరోవైపు.. రెండింటినీ ముడి పెడుతూ దుకాణాలు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని ప్రముఖ దుకాణాల్లో మేకింగ్ చార్జీల్లో తగ్గింపు, బంగారం కొంటే వెండి ఉచితం, పలు బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగిస్తే.. క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ప్రకటించారు. సాధారణంగా రోజువారీ అమ్మకాలతో పోల్చి చూస్తే.. అక్షయ తృతీయ రోజున ప్రతి దుకాణంలో 100 నుంచి 150 శాతం అదనపు అమ్మకాలు జరుగుతాయి. -
అక్షయ తృతీయ : ఆఫర్లతో జర జాగ్రత్త..!
న్యూఢిల్లీ : అక్షయ తృతీయ నాడు తప్పక ఎంతో కొంత బంగారాన్ని కొంటే మంచిదని నమ్ముతుంటారు భారతీయులు. అంత పవిత్రంగా భావించే ఈ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆఫర్లకు ఆకర్షితులై మోసపోకుండా ఉండాలంటే బంగారం కొనే ముందు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. వారు చెబుతున్న జాగ్రత్తలేమిటో ఓసారి చూడండి... నాణ్యత పరిశీలన... బంగారాన్ని కొనే ముందు తప్పక దాని నాణ్యతను పరిశీలించి, దాని అసలు విలువను లెక్కించాలి. ప్రతి ఆభరణం మీద తప్పక బీఐఎస్ హాల్‌మార్క్ ముద్ర, స్టాంపు, అది ఎన్ని క్యారెట్లు ఉన్నది, హాల్‌మార్కింగ్ సంవత్సరాన్ని కూడా చూడాలంటున్నారు మేకింగ్ చార్జీలు... ఈ పర్వదినం సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి పరిమిత కాలం వరకు మేకింగ్ చార్జీల మీద ఎక్కువ మొత్తంలొ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి బంగారం దుకాణాలు. వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. కొనుగోలు చేయబోయే ఆభరణాల ఖరీదును కూడా వేర్వేరు దుకాణాల ధరలతో ఒకసారి పోల్చి చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కో దుకాణంలో ఒక్కో రకమైన మేకింగ్ చార్జీలు ఉండటం వల్ల ఈ తేడా వస్తుంది. కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు రెండు, మూడు షాపుల్లో ఆభరణాల ధరలను వాకబు చేసిన తర్వాత కొనుగోలు చేయడం ఉత్తమమంటున్నారు. నాణాలు, బిస్కెట్లయితే మేలు... బంగారాన్ని కొనేవారిలో ఎక్కువ మంది దీన్ని పెట్టుబడిగానే భావిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం కొంటే మంచిది అని ఆలోచించి కొనడం మేలని నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని పూర్తిగా పెట్టుబడి పెట్టే ఉద్దేశంతోనే కొనాలనుకుంటున్నట్లయితే నాణేలు లేదా బిస్కెట్ రూపంలో కొనడం మంచిదని పేర్కొంటున్నారు. రాళ్లు వద్దు..సాదానే ముద్దు.. రాళ్లు పొదిగిని ఆభరణాలను కొనుగోలు చేయకపోవడమే ఉత్తమమంటున్నారు. సాదా ఆభరణాలతో పోలిస్తే, రాళ్లు పొదిగిన ఆభరణాలకు ఖరీదు ఎక్కువ. మేకింగ్ చార్జీలు కూడా అధికమే. రాళ్లు పొదిగిన ఆభరణాలను అమ్మాలనుకున్నా, మార్పు చేసుకోవాలనుకున్నప్పుడు రాళ్ల ఖరీదును తీసివేసి బంగారానికి మాత్రమే విలువ కడతారు. ఈ రాళ్లు ఎంత ఖరీదైనవి అయినా కూడా కేవలం బంగారానికి మాత్రమే విలువ కడతారు కాబట్టి రాళ్లు పొదిగిన ఆభరణాలను కొనకపోవడమే ఉత్తమం అని నిపుణులంటున్నారు. కాబట్టి ఈ సారి బంగారాన్ని కొనేముందు ఈ జాగ్రత్తలన్నింటని పాటిస్తే లాభాలన్నీ మీవే అంటున్నారు నిపుణులు. -
మలబార్ స్పెషల్ అక్షయ తృతీయ జువెలరీ కలెక్షన్
హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ అక్షయ తృతీయ స్పెషల్ జువెలరీ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కలెక్షన్‌ను ఇటీవలనే కరీనా కపూర్ ఆవిష్కరించారని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక ధరలు, ఆఫర్లతో ఈ అక్షయ తృతీయ జువెలరీ కలెక్షన్‌ను అందిస్తున్నామని పేర్కొంది. అక్షయ తృతీయ కొనుగోళ్లపై వినియోగదారులు వెండిని ఉచి తంగా పొందవచ్చని వివరించింది. ముందస్తుగా బుకింగ్ చేసుకునే ఆప్షన్ ద్వారా పుత్తడి ధరల్లో ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొంది.