సాక్షి, న్యూఢిల్లీ : అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి అమ్మకాలు రెట్టింపవుతాయని జ్యూవెలర్లు అంచనా వేస్తున్నారు. ధరలు నిలకడగా ఉండటం, కొనుగోలుదారులు బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతుండటంతో ఈ ఏడాది అక్షయ తృతీయ అమ్మకాలు రికార్డుస్ధాయిలో నమోదవుతాయని ట్రేడర్లు, రిటైల్ వర్తకులు భావిస్తున్నారు.
అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారానికి డిమాండ్ 20 శాతం పెరుగుదల ఉంటుందని భారత బులియన్, జ్యూవెలర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది.మరోవైపు దేశంలో పలు ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడం, తొలివారంలో వేతన జీవులు వేతనాలు అందుకునే సమయం కావడంతో అక్షయ తృతీయ సేల్స్ ప్రోత్సాహకరంగా ఉంటాయని భారత బులియన్, జ్యూవెలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సౌరవ్ గాడ్గిల్ అంచనా వేశారు. ఈనెల 7న అక్షయ తృతీయ సందర్భంగా పలు జ్యూవెలరీ సంస్ధలు, దుకాణాలు బంగారు ఆభరణాలపై ఆఫర‍్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment