Bullion traders
-
కుప్పకూలిన పసిడి- వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: డెమొక్రటిక్ నేత జో బైడెన్ యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. ఇందుకు ప్రధానంగా 10ఏళ్ల కాలపరిమితిగల అమెరికన్ ట్రెజరీ ఈల్డ్స్ 1 శాతానికిపైగా పుంజుకోవడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 90 ఎగువకు బలపడటం వంటి అంశాలు కారణమైనట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి వారాంతాన దేశ, విదేశీ మార్కెట్లో పల్లాడియంసహా విలువైన లోహాల ధరలు ఉన్నట్టుండి పతనమయ్యాయి. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 2,000(4 శాతం) క్షీణించగా.. వెండి కేజీ మరింత అధికంగా రూ. 6,000(9 శాతం)కుపైగా పడిపోయింది. ఇక న్యూయార్క్ కామెక్స్‌లోనూ ఔన్స్ పసిడి 78 డాలర్లు కోల్పోయింది. వెండి అయితే ఏకంగా 10 శాతం కుప్పకూలింది. ఔన్స్ 25 డాలర్ల దిగువకు చేరింది. వివరాలు చూద్దాం.. (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) వ్యాక్సిన్ల ఎఫెక్ట్ అమెరికా, బ్రిటన్‌సహా పలు దేశాలు కోవిడ్-19 కట్టడికి వీలుగా వ్యాక్సిన్ల వినియోగాన్ని ప్రారంభించాయి. ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు అత్యవసర ప్రాతిపదికన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడనున్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు మార్చి తదుపరి ట్రెజరీ ఈల్డ్స్ గరిష్టానికి చేరడంతో పసిడిని హోల్డ్ చేసే వ్యయాలు పెరగనున్నట్లు తెలియజేశారు. మరోవైపు 8 నెలల తరువాత డిసెంబర్లో వ్యవసాయేతర రంగంలో నిరుద్యోగిత పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఫలితంగా కొత్త ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీలకు ఆమోదముద్ర వేయనున్న అంచనాలు బలపడ్డాయి. కాగా.. సాంకేతిక విశ్లేషణ ప్రకారం సమీప కాలంలో ఔన్స్ పసిడి 1705 డాలర్ల వరకూ వెనకడుగు వేయవచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 1780-1767 డాలర్ల స్థాయిలో సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డాయి. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్ ) పతన బాటలో ఎంసీఎక్స్‌లో వారాంతాన 10 గ్రాముల బంగారం రూ. 2,086 క్షీణించి రూ. 48,818 వద్ద ముగిసింది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ప్రారంభంలో రూ. 50,799 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 48,818 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 6,112 దిగజారి రూ. 63,850 వద్ద నిలిచింది. రూ. 69,825 వద్ద హుషారుగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 63,719 వరకూ తిరోగమించింది. (బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు) కుప్పకూలాయ్ న్యూయార్క్ కామెక్స్‌లో శుక్రవారం పసిడి ఔన్స్ 4.1 శాతం పతనమై 1,835 డాలర్ల వద్ద స్థిరపడింది. స్పాట్ మార్కెట్లోనూ 3.5 శాతం నష్టంతో 1,849 డాలర్ల వద్ద నిలిచింది. వెండి మరింత అధికంగా ఔన్స్ దాదాపు 10 శాతం పడిపోయి 24.64 డాలర్ల వద్ద ముగిసింది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
మెరుస్తున్న పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: కొత్త కరోనా స్ట్రెయిన్కుతోడు అమెరికా ప్రభుత్వ భారీ ప్యాకేజీ నేపథ్యంలో పసిడి, వెండి ధరలు మెరుస్తున్నాయి. అయితే కోవిడ్-19 కట్టడికి అమెరికా, యూకేసహా పలు దేశాలు అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తుండటంతో కొంత ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడటం కూడా పసిడి ధరలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడికి నేటి ట్రేడింగ్‌లో 1896-1910 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్ డైరెక్టర్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇదేవిధంగా 1870-1855 డాలర్ల వద్ద సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. నేటి ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.82 బలపడి రూ. 50,121 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,179 వద్ద ప్రారంభమైన పసిడి తదుపరి 50,106 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 670 జంప్‌చేసి రూ. 68,767 వద్ద కదులుతోంది. రూ. 69,000 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 68,500 వరకూ బలహీనపడింది. హుషారుగా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.35 శాతం పుంజుకుని 1,889 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం బలపడి 1,885 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.5 శాతం జంప్‌చేసి 26.59 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. మంగళవారం న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి 1883 డాలర్ల వద్ద నిలవగా.. వెండి 26.22 డాలర్ల వద్ద ముగిసింది. -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: ఉన్నట్టుండి పసిడి, వెండి ధరలు హైజంప్ చేశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దేశ, విదేశీ మార్కెట్లో భారీగా లాభపడ్డాయి. 900 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీకి తాజాగా అమెరికా కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకోవడంతో పసిడి, వెండికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనికితోడు బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త రూపంతో విస్తరిస్తున్నట్లు వెలువడిన వార్తలు దీనికి జత కలిసినట్లు నిపుణులు పేర్కొన్నారు. సెకండ్‌వేవ్‌లో భాగంగా ఇప్పటికే అమెరికా, యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్న విషయం విదితమే. అయితే యూరోపియన్ దేశాలు ప్రస్తుతం మరింత కఠిన లాక్‌డవున్‌లకు తెరతీశాయి. దీంతో మరోసారి ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడవచ్చన్న ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పుడు పలు దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. గోల్డ్ ఈటీఎఫ్‌లు పసిడిలో కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇచ్చే సంగతి తెలిసిందే. మరోవైపు ట్రేడర్లు సైతం లాంగ్ పొజిషన్లు తీసుకుంటున్నట్లు బులియన్ నిపుణులు పేర్కొన్నారు. వెరసి న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1910 డాలర్లకు చేరగా.. వెండి 5.5 శాతం జంప్‌చేసింది. దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 51,000 సమీపానికి చేరగా.. వెండి కేజీ రూ. 71,000ను దాటేసింది. ఇతర వివరాలు చూద్దాం.. జోరు తీరిలా ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 613 పెరిగి రూ. 50,917 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,515 వద్ద కనిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 50,935 వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 3,373 దూసుకెళ్లి రూ. 71,280 వద్ద కదులుతోంది. తొలుత రూ. 68,958 వద్ద ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 71,650 వరకూ జంప్‌చేసింది. కాగా.. దేశీయంగా గత వారం ఎంసీఎక్స్‌లో పసిడి 2 శాతం లాభంతో రూ. 50,304 వద్ద నిలవగా.. వెండి రూ. 67,907 వద్ద ముగిసింది. (పసిడి, వెండి.. 3 రోజుల లాభాలకు బ్రేక్) యమస్పీడ్.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 1.2 శాతం(16 డాలర్లు) ఎగసి 1,910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1.3 శాతం బలపడి 1,906 డాలర్లను తాకింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 5.6 శాతం దూసుకెళ్లి 27.51 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. గత వారం పసిడి 2.4 శాతం బలపడి 1887 డాలర్ల వద్ద నిలవగా.. వెండి 8 శాతం పుంజుకుని 26 డాలర్ల వద్ద స్థిరపడింది. (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) సపోర్ట్స్- రెసిస్టెన్స్ ప్రస్తుతం పసిడి, వెండి దూకుడు చూపుతున్న నేపథ్యంలో పలువురు సాంకేతిక నిపుణులు 1918-1925 డాలర్ల వద్ద పసిడికి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇదేవిధంగా 1874-1858 డాలర్ల స్థాయిలో సపోర్ట్స్ కనిపించవచ్చని అంచనా వేశారు. -
పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా?
ముంబై, సాక్షి: కొత్త ఏడాదిలో బంగారం ధరలు 8-10 శాతం స్థాయిలో క్షీణించవచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు ఫండమెంటల్, టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తున్నాయి. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది పసిడి, వెండి ధరలు ర్యాలీ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే 2021లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే యూకే, యూఎస్ తదితర దేశాలలో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగంలోకిరాగా.. తాజాగా మోడర్నా తయారీ వ్యాక్సిన్‌కు సైతం యూఎస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సైతం పలు దేశాలలో ఆశలు రేపుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పడితే.. కంపెనీల ఆర్జనలు మెరుగుపడే వీలుంటుంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సరళతర విధానాలనుంచి దృష్టి మరల్చవచ్చు. దీంతో పసిడి, వెండి ధరలు 8-10 శాతం స్థాయిలో దిద్దుబాటు(కరెక్షన్)కు లోనుకావచ్చని బులియన్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా జరిగితే పసిడిలో పెట్టుబడులు చేపట్టడం దీర్ఘకాలంలో మేలు చేయగలదని అభిప్రాయపడ్డారు. (పసిడి, వెండి.. 3 రోజుల లాభాలకు బ్రేక్) సెకండ్ వేవ్‌తో ప్రస్తుతం యూఎస్, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో కొన్ని దేశాలలో కఠిన ఆంక్షలను సైతం విధిస్తున్నారు. నిజానికి సంక్షోభ పరిస్థితుల్లో పసిడిని రక్షణాత్మక పెట్టుబడిగా భావిస్తుంటారు. దీంతో కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్ సంస్థలు, ఇన్వెస్టర్లు పసిడిలో కొనుగోళ్లకు ఆసక్తి చూపే విషయం విదితమే. దీనికితోడు ఇటీవల డాలరు ఇండెక్స్ 30 నెలల కనిష్టానికి చేరింది. వెరసి మరికొంతకాలం కోవిడ్-19 ప్రభావం కొనసాగితే పసిడి ధరలు రూ. 50,000కు ఎగువనే కొనసాగవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు నెలలుగా ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాములు రూ. 48,000-51,000 మధ్య కదులుతుండటం గమనార్హం! (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు) అంచనాలు ఇలా.. పసిడి ధరలపై సాంకేతికంగా చూస్తే ఇలియట్ వేవ్ విశ్లేషణ ప్రకారం గత నాలుగేళ్లలో రూ. 25,000-56,000 మధ్య 5 వేవ్స్ పూర్తయ్యాయి. దీంతో సమీప భవిష్యత్‌లో కరెక్షన్కు చాన్స్ ఉన్నట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. తద్వారా కొంతకాలం కన్సాలిడేషన్ జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. రూ. 54,000 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక మరోవైపు రూ. 48,500, 46,000, 44,300 వద్ద సపోర్ట్స్ కనిపించవచ్చని ఊహిస్తున్నారు. వెరసి 2021లో పసిడి సగటున 40,000- 50,000 శ్రేణిలో సంచరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్ట్‌లో రికార్డ్ కోవిడ్-19 భయాలతో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్‌లో పసిడి 10 గ్రాములు ఎంసీఎక్స్‌లో రూ. 57,100కు ఎగసింది. ఇది బులియన్ చరిత్రలోనే అత్యధికంకాగా.. తదుపరి ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్లపై ఆశలు కారణంగా పసిడి వెనకడుగు వేస్తూ వచ్చింది. ప్రస్తుతం కామెక్స్‌లో 1,885 డాలర్లకు చేరింది. ఇక ఎంసీఎక్స్‌లోనూ రూ. 50,300కు దిగింది. అయినప్పటికీ 2020లో పసిడి 35 శాతంపైగా ర్యాలీ చేయడం గమనార్హం! వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరాల ప్రకారం 2019లో పసిడి 1,393 డాలర్ల సమీపంలో నిలిచింది. దేశీయంగా రూ. 38,200 స్థాయిలో ముగిసింది. కాగా.. క్రెడిట్ స్వీస్ అంచనాల ప్రకారం 2021లో గరిష్టంగా 2,100 డాలర్ల సమీపానికి బలపడవచ్చు. ఇది 11 శాతం వృద్ధి. -
పసిడి, వెండి.. నెల రోజుల గరిష్టం నుంచి డీలా
న్యూయార్క్/ ముంబై: వరుసగా మూడు రోజులు ర్యాలీ బాటలో సాగిన పసిడి, వెండి ధరలు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప వెనకడుగుతో కదులుతున్నాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా లిక్విడిటీ చర్యలను కొనసాగించనున్నట్లు యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పేర్కొన్న నేపథ్యంలో పసిడి జోరందుకున్న విషయం విదితమే. వెరసి గురువారం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1900 డాలర్లను అధిగమించింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా.. దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 50,000ను దాటింది. వెండి సైతం కేజీ రూ. 68,000ను దాటేసింది. కొద్ది రోజులుగా ఫెడ్ నెలకు 120 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలో లిక్విడిటీని పంప్ చేస్తోంది. కాగా.. మరోపక్క 700 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీపై యూఎస్ కాంగ్రెస్ సమీక్షను చేపట్టనున్నట్లు వెలువడిన వార్తలు సైతం పసిడికి జోష్ నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు) స్వల్ప వెనకడుగు.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 100 క్షీణించి రూ. 50,290 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. 50,358 వద్ద బలహీనంగా ప్రారంభమైన పసిడి తదుపరి రూ. 50,242 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 712 క్షీణించి రూ. 67,555 వద్ద కదులుతోంది. తొలుత రూ. 67,999 వద్ద ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. 67,456 వరకూ బలహీనపడింది. అక్కడక్కడే.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ స్వల్పంగా 0.1 క్షీణించి 1,888 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం బలహీనపడి 1,882 డాలర్లను తాకింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.7 శాతం వెనకడుగుతో 25.98 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
రెండో రోజూ పసిడి, వెండి పరుగు
న్యూయార్క్/ ముంబై: వరుసగా రెండో రోజు పసిడి, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నెల 18న యూఎస్ కాంగ్రెస్ సహాయక ప్యాకేజీపై సమీక్షను చేపట్టే వీలున్నట్లు వెలువడిన వార్తలు పసిడికి జోష్ నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండున్నరేళ్ల కనిష్టం 90.62కు చేరడం, యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టడం వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే యూకే, కెనడా, యూఎస్ తదితర దేశాలలో వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకావడంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశంలేదని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. (పసిడి ధరలకు కోవిడ్-19 పుష్) సానుకూలంగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 137 పుంజుకుని రూ. 49,580 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత 49,510 వద్ద ప్రారంభమైంది ఇది కనిష్టంకాగా.. తదుపరి రూ. 49,626 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 318 వృద్ధితో రూ. 65,171 వద్ద కదులుతోంది. రూ. 65,000 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో రూ. 65,324 వద్ద గరిష్టానికి చేరింది. (పసిడికి ఉద్యోగ గణాంకాల దెబ్బ) హుషారుగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.3 లాభంతో 1,861 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం బలపడి 1,857 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.75 శాతం ఎగసి 24.83 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. మంగళవారం పసిడి ఫ్యూచర్స్ 1855 డాలర్ల వద్ద స్థిరపడగా.. వెండి 24.64 డాలర్ల వద్ద ముగిసింది. బులియన్ వర్గాల అంచనాల ప్రకారం పసిడికి 1870-1884 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చు. ఇదేవిధంగా 1840-1828 డాలర్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. -
పసిడి, వెండి- 2 వారాల గరిష్టం
న్యూయార్క్/ ముంబై: కొద్ది రోజుల కన్సాలిడేషన్ తదుపరి మళ్లీ బంగారం ధరలు మెరుస్తున్నాయి. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ట్రంప్ ప్రభుత్వం చైనాతో వాణిజ్య వివాదాలకు మళ్లీ తెరతీయనున్న వార్తలు పసిడికి డిమాండ్‌ను పెంచినట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం తాజాగా 12 మంది చైనా వ్యక్తులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌పై ఈ నిర్ణయాలు ప్రభావం చూపే వీలున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోపక్క కోవిడ్-19 కట్టడికి బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీలకు మద్దతు పలుకుతున్న విషయం విదితమే. దీనికితోడు తాజాగా జపాన్ ప్రభుత్వం సైతం 708 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి సన్నాహాలు చేస్తున్నట్లు వెలువడిన వార్తలు రెండు రోజులుగా పసిడి, వెండి ధరలకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1874 డాలర్లను తాకగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 50,000 మార్క్ దాటింది. దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. హుషారుగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 192 పెరిగి రూ. 50,138 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,175 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,045 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం స్వల్పంగా రూ. 67 బలపడి రూ. 65,566 వద్ద కదులుతోంది. తొలుత రూ. 65,666 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 65,363 వరకూ వెనకడుగు వేసింది. లాభాలతో.. న్యూయార్క్ కామెక్స్‌లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.45 శాతం పుంజుకుని 1,874 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం లాభంతో 1,870 డాలర్లను అధిగమించింది. వెండి సైతం 0.2 శాతం లాభంతో ఔన్స్ 24.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. నవంబర్ 23 తదుపరి ఇవి గరిష్ట ధరలుకావడం గమనార్హం! -
కోలుకున్న పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: దేశ, విదేశీ మార్కెట్లో గత వారం చివర్లో పతన బాటలో సాగిన బంగారం, వెండి ధరలు కోలుకున్నాయి. సెకండ్‌వేవ్‌లో భాగంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉండటంతో పసిడికి డిమాండ్ కనిపిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు.. ఇటీవల బంగారం డెరివేటివ్ మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టిన ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలు చేపట్టడం ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా నవంబర్ నెలలో బంగారం ధరలు రూ. 2,500 నష్టపోయినట్లు ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు. కోవిడ్-19 కల్లోలం కారణంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 10 గ్రాముల బంగారం రూ. 56,200కు చేరడం ద్వారా చరిత్రాత్మక గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు వెలువడనుండటం, అమెరికా కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనుండటం వంటి అంశాలు పసిడి ధరలకు చెక్ పెట్టే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 108 పుంజుకుని రూ. 47,900 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,272 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 47,900 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 608 బలపడి రూ. 59,730 వద్ద కదులుతోంది. తొలుత రూ. 60,000 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 59,512 వరకూ వెనకడుగు వేసింది. బలపడ్డాయ్.. న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు తాజాగా బలపడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.5 శాతం పెరిగి 1,790 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం పుంజుకుని 1,786 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 1.5 శాతం ఎగసి ఔన్స్ 22.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కుప్పకూలిన పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: వారాంతాన విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. యూఎస్‌లో థ్యాంక్స్ గివింగ్ సెలవుల నేపథ్యంలో డాలరు ఇండెక్స్ బలహీనపడగా.. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ సైతం నీరసించాయి. అయినప్పటికీ పసిడి ధరలు పతనంకావడం గమనార్హం! దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో వరుసగా ఐదో రోజు పసిడి ధరలు డీలాపడ్డాయి. ఇటీవల కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగిన బంగారం ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యమిస్తున్నట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ పదవిని చేపట్టనుండటంతో రాజకీయ అనిశ్చితికి తెరపడనున్నట్లు తెలియజేశారు. దీనికితోడు కోవిడ్-19 కట్టడికి ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు వ్యాక్సిన్లు వెలువడనున్న వార్తలు సైతం ట్రేడర్లపై ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. కాగా.. శుక్రవారం తలెత్తిన భారీ అమ్మకాల నేపథ్యంలో న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి బలహీనంగా కనిపిస్తున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. దీంతో జులైలో నమోదైన కనిష్టం 1,756 డాలర్ల వద్ద పసిడికి సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదేవిధంగా 1,842 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. నష్టాలతో ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 411 క్షీణించి రూ. 48,106 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,647 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 47,800 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 773 నష్టపోయి రూ. 59,100 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 59,950 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 57,877 వరకూ వెనకడుగు వేసింది. గత ఐదు రోజుల్లో ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు రూ. 2,100 వరకూ నష్టపోయినట్లు బులియన్ విశ్లేషకులు తెలియజేశారు. బలహీనపడ్డాయ్.. న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు తాజాగా డీలా పడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1.25 శాతం పతనమై 1,788 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ మరింత అధికంగా 1.55 శాతం(28 డాలర్లు) పడిపోయి 1,788 డాలర్లకు చేరింది. వెండి ఏకంగా 3.5 శాతం కుప్పకూలి ఔన్స్ 22.64 డాలర్ల వద్ద నిలిచింది. గత వారం పసిడి ధరలు 4 శాతంపైగా జారినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
పసిడి ధరలు ప్లస్- చమురు ధరల సెగ
న్యూయార్క్/ ముంబై: కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు విడుదలకానున్న వార్తలు ముడిచమురు ధరలకు జోష్‌నిస్తున్నాయి. మరోపక్క బంగారం, వెండి ధరలు బలహీనపడుతున్నాయి. థాంక్స్ గివింగ్ డే సందర్భంగా నేడు యూఎస్ మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం అటు చమురు, ఇటు బంగారం ధరలు లాభపడ్డాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌లోనూ బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. అయితే ఇటీవల పతన బాటలో సాగుతున్న బంగారం ధరలు నాలుగు నెలల కనిష్టాలకు చేరగా.. చమురు ధరలు మార్చి గరిష్టాలను తాకాయి. ఇతర వివరాలు చూద్దాం.. లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 161 లాభపడి రూ. 48,674 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో వెండి కేజీ రూ. 298 పుంజుకుని రూ. 60,141 వద్ద కదులుతోంది. ఇవి డిసెంబర్ ఫ్యూచర్స్ ధరలు. కాగా.. ఎంసీఎక్స్‌లో పసిడికి రూ. 48,400- 48,220 వద్ద సపోర్ట్స్ లభించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ డైరెక్టర్ మనోజ్ జైన్ అభిప్రాయపడ్డారు. ఇదేవిధంగా రూ. 48,660- 48,850 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని పేర్కొన్నారు. బలపడ్డాయ్.. న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.22 శాతం బలపడి 1,815 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,808 డాలర్లకు చేరింది. వెండి సైతం 0.2 శాతం పెరిగి ఔన్స్ 23.50 డాలర్ల వద్ద నిలిచింది. కాగా.. కామెక్స్‌లో ఔన్స్ పసిడికి 1792- 1784 డాలర్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని మనోజ్ జైన్ అభిప్రాయపడ్డారు. ఇదే విధంగా 1814-1822 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అంచనా వేశారు. చమురు జోరు న్యూయార్క్ మార్కెట్లో బుధవారం నైమెక్స్ చమురు బ్యారల్ 0.3 శాతం పుంజుకుని 45.92 డాలర్లను తాకింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 1.6 శాతం ఎగసి 48.61 డాలర్లకు చేరింది. వెరసి మార్చి తదుపరి గరిష్టాలను తాకాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మంగళవారం(24) వరకూ ఐదు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. అయితే రెండు రోజులుగా ధరలను సవరించకపోవడం గమనార్హం! విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
నాలుగో రోజూ పడిన పసిడి- వెండి
న్యూయార్క్/ ముంబై: గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్.. కోవిడ్-19కు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రాగలవన్న అంచనాలు డాలరు ఇండెక్సుకు బలాన్నిస్తుంటే.. బంగారం, వెండి ధరలను దెబ్బతీస్తున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.2 శాతం పుంజుకుంది. దీంతో వరుసగా నాలుగో రోజు దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు డీలా పడ్డాయి. ఎమర్జెన్సీ ప్రాతిపదికన తమ వ్యాక్సిన్లకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించగలదంటూ ఫైజర్, మోడర్నా అంచనా వేయడంతో పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. పసిడికి రూ. 50,100-49,900 వద్ద సపోర్ట్ లభించవచ్చని, ఇదేవిధంగా రూ. 50,500-50,700 స్థాయిలో రెసిస్టెన్స్ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ, కరెన్సీ హెడ్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇక ఎంసీఎక్స్‌లో వెండికి రూ. 62,100-61,100 వద్ద సపోర్ట్స్ లభించే వీలున్నదని, రూ. 63,000-63,500 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. ఇతర వివరాలు చూద్దాం.. బలహీనంగా ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 139 తక్కువగా రూ. 50,186 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. రూ. 50,200 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి రూ. 50,149 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 431 క్షీణించి రూ. 62,112 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,160 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,001 వరకూ వెనకడుగు వేసింది. వెనకడుగులో.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వెనకడుగుతో కదులుతున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.4 శాతం నష్టంతో1,866 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం తక్కువగా 1,867 డాలర్లకు చేరింది. వెండి 0.8 శాతం క్షీణతతో ఔన్స్ 24.26 డాలర్ల వద్ద కదులుతోంది. నష్టాలతోనే.. ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 438 క్షీణించి రూ. 50,328 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,646 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,053 వద్ద కనిష్టానికి చేరింది. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 718 నష్టంతో రూ. 62,530 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 63,280 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,023 వరకూ వెనకడుగు వేసింది. -
పసిడి- వెండి అక్కడక్కడే..
న్యూయార్క్/ ముంబై: కోవిడ్-19కు వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టగలమని తాజాగా మోడర్నా ఇంక్ పేర్కొనడంతో పసిడికి డిమాండ్ మందగించింది. దీంతో విదేశీ మార్కెట్లో పసిడి ధరలు సోమవారం 1.3 శాతం క్షీణించాయి. దేశీయంగానూ పసిడి, వెండి ధరలు స్వల్పంగా వెనకడుగు వేశాయి. సాధారణంగా సంక్షోభ పరిస్థితులలో పసిడికి డిమాండ్ పుట్టే సంగతి తెలిసిందే. యూరోపియన్ దేశాలతోపాటు.. యూఎస్‌లోనూ 40 రాష్ట్రాలలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరగడంతో ప్రపంచ కేంద్ర బ్యాంకులు మరోసారి ప్యాకేజీలకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక మరోవైపు కోవిడ్-19కు ధీటుగా ప్యాకేజీని విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ను సమాయత్తపరచనున్నట్లు యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ పేర్కొన్నారు. అంతేకాకుండా లాక్‌డవున్‌ల విధింపు చేపట్టబోమంటూ యూఎస్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పసిడి, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లుగా ట్రేడవుతున్నాయి. నామమాత్రంగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 35 తక్కువగా రూ. 50,795 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,888 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,738 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 117 క్షీణించి రూ. 63,574 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,715 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 63,483 వరకూ వెనకడుగు వేసింది. ఫ్లాట్‌గా.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఫ్లాట్‌గా కదులుతున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.15 శాతం నష్టంతో1,885 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,888 డాలర్లకు చేరింది. వెండి సైతం నామమాత్ర క్షీణతతో ఔన్స్ 24.80 డాలర్ల వద్ద కదులుతోంది. నేలచూపుతో ఎంసీఎక్స్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం రూ. 141 క్షీణించి రూ. 50,845 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 51,015 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,150 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ. 191 తగ్గి రూ. 63,610 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 64,089 వరకూ ఎగసిన వెండి తదుపరి రూ. 62,160 వరకూ వెనకడుగు వేసింది. -
మెరిసిన పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై : అమెరికా అధ్యక్ష పదవి రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయంవైపు సాగుతున్న నేపథ్యంలో వారాంతాన బంగారం, వెండి ధరలు హైజంప్ చేశాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్ లో పసిడి ఔన్స్ 1950 డాలర్లను అధిగమించింది. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల(స్టిములస్)కు బైడెన్ విజయం దోహదం చేయవచ్చన్న అంచనాలు పసిడి ధరలకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19తో మందగించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా సహాయక ప్యాకేజీలను అమలు చేయాలంటూ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సైతం తాజాగా అభిప్రాయపడటం జత కలసినట్లు తెలియజేశారు. బైడెన్ గెలుపొందితే కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. లాభాలతోనే.. ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 113 పుంజుకుని రూ. 52,168 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 52,450 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదేవిధంగా 51,711 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,102 లాభపడి రూ. 65,355 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 66,244 వరకూ జంప్ చేసిన వెండి తదుపరి రూ. 64,024 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో ఆటుపోట్ల మధ్య శుక్రవారం బంగారం ధరలు లాభపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం పుంజుకుని 1,952 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో నామమాత్ర లాభంతో 1,951 డాలర్లకు చేరింది. వెండి సైతం దాదాపు 2 శాతం ఎగసి ఔన్స్ 25.66 డాలర్ల వద్ద స్థిరపడింది. -
3 రోజుల లాభాలకు బ్రేక్- పసిడి డీలా
ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న అంచనాలతో మూడు రోజులుగా జోరు చూపిన పసిడి, వెండి ధరలు డీలా పడ్డాయి. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు, మరోపక్క ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష వంటి అంశాల నేపథ్యంలో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ పసిడి సాంకేతికంగా కీలకమైన 1900 డాలర్లను అధిగమించడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు బలపడటం కూడా దీనికి కారణమైనట్లు అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 దెబ్బకు యూరోపియన్ దేశాలలో లాక్డవున్లు విధించడం, అమెరికాలోనూ కరోనా వైరస్ సోకిన కేసులు పెరుగుతుండటం వంటి ప్రతికూలతలతో ఇటీవల పసిడి, వెండి ధరలు ర్యాలీ బాటలో సాగిన విషయం విదితమే. ప్రస్తుత ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. నష్టాలతో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 225 క్షీణించి రూ. 51,373 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 51,465 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 51,260 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 977 కోల్పోయి రూ. 61,708 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 61,980 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,415 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో వరుసగా మూడు రోజులపాటు లాభపడిన బంగారం ధరలు ప్రస్తుతం వెనకడుగుతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.4 శాతం క్షీణించి 1,903 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం నీరసించి 1,899 డాలర్లకు చేరింది. వెండి 1.5 శాతం డీలాపడి ఔన్స్ 23.97 డాలర్ల వద్ద కదులుతోంది. లాభపడ్డాయ్ వరుసగా మూడో రోజు ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల బంగారం రూ. 553 ఎగసి రూ. 51,620 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,630 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,789 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 648 పుంజుకుని రూ. 62,655 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,791 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,612 వరకూ వెనకడుగు వేసింది. -
బంగారం, వెండి ధరలు- అక్కడక్కడే
కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి అటూఇటుగా కదులుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి బంగారం, వెండి ధరలపై ప్రభావాన్ని చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్వల్ప నష్టాలతో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 36 తగ్గి రూ. 50,925 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 239 క్షీణించి రూ. 62,042 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి 51,065 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,819 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక తొలుత ఒక దశలో 62,085 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,881 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి దాదాపు యథాతథంగా 1,911 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ నామమాత్ర వృద్ధితో 1,909 డాలర్ల సమీపానికి చేరింది. వెండి మాత్రం 0.4 శాతం క్షీణించి ఔన్స్ 24.49 డాలర్ల వద్ద కదులుతోంది. స్వల్ప లాభాలు ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల బంగారం నామమాత్రంగా రూ. 20 పెరిగి రూ. 50,950 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,114 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,704 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 344 పుంజుకుని రూ. 62,250 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,580 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,510 వరకూ వెనకడుగు వేసింది. -
లాభాల్లో బంగారం- వెండి ధరలు
కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న బంగారం, వెండి ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్‌లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి మరోసారి స్టాక్ మార్కెట్లను దెబ్బతీసినప్పటికీ.. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీలలో ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్-19 కేసులు బంగారం, వెండి తదితర విలువైన లోహాలకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు రక్షణాత్మక పెట్టుబడిగా కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్ వంటి సంస్థలు పసిడిలో కొనుగోళ్లకు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. సానుకూలం ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 110 పుంజుకుని రూ. 51,040 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 544 బలపడి రూ. 62,450 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి 51,114 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 51,002 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక తొలుత ఒక దశలో 62,548 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 62,312 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం బలపడి 1,910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం పుంజుకుని 1,908 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 0.7 శాతం ఎగసి ఔన్స్ 24.59 డాలర్ల వద్ద కదులుతోంది. అటూఇటుగా ఎంసీఎక్స్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం స్వల్పంగా రూ. 86 పెరిగి రూ. 50,925 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,125 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,552 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 469 క్షీణించి రూ. 61,980 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,480 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,251 వరకూ వెనకడుగు వేసింది. -
ప్యాకేజీ ఆశలు- రూ. 51,000కు పసిడి
దేశీ మార్కెట్లో వరుసగా రెండు రోజులు లాభపడిన బంగారం, వెండి ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 102 పెరిగి రూ. 51,012 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 451 లాభపడి రూ. 63,575 వద్ద కదులుతోంది. ప్యాకేజీకి రెడీ.. కోవిడ్-19ను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతిపాదించిన 2.2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీపై ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలను బుధవారం సైతం కొనసాగించనున్నట్లు హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా వారాంతంలోగా ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ లభించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు సహచర రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. భారీ ప్యాకేజీకి సిద్ధమంటూ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో రెండు రోజులుగా పసిడి, వెండి ధరలకు జోష్‌వచ్చినట్లు బులియన్ నిపుణులు తెలియజేశారు. ప్యాకేజీ కారణంగా లభించే చౌక నిధులు రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి తదితర విలువైన లోహాల కొనుగోలుకి మళ్లవచ్చన్న అంచనాలు దీనికి కారణమని తెలియజేశారు. మంగళవారమిలా వరుసగా రెండో రోజు మంగళవారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 226 బలపడి రూ. 50,913 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,940 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,491 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 970 ఎగసి రూ. 63,065 వద్ద నిలిచింది. ఒక దశలో 63,259 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,662 వరకూ క్షీణించింది. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.5 శాతం లాభపడి 1,924 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.6 శాతం ఎగసి 1,919 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి సైతం 1 శాతం పురోగమించి ఔన్స్ 25.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
రూ. 50,000 దిగువకు బంగారం ధర
ఈ కేలండర్ ఏడాది(2020) తొలి 8 నెలల్లో 30 శాతం దూసుకెళ్లడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకున్న బంగారం ధరలు రెండు నెలలుగా నేలచూపులతో కదులుతున్నాయి. తాజాగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 50,000 దిగువకు చేరింది. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ సహాయక ప్యాకేజీలపై అనిశ్చితి, ట్రేడర్ల లాభాల స్వీకరణ, డాలర్ బలపడటం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలయ్యేవరకూ సహాయక ప్యాకేజీపై చర్చించేదిలేదంటూ ప్రకటించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 94 దిగువనే కదులుతుండటం పసిడి ధరలకు చెక్ పెడుతున్నట్లు తెలియజేశారు. కాగా.. పసిడికి 1840 డాలర్ల వద్ద బలమైన మద్దతు లభించే వీలున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. అయితే 1920 డాలర్లను దాటితేనే ర్యాలీ బాట పట్టే వీలున్నదని అభిప్రాయపడింది. ఇదే విధంగా 1840 డాలర్ల దిగువకు చేరితే మరింత నీరసించవచ్చని అంచనా వేసింది. ఇతర వివరాలు చూద్దాం.. నేలచూపులో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 68 క్షీణించి రూ. 49,980 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 121 నష్టపోయి రూ. 60,298 వద్ద కదులుతోంది. బంగారం బోర్లా బంగారం, వెండి ధరలు బుధవారం డీలాపడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 478 నష్టపోయి రూ. 50,048 వద్ద ముగిసింది. తొలుత 50,361 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,880 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ స్వల్పంగా రూ. 152 క్షీణించి రూ. 60,419 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 60,932 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 59,338 వరకూ నీరసించింది. నష్టాలలో న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్వల్ప వెనకడుగులో ఉన్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.12 శాతం నీరసించి 1,889 డాలర్ల దిగువకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ 0.13 శాతం బలహీనపడి 1,885 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ నామమాత్ర నష్టంతో 23.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
పసిడి, వెండి.. 2 రోజుల ర్యాలీకి బ్రేక్
దేశ, విదేశీ మార్కెట్లలో రెండు రోజులపాటు జోరు చూపిన పసిడి, వెండి ధరలు మళ్లీ వెనకడుగు వేస్తున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తొలి డిబేట్ ప్రారంభమైన నేపథ్యంలో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో లాభాల స్వీకరణకు తెరతీసినట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో చర్చల తదుపరి ఈ వారంలో సహాయక ప్యాకేజీ డీల్ కుదిరే వీలున్నట్లు యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ మంగళవారం పేర్కొన్న నేపథ్యంలో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు జంప్‌చేసిన సంగతి తెలిసిందే. ఇతర వివరాలు చూద్దాం.. నష్టాలవైపు ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 171 తగ్గి రూ. 50,510 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,167 పతనమై రూ. 61,299 వద్ద కదులుతోంది. లాభపడ్డాయ్ వరుసగా రెండో రోజు మంగళవారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. 10 గ్రాముల పసిడి రూ. 548 బలపడి రూ. 50,681 వద్ద ముగిసింది. తొలుత 50,739 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,059 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 2,070 జంప్‌చేసి రూ. 62,166 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 62,598 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 60,060 వరకూ నీరసించింది. నేలచూపులో.. న్యూయార్క్ కామెక్స్‌లో మంగళవారం సైతం జోరు చూపిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం డీలా పడ్డాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.4 శాతం నష్టంతో 1,896 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం నీరసించి 1,891 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ దాదాపు 2 శాతం పతనమై 24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కన్సాలిడేషన్‌లో పసిడి, వెండి ధరలు
దేశ, విదేశీ మార్కెట్లలో సోమవారం పుంజుకున్న పసిడి, వెండి ధరలు కన్సాలిడేషన్ బాట పట్టాయి. ప్రస్తుతం అటూఇటుగా ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్ కాంగ్రెస్‌లో చర్చలు ప్రారంభంకానుండటం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటం వంటి అంశాలు సోమవారం పసిడి, వెండి ధరలకు బలాన్నిచ్చినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. మిశ్రమ బాట ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50 లాభపడి రూ. 50,183 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ. 98 నష్టంతో రూ. 60,298 వద్ద కదులుతోంది. లాభపడ్డాయ్ సోమవారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. 10 గ్రాముల పసిడి రూ. 474 బలపడి రూ. 50,133 వద్ద ముగిసింది. తొలుత 50,197 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,315 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 1,369 ఎగసి రూ. 60,396 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 60,495 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 57,652 వరకూ నీరసించింది. ఫ్లాట్‌గా.. న్యూయార్క్ కామెక్స్‌లో సోమవారం హెచ్చుతగ్గుల మధ్య బలపడిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1883 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లో నామమాత్ర నష్టంతో 1879 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ దాదాపు యథాతథంగా 23.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
పసిడి@ 2 నెలల కనిష్టం
ముందురోజు విదేశీ మార్కెట్లో 2 శాతం పతనంకావడం ద్వారా రెండు నెలల కనిష్టాన్ని తాకిన పసిడి, వెండి ధరలు మరోసారి డీలా పడ్డాయి. ఈ బాటలో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో బుధవారం పతనమైన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నీరసంగా ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి(94.4) బలపడటం వంటి అంశాలు పసిడి, వెండి ధరలను దెబ్బతీస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు రెండు నెలల క్రితం సరికొత్త గరిష్టాలను తాకిన తదుపరి కన్సాలిడేషన్ బాటలో సాగిన బంగారం, వెండి ధరలు ఇటీవల దిద్దుబాటు(కరెక్షన్)కు లోనవుతున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 1800 డాలర్ల దిగుకు? ఈ ఏడాది జులై 17న పసిడి ధరలు ఔన్స్ 1,795 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకినట్లు బులియన్ విశ్లేషకులు తెలియజేశారు. ప్రస్తుతం పసిడి ధరలో కరెక్షన్ కారణంగా బేర్ ఆపరేటర్లు ఈ స్థాయి వరకూ ధరలను పడగొట్టేందుకు ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు. 1800 డాలర్ల దిగువకు ధరలు జారితే.. పసిడి మరింత బలహీనపడేందుకు వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే కోవిడ్-19 మరింత విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి విఘాతం కలగవచ్చని.. మళ్లీ లాక్‌డవున్‌ల కాలంవస్తే పలు దేశాల జీడీపీలు మాంద్య పరిస్థితుల్లో చిక్కుకోవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు బంగారానికి డిమాండ్ పెంచగలవని తెలియజేశారు. వీక్.. వీక్.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 173 క్షీణించి రూ. 49,335 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,850 పతనమై రూ. 56,638 వద్ద కదులుతోంది. ఎంసీఎక్స్‌లో బుధవారం మరోసారి బంగారం, వెండి ధరలు డీలా పడ్డాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 873 క్షీణించి రూ. 49,508 వద్ద ముగిసింది. తొలుత 50,380 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,444 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 2,725 పతనమై రూ. 58,488 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 60,487 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 58,037 వరకూ నీరసించింది. 2 నెలల కనిష్టం న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం బంగారం, వెండి ధరలు డీలా పడ్డాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1869 డాలర్లకు క్షీణించగా.. స్పాట్ మార్కెట్లోనూ 1863 డాలర్లవరకూ పతనమైంది. ఒక దశలో 1856 డాలర్ల వద్ద రెండు నెలల కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో వెండి సైతం ఔన్స్ 23.11 డాలర్లకు వెనకడుగు వేసింది. కాగా.. ప్రస్తుతం పసిడి 0.4 నీరసించి 1,862 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం బలహీనపడి 1,856 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ 3.3 శాతం పతనమై 22.35 డాలర్ల వద్ద కదులుతోంది. -
బంగారం- వెండి.. కోలుకున్నాయ్
ఇటీవల ఆటుపోట్ల మధ్య కదులుతున్న పసిడి, వెండి ధరలు ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లలో కోలుకున్నాయి. అయితే.. ఇటీవల వెలువడిన గణాంకాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా రికవరీ బాట పట్టినట్లు సంకేతాలివ్వడంతో బంగారం, వెండి ధరలు కొద్ది రోజులుగా నేలచూపులకు లోనవుతూ వచ్చాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు పుంజుకోవడం కూడా పసిడి ధరలను దెబ్బతీస్తున్నట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో ఫెడరల్ రిజర్వ్ 2 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించేటంతవరకూ నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు తెలియజేసింది. నిరుద్యోగిత తగ్గడం, హౌసింగ్‌కు డిమాండ్ వంటివి బలపడుతుండటం రికవరీకి సంకేతాలని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తూనే ఉన్న కారణంగా తిరిగి బంగారం ధరలు బలపడే అవకాశమున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. లాభాలతో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 59 పుంజుకుని రూ. 51,512 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 168 లాభపడి రూ. 68,310 వద్ద కదులుతోంది. వెనకడుగు.. ఎంసీఎక్స్‌లో గురువారం బంగారం, వెండి ధరలు డీలా పడ్డాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 371 క్షీణించి రూ. 51,453 వద్ద ముగిసింది. తొలుత 51,710 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి 51,181 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 639 నష్టంతో రూ. 68,142 వద్ద స్థిరపడింది. రూ. 68,280 వద్ద ప్రారంభమైన వెండికి ఇదే ఇంట్రాడే గరిష్టంకాగా.. ఒక దశలో రూ. 67,150 వరకూ వెనకడుగు వేసింది. కామెక్స్‌లో.. ప్లస్ న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.5 శాతం పుంజుకుని 1,960 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం లాభపడి 1952 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.76 శాతం ఎగసి 27.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారం- వెండి.. నేలచూపులో
లక్ష్యానికి అనుగుణంగా ధరలు బలపడేటంతవరకూ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే కొనసాగించనున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. తాజాగా స్పష్టం చేసింది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ బుధవారం పరపతి నిర్ణయాలు ప్రకటించింది. దీంతో తొలుత జోరందుకున్న బంగారం, వెండి ధరలు తదుపరి పతన బాట పట్టాయి. ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఇటీవల బంగారం, వెండి ధరలు బలపడటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం.. దిగువముఖంగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 449 నష్టంతో రూ. 51,375 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,061 క్షీణించి రూ. 67,720 వద్ద కదులుతోంది. మిశ్రమంగా.. ఎంసీఎక్స్‌లో బుధవారం బంగారం ధర స్వల్పంగా బలపడగా.. వెండి వెనకడుగు వేసింది. 10 గ్రాముల పుత్తడి రూ. 55 పుంజుకుని రూ. 51,824 వద్ద ముగిసింది. తొలుత 52,127 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,750 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 186 క్షీణించి రూ. 68,781 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 69,249 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 68,600 వరకూ నష్టపోయింది. కామెక్స్‌లో..డీలా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు బలహీనపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1.25 శాతం క్షీణించి 1,946 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 1 శాతం వెనకడుగుతో 1939 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మరింత అధికంగా ఔన్స్ 2 శాతం పతనమై 26.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
రెండో రోజూ బంగారం- వెండి.. జోరు
వరుసగా రెండో రోజు పుత్తడి, వెండి ధరలు మెరుస్తున్నాయి. అటు విదేశీ మార్కెట్లో అంటే న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1975 డాలర్లను తాకగా. . ఇటు దేశీయంగా డెరివేటివ్ విభాగంలో 10 గ్రాములు రూ. 52,000కు చేరువైంది. ఇక ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 69,400కు చేరింది. వెరసి బంగారం, వెండి ధరలు తిరిగి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. వివరాలు చూద్దాం.. జోరుగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 208 బలపడి రూ. 51,895 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 435 పుంజుకుని రూ. 69,400 వద్ద కదులుతోంది. లాభాలతో ఎంసీఎక్స్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. 10 గ్రాముల బంగారం రూ. 368 పుంజుకుని రూ. 51,687 వద్ద ముగిసింది. తొలుత 51,847 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,334 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,037 ఎగసి రూ. 68,965 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 69,200 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,906 వరకూ నష్టపోయింది. కామెక్స్‌లో అప్ వరుసగా రెండో రోజు న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.6 శాతం పుంజుకుని 1,975 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.45 శాతం బలపడి 1965 డాలర్ల ఎగువన కదులుతోంది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.2 శాతం ఎగసి 27.66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారం- వెండి.. పతన బాటలో
కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న పుత్తడి, వెండి ధరలు తాజాగా క్షీణ పథం పట్టాయి. అటు విదేశీ మార్కెట్లోనూ, ఇటు దేశీ మార్కెట్లోనూ డెరివేటివ్ విభాగంలో నష్టాలతో ట్రేడవుతున్నాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్, ఎంసీఎక్స్‌లో వెనకడుగులో కదులుతున్నాయి. వివరాలు చూద్దాం.. నేలచూపు.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 454 క్షీణించి రూ. 51,320 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1061 కోల్పోయి రూ. 67,930 వద్ద కదులుతోంది. నాలుగో రోజూ ఎంసీఎక్స్‌లో వరుసగా నాలుగో రోజు గురువారం పుత్తడి బలపడింది. 10 గ్రాములు రూ. 372పెరిగి రూ. 51,774 వద్ద ముగిసింది. తొలుత 51,851 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,242 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 548 ఎగసి రూ. 68,991 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 69,768 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 68,471 వరకూ క్షీణించింది. కాగా.. పసిడి, వెండి ధరల నాలుగు రోజుల నష్టాలకు సోమవారం చెక్ పడిన విషయం విదితమే. కామెక్స్‌లో వీక్ న్యూయార్క్ కామెక్స్‌లో గురువారం బలపడిన బంగారం, వెండి ధరలు నేటి ట్రేడింగ్‌లో వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.69 శాతం క్షీణించి 1,947 డాలర్ల దిగువకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం నీరసించి 1940 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.75 శాతం పతనమై 26.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గురువారం ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధరలు చివర్లో పుంజుకోవడం గమనార్హం! -
వెనకడుగులో.. బంగారం- వెండి
ముందురోజు ఒడిదొడుకుల మధ్య దేశీ ఫ్యూచర్స్ మార్కెట్లో బలపడిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలాపడ్డాయి. నాలుగు రోజుల నష్టాల నుంచి సోమవారం బయటపడిన పసిడి ధరలు.. మంగళవారం చివర్లో పుంజుకున్నాయి. తద్వారా వరుసగా రెండు రోజులపాటు లాభపడ్డాయి. అయితే ప్రస్తుతం విదేశీ మార్కెట్లో వెనకడుగు వేయడంతో దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ బలహీనపడ్డాయి. వివరాలు ఇలా.. నేలచూపులో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 200 నష్టంతో రూ. 51,153 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 489 క్షీణించి రూ. 68,005 వద్ద కదులుతోంది. రెండో రోజూ జోరు వరుసగా రెండో రోజు మంగళవారం పసిడి, వెండి ధరలు ఊపందుకున్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 288 ఎగసి రూ. 51,353 వద్ద ముగిసింది. తొలుత 51,406 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,629 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 223 బలపడి రూ. 68,494 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,713 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 66,155 వరకూ నీరసించింది. నాలుగు రోజుల వరుస నష్టాలకు సోమవారం చెక్ పడగా.. పసిడి రూ. 387 ఎగసి రూ. 51,065 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో వెండి మరింత అధికంగా రూ. 1,005 జంప్‌చేసి రూ. 68,271 వద్ద స్థిరపడింది. కామెక్స్‌లో వీక్ ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు నీరసించాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.3 శాతం క్షీణించి 1,937 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లో 0.1 శాతం తక్కువగా 1930 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి సైతం ఔన్స్ 0.5 శాతం బలహీనపడి 26.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మంగళవారం తొలుత పసిడి, వెండి ధరలు క్షీణించినప్పటికీ చివర్లో పుంజుకోవడం గమనార్హం! -
బంగారం- వెండి.. మళ్లీ నష్టాలవైపు
దేశీ ఫ్యూచర్స్ మార్కెట్లో సోమవారం.. నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడిన పసిడి ధరలు.. తాజాగా డీలాపడ్డాయి. అయితే విదేశీ మార్కెట్లో సోమవారం సైతం నేలచూపులతోనే నిలవడానికితోడు.. నేటి ట్రేడింగ్‌లోనూ వెనకడుగుతో కదులుతున్నాయి. వెరసి ప్రస్తుతం అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్‌లోనూ నష్టాలతో కదులుతున్నాయి. వివరాలు ఇలా.. నీరసంగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 225 నష్టంతో రూ. 50,840 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 407 క్షీణించి రూ. 67,864 వద్ద కదులుతోంది. సోమవారం జోరు పసిడి ధరల నాలుగు రోజుల వరుస నష్టాలకు సోమవారం చెక్ పడింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 387 ఎగసి రూ. 51,065 వద్ద ముగిసింది. తొలుత 51,200 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,680 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,005 జంప్‌చేసి రూ. 68,271 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,450 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,636 వరకూ నీరసించింది. వెండి ప్లస్.. సోమవారం తొలుత బలపడినప్పటికీ న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు చివర్లో నీరసించాయి. తిరిగి నేటి ట్రేడింగ్‌లోనూ బంగారం బలహీనపడగా.. వెండి బలపడింది. ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.3 శాతం క్షీణించి 1,930 డాలర్ల దిగువకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం నష్టంతో 1924 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మాత్రం ఔన్స్ 0.7 శాతం పుంజుకుని 26.91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు రెండు రోజులు బలపడితే.. రెండు రోజులు బలహీనపడుతున్న సంగతి తెలిసిందే. -
బంగారం- వెండి.. మూడో రోజూ దూకుడు
వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు, సావరిన్ ఫండ్స్ తదితర సంస్థలు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం ఇందుకు దోహదం చేస్తోంది. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ మరోసారి ధరలు బలపడ్డాయి. ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే ప్రాధాన్యమివ్వనున్నట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పేర్కొనడంతో వారాంతాన బంగారం, వెండి ధరలు ఆటుపోట్ల నుంచి బయటపడి ర్యాలీ బాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా.. గత రెండు రోజుల జోరును కొనసాగిస్తూ బంగారం, వెండి.. ధరలు కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 341 బలపడి రూ. 52,042 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,282 ఎగసి రూ. 68,600 వద్ద కదులుతోంది. సోమవారం ప్లస్‌లో వరుసగా రెండో రోజు సోమవారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 253 పెరిగి రూ. 51,701 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,875 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,460 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,342 జంప్‌చేసి రూ. 67,318 వద్ద నిలిచింది. ఒక దశలో 68,614 వరకూ బలపడిన వెండి తదుపరి రూ. 66,178 వరకూ పతనమైంది. కామెక్స్‌లోనూ.. మూడో రోజూ న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.8 శాతం లాభపడి 1,993 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1 శాతం బలపడి 1987 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి సైతం ఔన్స్ 1.5 శాతం ఎగసి 29 డాలర్లను అధిగమించి ట్రేడవుతోంది. ఆగస్ట్ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. -
బంగారం: రెండో దశ కరెక్షన్కు చాన్స్?!
గత ఐదు రోజులుగా నేలచూపులకే పరిమితమవుతున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ.. వరున నష్టాలకు చెక్ పెడుతూ లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 176 పెరిగి రూ. 51,110వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 113 బలపడి రూ. 64,120 వద్ద కదులుతోంది. ఈ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. రెండు వారాలుగా పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారమిలా ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల పసిడి రూ. 345 క్షీణించి రూ. 50,924 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,533 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,820 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,562 కోల్పోయి రూ. 64,007 వద్ద నిలిచింది. ఒక దశలో 66,159 వరకూ జంప్‌చేసిన వెండి తదుపరి రూ. 63,766 వరకూ నీరసించింది. ఎంసీఎక్స్‌లో ఇటీవల నమోదైన గరిష్టం రూ. 56,200 నుంచి పసిడి ధరలు రూ. 5,000కుపైగా దిగిరాగా.. వెండి మరింత అధికంగా రూ. 78,000 స్థాయి నుంచి రూ. 14,000 వరకూ పతనంకావడం గమనార్హం! కామెక్స్‌లో ప్లస్.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.6 శాతం బలపడి 1,934 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో నామమాత్ర లాభంతో 1,930 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి ఔన్స్ 0.8 శాతం ఎగసి 26.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఆశలు, అమెరికా, చైనా మధ్య ఒప్పందంపై అంచనాల కారణంగా మంగళవారం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించినట్లు నిపుణులు తెలియజేశారు. మళ్లీ పతనం అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డ్ గరిష్టం 2075 డాలర్ల నుంచి రెండు వారాల క్రితం పతన బాట పట్టిన పసిడి ధరలు మరోసారి బ్రేక్‌డవున్ కావచ్చని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. చార్టుల ప్రకారం ఈ వారంలోనే ఇందుకు వీలున్నట్లు చెబుతున్నారు. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1915 డాలర్ల దిగువకు చేరితే సాంకేతికంగా మరింత బలహీనపడవచ్చని అంచనా వేశారు. ఇది గరిష్ట స్థాయిలవద్ద కొనుగోలు చేసిన ట్రేడర్లలో భయాలకు కారణమై అమ్మకాలు మరింత పెరిగే వీలున్నదని వివరించారు. అయితే 1800 డాలర్ల వద్ద తొలి సపోర్ట్ కారణంగా ఔన్స్బ్యాక్ కావచ్చని తెలియజేశారు. -
అక్షయ తృతీయ : భారీ సేల్స్‌పై జ్యూవెలర్ల అంచనా
సాక్షి, న్యూఢిల్లీ : అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి అమ్మకాలు రెట్టింపవుతాయని జ్యూవెలర్లు అంచనా వేస్తున్నారు. ధరలు నిలకడగా ఉండటం, కొనుగోలుదారులు బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతుండటంతో ఈ ఏడాది అక్షయ తృతీయ అమ్మకాలు రికార్డుస్ధాయిలో నమోదవుతాయని ట్రేడర్లు, రిటైల్ వర్తకులు భావిస్తున్నారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారానికి డిమాండ్ 20 శాతం పెరుగుదల ఉంటుందని భారత బులియన్, జ్యూవెలర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది.మరోవైపు దేశంలో పలు ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడం, తొలివారంలో వేతన జీవులు వేతనాలు అందుకునే సమయం కావడంతో అక్షయ తృతీయ సేల్స్ ప్రోత్సాహకరంగా ఉంటాయని భారత బులియన్, జ్యూవెలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సౌరవ్ గాడ్గిల్ అంచనా వేశారు. ఈనెల 7న అక్షయ తృతీయ సందర్భంగా పలు జ్యూవెలరీ సంస్ధలు, దుకాణాలు బంగారు ఆభరణాలపై ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. -
ధనత్రయోదశికి ధరల షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ధనత్రయోదశి రోజు బంగారం కొనడాన్ని శుభప్రదంగా భావించే ఆనవాయితీ ఉన్నా ఈసారి అధికధరలతో బంగారం కొనుగోళ్లకు మగువలు పెద్దగా ఆసక్తి కనబరచలేదని వర్తకులు పేర్కొన్నారు. ప్రధానంగా ఉత్తరాదిలో ధనత్రయోదశికి బంగారం కొనుగోలుకు మహిళలు మొగ్గుచూపుతారు. దుకాణాలకు ప్రజలు భారీగానే తరలివస్తున్నా ధరల కారణంగా బంగారం విక్రయాలు ఆశాజనకంగా లేవని, ప్రీ బుకింగ్‌లతో కలుపుకుని అమ్మకాల్లో కేవలం 5 నుంచి 7 శాతం మాత్రమే పెరుగుదల నమోదైందని అఖిల భారత జెమ్ అండ్ జ్యూవెలరీ కౌన్సిల్ చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ చెప్పారు. పదిగ్రాముల బంగారం రూ 32,000 దాటడంతో పలువురు కొనుగోలుదారులు ఆభరణాల కొనుగోలుకు వెనుకాడుతున్నారు. గత ఏడాది ధనత్రయోదశి రోజున దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల పసిడి రూ 30,710 కాగా, ఇప్పుడు రూ 32,690కి ఎగబాకింది. అధిక ధరలతో బంగారానికి డిమాండ్ తగ్గిందని, వినియోగదారులు ఆభరణాల కంటే బంగారం, వెండి నాణేల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని ఢిల్లీ బులియన్ అసోసియేషన్‌కు చెందిన సురేందర్ జైన్ పేర్కొన్నారు. బంగారం ధరల పెరుగుదలతో మార్కెట్లో స్ధబ్ధత నెలకొందని, ఈసారి బంగారు నాణేలకు కార్పొరేట్ వర్గాల నుంచే డిమాండ్ నెలకొందని ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేష్ ఖోస్లా వెల్లడించారు. -
భారీగా పడిపోయిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు పడిపోయి 30,435 రూపాయల వద్ద నమోదైంది. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ క్షీణించడం, గ్లోబల్‌గా ఈ విలువైన మెటల్‌కు సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్ మార్కెట్లో ధరలు క్షీణించినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలూ స్వల్పంగా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ కాస్త తగ్గడంతో, కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డైంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్ బలపడింది. దీంతో ఈ విలువైన మెటల్‌కు గ్లోబల్‌గా డిమాండ్ తగ్గింది. గ్లోబల్‌గా గోల్డ్ 0.65 శాతం పడిపోయి, ఔన్స్‌కు 1,215.50 డాలర్లుగా నమోదైంది. బలహీనమైన గ్లోబల్ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్ తగ్గిపోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదయ్యాయి. కాగ, నిన్న ఈ విలువైన మెటల్ ధర 150 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. -
తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలు తగ్గి రూ.30,740గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు, అంతర్జాతీయంగా బంగారానికి బలహీనమైన సంకేతాలు వీస్తుండటంతో బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి కూడా కేజీకి 230 రూపాయలు తగ్గింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో, కేజీ వెండి ధర 230 రూపాయలు తగ్గి, 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. యూరోపియన్ యూనియన్ల నుంచి వచ్చే కార్లపై టారిఫ్‌లను విధించకుండా ఉండేందుకు అమెరికా అంగీకరించడంతో, వాణిజ్య యుద్ధ భయాలు కాస్త సద్దుమణిగాయి. దీంతో డాలర్ బలపడుతోంది. డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో, విలువైన మెటల్ బంగారానికి డిమాండ్ పడిపోతుందని, దీంతో బంగారం ధరలు తగ్గుతున్నట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 190 చొప్పున తగ్గి, రూ.30,740గా, రూ.30,590గా నమోదైనట్టు పేర్కొన్నారు. అయితే గత రెండు రోజుల్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా 90 రూపాయలే పెరిగాయి. -
భారీగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్ క్షీణించడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేడు బులియన్ మార్కెట్లో 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 620 రూపాయలు తగ్గి 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. వెండి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. దీంతో సెంటిమెంట్ బలహీనపడిందని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీరేట్లను కొనసాగింపుగా పెంచనున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో, ఈ విలువైన మెటల్‌కు డిమాండ్ తగ్గుతోంది. గ్లోబల్‌గా ఒక్క ఔన్స్‌కు బంగారం ధర 0.32 శాతం క్షీణించి 1,223.30 డాలర్లుగా నమోదైంది. వెండి కూడా 0.84 శాతం తగ్గి, 15.41 డాలర్లుగా ఉంది. ఇక దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున తగ్గి, రూ.30,800గా, రూ.30,650గా రికార్డయ్యాయి. నిన్న కూడా బంగారం ధరలు 100 రూపాయలు తగ్గాయి. -
వరుసగా ఐదో రోజు తగ్గిన బంగారం
న్యూఢిల్లీ : బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదో రోజూ బంగారం ధరలు కిందకి పడిపోయాయి. అంతర్జాతీయంగా ట్రెండ్ స్తబ్దుగా ఉండటం, స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ లేకపోవడంతో గురువారం 10 గ్రాముల బంగారం ధర బులియన్ మార్కెట్లో 140 రూపాయలు తగ్గి, రూ.31,210గా నమోదైంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కేజీకి 470 తగ్గినట్టు తెలిసింది. దీంతో కేజీ వెండి ధర రూ.40,030గా రికార్డైంది. పారిశ్రామిక యూనిట్ల నుంచి, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కూడా తగ్గాయని విశ్లేషకులు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ స్థిరంగా కొనసాగింది. ఒక్క ఔన్స్‌కు 1,243 డాలర్లు నమోదైంది. బుధవారం 1 శాతం కిందకి పడిపోయిన బంగారం, వారం కనిష్ట స్థాయిలను తాకింది. ఆగస్టు నెల అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం నష్టంలో ఔన్స్‌కు 1,243.60 డాలర్లుగా నమోదైనట్టు తెలిసింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు 140 రూపాయల చొప్పున తగ్గి రూ.31,210, రూ.31,060గా నమోదయ్యాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం బలహీనమైన గ్లోబల్ ట్రెండ్, స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ పడిపోవడమని బులియన్ ట్రేడర్లు చెప్పారు. -
ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు 32 వేల రూపాయల మార్కుకు కిందకి పడిపోయాయి. అంతర్జాతీయంగా ఉన్న బలహీనమైన ట్రెండ్‌తో పాటు దేశీయంగా కూడా స్థానిక బంగార దుకాణాదారుల నుంచి డిమాండ్ క్షీణించడంతో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. 390 రూపాయలు తగ్గిన 10 గ్రాముల పసిడి ధర రూ.31800కు చేరింది. వెండి ధరలు సైతం భారీగా తగ్గి, రూ.42 వేల కిందకు వచ్చి చేరాయి. 1050 రూపాయలు తగ్గిన కిలో వెండి ధర రూ.41,350గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తగ్గినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. అమెరికా-చైనాల మధ్య తాజాగా ట్రేడ్‌వార్ ఆందోళనలు పెరిగినప్పటికీ, విలువైన మెటల్‌గా పేరున్న బంగారానికి మాత్రం సెంటిమెంట్ కిందకి పడిపోయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు 1.77 శాతం వరకు తగ్గాయి. 1.77 శాతం క్షీణించిన బంగారం ధరలు ఔన్స్‌కు 1,278.90 డాలర్లుగా నమోదయ్యాయి. వెండి కూడా 3.44 శాతం పడిపోయి కేజీకి 16.54 డాలర్లుగా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 390 రూపాయల చొప్పున తగ్గి, రూ.31,800గా, రూ.31,650గా నమోదయ్యాయి. నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధర 330 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. -
నాలుగు రోజులకు బ్రేక్ : దిగొచ్చిన బంగారం
న్యూఢిల్లీ : నాలుగు రోజులు ఎగిసిన బంగారం ధరలు బ్రేక్ పడింది. నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కిందకి దిగొచ్చాయి. 105 రూపాయల మేర తగ్గిన బంగారం ధర 10 గ్రాములకు 32,370 రూపాయలుగా నమోదైంది. గత నాలుగు సెషన్లలో ఈ ధరలు 600 రూపాయల మేర పెరిగిన సంగతి తెలిసిందే. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయంగా సంకేతాలు బలహీనంగా ఉండటంతో బంగారం ధరలు దిగొచ్చినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా కిందకి పడిపోయాయి. కేజీ వెండి ధర 350 రూపాయల మేర తగ్గి, కేజీకి 41,200 రూపాయలుగా నమోదైంది. అమెరికా డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి సహకరించాయి. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 105 రూపాయల చొప్పున తగ్గి, రూ.32,370గా, రూ.32,220గా నమోదయ్యాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. నిన్న న్యూయార్క్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం ధర 0.22 శాతం తగ్గి ఔన్స్‌కు 1,301.20 డాలర్లుగా, వెండి ధర 0.99 శాతం తగ్గి, ఔన్స్‌కు 16.47 డాలర్లుగా రికార్డయ్యాయి. -
భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
న్యూఢిల్లీ : బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే 430 రూపాయల మేర పడిపోయాయి. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ క్షీణించడంతో పాటు, అంతర్జాతీయంగా సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో, బుధవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 430 రూపాయలు తగ్గి రూ.32,020గా నమోదైంది. సిల్వర్ కూడా బంగారం బాటనే పట్టింది. సిల్వర్ ధరలు సైతం కేజీకి 250 రూపాయలు తగ్గి రూ.40,650గా నమోదయ్యాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్క ఔన్స్‌కు 1300 డాలర్ల కిందకి పడిపోవడంతో, దేశీయంగా బంగారం ధరలు తగ్గినట్టు తెలిసింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటంతో బంగారం ధర అంతర్జాతీయంగా ఈ ఏడాది కనిష్ట స్థాయిల్లో ఔన్స్‌కు 1290.30 డాలర్లను నమోదుచేసింది. సిల్వర్ కూడా అంతర్జాతీయంగా 1.52 శాతం తగ్గి, ఔన్స్‌కు 16.24 డాలర్లగా ఉంది. కేవలం అంతర్జాతీయంగా ఈ విలువైన మెటల్స్ ధరలు పడిపోవడమే కాకుండా.. స్థానిక ఆభరణదారులు, వర్తకుల నుంచి ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో దేశీయంగా ధరలు దిగొచ్చాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.430 చొప్పున తగ్గి రూ.32,020, రూ.31,870గా నమోదయ్యాయి. నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు 165 రూపాయలు లాభపడిన సంగతి తెలిసిందే. -
ర్యాలీకి బ్రేక్ : తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : రాబోతున్న పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పైపైకి ఎగుస్తూ వచ్చిన బంగారం ధరలు, నేడు పతనబాట పట్టాయి. స్థానిక ఆభరణ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడంతో పాటు, అంతర్జాతీయంగా పరిస్థితుల ప్రభావం స్తబ్దుగా ఉండటం వల్ల మార్కెట్లో బంగారం ధరలు తగ్గినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. నేడు(శనివారం) బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 250 రూపాయలు తగ్గి, రూ.31,200గా నమోదైంది. అయితే, గ్లోబల్ మార్కెట్లో మాత్రం 0.15 శాతం పెరిగి ఔన్సు ధర 1,349.30 డాలర్లకు చేరింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున పెరిగి రూ.31,200, రూ.31,050గా నమోదయ్యాయి. కాగ, కిలో వెండి ధర రూ. 350 తగ్గడంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 40,650గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోయాయని విశ్లేషకులు చెప్పారు. -
పెరుగుతున్న బంగారం : రూ.31వేలను దాటేసింది
న్యూఢిల్లీ : పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో, బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో 200 రూపాయల మేర పెరిగిన బంగారం ధరలు నేటి ట్రేడింగ్‌లో మరో వంద రూపాయలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర బులియన్ మార్కెట్లో 31వేల రూపాయలకు పైన రూ.31,050గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌ను అందుకోవడానికి జువెల్లర్స్ ఎక్కువగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారని, దీంతో ధరలు పెరుగుతున్నాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. అంతేకాక అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో కూడా ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. డాలర్ మారకంతో రూపాయి విలువ పడిపోవడంతో, దిగుమతి చేసుకుంటున్న మెటల్స్ ఖరీదైనవిగా మారాయని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ భారీగా 54పైసలు పడిపోయి, 64.04గా నమోదైంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్‌కు 0.08 శాతం పెరిగి 1,340.70 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు వంద రూపాయల చొప్పున పెరిగి 10 గ్రాములకు 31,050 రూపాయలుగా, 30,900 రూపాయలుగా నమోదయ్యాయి. కాగ, గత నాలుగు సెషన్ల నుంచి బంగారం ధరలు 475 రూపాయల మేర పెరిగాయి. అటు వెండి కూడా కేజీకి వంద రూపాయలు పెరిగి, 40,300 రూపాయలుగా నమోదైంది. -
బులియన్ ట్రేడర్లపై ఈడీ దాడులు
ముంబాయి : డీమానిటైజేషన్ అనంతరం బులియన్ ట్రేడర్లు తెరతీసిన భారీ అక్రమాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. అనుమానిత లావాదేవీలు జరిపిన బులియన్ ట్రేడర్లపై దాడులు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే నలుగురు బులియన్ ట్రేడర్లు డిపాజిట్ చేసిన రూ.69 కోట్లకు సంబంధించిన అనుమానిత నగదుపై దాడులు నిర్వహించింది. ఆరు బోగస్ కంపెనీల ద్వారా బులియన్ ట్రేడర్ల అకౌంట్లోకి ఈ నగదును బదిలీ అయినట్టు తెలిసింది. ఈ నగదంతా లెక్కలో చూపని డబ్బుగా ఈడీ గుర్తించింది. ఈ బదిలీ ప్రక్రియంతా ప్రధాని నరేంద్రమోదీ నోట్ల రద్దు చేసినప్పటి నుంచి ప్రారంభమైందని ఈడీ పేర్కొంది.. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి నగదు బదిలీల అక్రమాలకు తెరతీశారని అనుమానాల నేపథ్యంలో జరిపిన దాడుల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు ఈడీ వెల్లడించింది. గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసినందుకు ఈ కంపెనీల ద్వారా నగదు బదిలీ చేసినట్టు ఈడీ విచారణలో తేలింది. శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైన ఈ దాడులు శనివారం వరకు కొనసాగాయి. ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ సూచనల మేరకు జావేరి బజార్లో ఈ రైడ్స్‌ను జరిపారు. ఈ రైడ్స్‌లో ఆ నలుగురికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లో రూ.1.2 కోట్ల నగదును ఈడీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. -
బంగారం వర్తకుల ఖాతాలు ఫ్రీజ్!
• పలువురి ఖాతాల్ని నిలిపేసిన యాక్సిస్ బ్యాంకు • నోట్ల రద్దు తరవాత భారీ విక్రయాలే కారణం ముంబై: నోట్ల రద్దు అనంతరం బంగారం కొనుగోళ్లకు సహకరించిన పలువురు బులియన్ వర్తకులు, డీలర్ల ఖాతాలను యాక్సిస్ బ్యాంకు స్తంభింపజేసింది. ఇలాంటి వర్తకులకు సహకరించారన్న ఆరోపణలపై ఒక బ్రాంచిలో ఇద్దరు యాక్సిస్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటికే అరెస్టయిన విషయం తెలిసిందే. ‘‘పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొన్నిచోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, విచారణ నేపథ్యంలో కొన్ని కరెంటు ఖాతాల్లో లావాదేవీల్ని తాత్కాలికంగా నిలుపుచేస్తున్నాం’’ అని బ్యాంకు తెలియజేసింది. ఇప్పటికే 10 నెలల కనిష్ట స్థాయిలో ఉన్న పసిడి ధరపై ఈ చర్య ప్రభావం చూపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి పెద్ద నోట్లను రద్దుచేశాక కొందరు నల్లకుబేరులు తమ దగ్గరున్న సొమ్మును తెలుపు చేసుకోవటానికి 50 శాతం ఎక్కువ ధర పెట్టి కూడా భారీగా పసిడి కొన్నారు. ఇందుకు సహకరించారని ఇద్దరు యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగులను గతవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే పలు బులియన్ డీలర్లు, ఆభరణాల వర్తకుల అకౌంట్లను నిలుపుచేసినట్లు బ్యాంకు ప్రకటించింది. ‘‘తగిన విచారణ అనంతరం తప్పు లేదని తేలితే వారి ఖాతాల్ని పునరుద్ధరిస్తాం’’ అని బ్యాంకు తెలియజేసింది. కాగా బ్యాంకు ఎలాంటి కారణం చెప్పకుండానే తమ ఖాతా నిలిపేసినట్లు పేరు వెల్లడికావటానికి ఇష్టపడని చెన్నై బంగారం డీలర్ ఒకరు తెలిపారు. 33 శాతం కొనుగోళ్లు అడ్డగోలే! దేశంలో ఏటా దాదాపు 800 టన్నుల పసిడికి డిమాండ్ ఉంది. దీన్లో మూడో వంతు కొనుగోళ్లు ‘‘బ్లాక్ మనీ’’తోనే అనే వాదన ఉంది. నవంబర్‌లో పసిడి దిగుమతులు 11 నెలల గరిష్ట స్థాయిలో దాదాపు 100 టన్నులు పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జరిగిన నోట్ల పంపిణీ అవకతవకలపై యాక్సిస్ గత వారం 19 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది. బ్యాంక్ లైసెన్స్ రద్దు... వదంతే: ఆర్బీఐ నోట్ల రద్దు నేపథ్యంలో కొన్ని బ్రాంచీల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి యాక్సిస్ బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తున్నట్లు వదంతులొస్తున్నాయని, వాటిలో నిజం లేదని ఆర్బీఐ తెలియజేసింది. ఇదే విషయాన్ని బీఎస్ఈకి యాక్సిస్ బ్యాంకు తెలిపింది. ‘‘బ్యాంక్ లైసెన్స్ రద్దు వార్తలను పూర్తిగా తోసిపుచ్చుతున్నాం. ఆర్బీఐ నిర్దేశిస్తున్న విధంగా పటిష్ట యంత్రాంగం, నిర్వహణ వ్యవస్థలకు లోబడి బ్యాంకు పనిచేస్తోంది’’ అని యాక్సిస్ పేర్కొంది. తాజా పరిణామాలతో యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ 2.5 శాతం తగ్గి, రూ.445 వద్ద ముగిసింది. -
మళ్లీ ఆభరణాల వర్తకుల సమ్మె
మద్దతివ్వని ప్రధాన సంఘాలు న్యూఢిల్లీ: అభరణాలు, బులియన్ వర్తకులు సోమవారం నుంచి మళ్లీ సమ్మెకు దిగారు. వెండి మినహా ఇతర ఆభరణాలపై విధించిన ఒక్క శాతం సుంకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో వర్తకులు మళ్లీ సమ్మె చేయడం ప్రారంభించారు. ఢిల్లీ, ఇతర ప్రధాన నగరాల్లో ఆభరణాల షోరూమ్‌లు మూతబడ్డాయని ఆల్ ఇండియా సరఫ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురీందర్ కుమార్ జైన్ చెప్పారు. మూడు రోజుల పాటు షాపులను పూర్తిగా మూసేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సమ్మె చేస్తున్న సంఘాలు ఉమ్మడిగా నిర్ణయించాయని వివరించారు. కాగా సమ్మెకు మద్దతుగా ఆభరణాల వర్తకులు, కళాకారులు ఢిల్లీ లోని జంతరమంతర్ వద్ద ధర్నా చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్, జోధ్‌పూర్, కోటలతో సహా పలు ప్రాంతాల్లోనూ, కాన్పూర్, ఉత్తర ప్రదేశ్‌ల్లోనూ పైగా ఆభరణాల షాపులను మూసేశారు. అయితే ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్), ఇండియా బులియన్ అండ్ జెవెలర్స్ అసోసియేషన్స్ తదితర ప్రధాన సంఘాలు ఈ సమ్మెకు మద్దతివ్వలేదు. -
డాలరు మద్దతుతో స్థిరంగా బంగారం: విశ్లేషకులు
న్యూయార్క్/ముంబై: డాలరు ఇండెక్స్ క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర సమీప భవిష్యత్తులో స్థిరంగా వుంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రధాన కరెన్సీలతో డాలరు మారకపు విలువ తగ్గినందున, ప్రపంచ మార్కెట్లో గతవారం ఔన్సు పుత్తడి ధర 1.62 శాతం పెరుగుదలతో 1,242 డాలర్ల వద్ద ముగిసింది. డాలరు విలువ తగ్గుతుంటే ఇన్వెస్టర్లు పుత్తడి కొనుగోళ్లవైపు సహజంగా మళ్లుతుంటారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఏప్రిల్‌లో జరిపే సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు వుండకపోవొచ్చన్న అంచనాలు అటు డాలరు క్షీణతకు, ఇటు పుత్తడి పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెప్పారు. ఫెడ్ రేట్ల పెంపు వుండకపోవొచ్చన్న అంచనాలు పుత్తడి ఫ్యూచర్స్‌కు మద్దతునిస్తున్నాయని వారన్నారు. దేశీయ మార్కెట్లో అప్... అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో కూడా గతవారం పుత్తడి ధర ఎగసింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల పుత్తడి ధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 390 పెరుగుదలతో రూ. 28,885 వద్ద ముగిసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు. -
పుత్తడికి సీజనల్ డిమాండ్
ధర పటిష్టంగా వుండవచ్చంటున్న బులియన్ ట్రేడర్లు ముంబై: ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధర మున్ముందు కూడా సీజనల్ డిమాండ్ కారణంగా పటిష్టంగానే వుంటుందని బులియన్ ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఇటీవల బాగా పెరిగినందున, చిన్నచిన్న సర్దుబాట్లు జరిగినప్పటికీ, పుత్తడికి రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతుందని, పెళ్ళిళ్లు తదితరాల కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొనుగోళ్లు బావుంటాయని బులియన్ ట్రేడర్లు వివరించారు. క్రితం వారం ప్రథమార్థంలో దేశీయ మార్కెట్లో 22 నెలల గరిష్టస్థాయికి చేరిన పుత్తడి ధర, అటుతర్వాత లాభాల స్వీకరణకు లోనై, భారీగా పడిపోయింది. కానీ వారం చివర్లో స్టాకిస్టులు, రిటైలర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో తిరిగి పుంజుకుంది. అయితే అంతక్రితంవారంతో పోలిస్తే స్వల్పనష్టంతో ముగిసింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛతగల 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం గత శుక్రవారం, అంతక్రితంవారం ఇదేరోజుతో పోలిస్తే రూ. 55 నష్టంతో 29,395 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి ధర అంతే తగ్గుదలతో రూ. 29,245 వద్ద క్లోజయ్యింది. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర ఒకదశలో 1,287 డాలర్ల గరిష్టస్థాయికి చేరింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో ఆ స్థాయికి ధర పెరిగినా, అటుతర్వాత లాభాల స్వీకరణతో 1,259 డాలర్ల వద్దకు తగ్గి ముగిసింది. అంతక్రితం వారంతో పోలిస్తే 11 డాలర్ల మేర క్షీణించింది. -
పదో రోజుకు జ్యువెలరీ సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ ఆభరణాలు, బులియన్ వర్తకులు చేస్తున్న సమ్మె పదవ రోజుకు చేరింది. ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 2 నుంచి జరుగుతోంది. కాగా 12 కోట్ల టర్నోవర్ మించిన వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. 1981, 2012ల్లో కూడా రత్నాలు, ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాన్ని విధించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. సురక్షిత సాధనంగా పుత్తడి: కాగా, ధరల్లో ఒడిదుడుకులున్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ 670-685 టన్నులకు పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ఆభరణాల కంటే నాణాలు, కడ్డీలకే డిమాండ్ బాగా ఉంటుందని పేర్కొంది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులుండడం, స్టాక్ మార్కెట్లు బలహీనతలు, కరెన్సీ విలువలు తగ్గడం వల్ల సురక్షిత సాధనంగా పుత్తడి ఉంటుందని వివరించింది. -
బంగారం ధర మళ్లీ రయ్...
ముంబై /లండన్ : అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సెప్టెంబర్‌లో పెంచబోదన్న అంచనాలతో గురువారం విదేశీ, దేశీయ మార్కెట్లలో పుత్తడి ధర జోరుగా పెరిగింది. ముంబై స్పాట్ మార్కెట్లో 99.5 స్వచ్ఛతగల పుత్తడి 10 గ్రాములకు రూ. 465 ఎగిసి రూ. 26,500 వద్ద ముగిసింది. ఇది నెలన్నర రోజుల గరిష్టస్థాయి. ఇక్కడ స్పాట్ మార్కెట్ ముగిసిన తర్వాత గురువారం రాత్రి న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర ఒక్కసారిగా 24 డాలర్లు పెరిగి నెలరోజుల గరిష్టస్థాయి 1,148 డాలర్ల వద్దకు చేరింది. ఇదే ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఫ్యూచర్ ధర రూ. 600 మేర పెరిగి రూ. 26,800 స్థాయికి చేరింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడి స్పాట్ మార్కెట్లో పుత్తడి మరికొంత పెరగవచ్చని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు. -
ఆరుగురి చేతిలో 40% పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న పసిడిలో 40% పరిమాణాన్ని కేవలం ఆరుగురు ట్రేడర్లు నియంత్రిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి ఆరు నెలల(ఏప్రిల్-సెప్టెంబర్) కాలంలో వీరి ద్వారానే 40% పసిడి దిగుమతులు జరిగాయని ప్రభుత్వ వర్గాలు విశ్లేషించాయి. వీరిలో ముగ్గురు ముంబైకి చెందిన పసిడి ట్రేడర్లుకాగా, మిగిలినవారు ముంబై, బెంగళూరు, హర్యానాలకు చెందిన వర్తకులు. అయితే ఈ ఆరుగురు ట్రేడర్లు నిర్వహించే వర్తకంలో చట్టవిరుద్ధమైన అంశాలేవీ లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల పసిడి దిగుమతులు పుంజుకోవడంతో ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. -
బంగారం ధరలో రికవరీ
ముంబై: దేశీయంగా దాదాపు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయిలకు పడిపోయిన బంగారం ధరలు శనివారం తిరిగి కొంచెం కోలుకున్నాయి. ముంబై స్పాట్ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోల్చితే 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి, రూ.26,100కు చేరింది. 22 క్యారెట్ల విషయంలోనూ ధర ఇంతే మొత్తం ఎగసి రూ.25,950కు ఎగసింది. వెండి కేజీ ధర సైతం రూ.750 పెరిగి తిరిగి రూ.36,000ను తాకింది. వడ్డీరేట్లపై అనిశ్చితితో అంతర్జాతీయంగా, దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ధరల ధోరణి ఇంకా సంక్లిష్టంగానే ఉన్నప్పటికీ దేశ ప్రధాన స్పాట్ మార్కెట్లో ధర పెరగడం విశేషం. పెళ్లిళ్ల సీజన్లో రిటైల్ ఆభరణాలకు డిమాండ్, ప్రస్తుత స్థాయిలో ధర వద్ద పెట్టుబడులకు ఎల్లో మెటల్ సరైనదన్న అభిప్రాయం తిరిగి దేశీయంగా పసిడి ధర పెరగడానికి కారణమని నిపుణుల విశ్లేషణ. -
బంగారం దిగొస్తోంది...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం ధర దిగొస్తోంది. వారం క్రితం 10 గ్రాముల మేలిమి బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో అటూ ఇటుగా రూ.28,300 ఉండగా, శుక్రవారం నాడు రూ.27,640కి వచ్చి చేరింది. దే శంలోని వివిధ నగరాల్లో ధర వరుసగా ఆరు రోజులపాటు క్షీణించడం విశేషం. ధర ఇంకా దిగొస్తుందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. దసరాకల్లా రూ.26,800 వరకు రావొచ్చని అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలపడడం తదితర కారణాలతో బంగారం ధర తగ్గుతోంది. అయితే దీపావళి నాటికి తిరిగి రూ.28-29 వేలను తాకొచ్చని బులియన్ నిపుణులు చెబుతున్నారు. దీపావళి సమయంలో దేశీయంగా పుత్తడికి డిమాండ్ పెరుగుతూ వుంటుంది. ఈ కారణంగా స్వర్ణం కొనుగోలుకు ఇదే సరైన తరుణమని బులియన్ వర్తకులు సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా.. అమెరికా ఎకానమీ క్రమంగా పుంజుకుంటోంది. దీంతో బంగారంపై ప్రజల పెట్టుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు యూరో వడ్డీ రేటు తగ్గించింది. దీని ప్రభావం కాస్తా డాలరు బలపడేందుకు దోహదం చేసింది. డాలరు బలపడితే సహజంగానే పుత్తడి ధర దిగొస్తుంది. మరోవైపు మోడీ ప్రభుత్వ దూకుడుకుతోడు షేర్ మార్కెట్ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ ఊపుతో రూపాయి బలపడుతోంది. ఈ కారణాలతో బంగారం రేటు కిందకు వస్తోందని ఆంధ్రప్రదేశ్ బులియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.మహాబలేశ్వరరావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇంకా వెల తగ్గుతుందన్న ప్రచారం ఉండడంతో కస్టమర్లు వేచి చూస్తున్నారని చెప్పారు. దీనికితోడు భారత్‌లో ప్రస్తుతం సీజన్ లేదని అన్నారు. కాగా, రూ.4 లక్షల కోట్ల విలువైన దేశీయ బంగారు ఆభరణాల మార్కెట్ లో 2014-15లో ఎటువంటి వృద్ధి నమోదు కాకపోవచ్చని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వర్తక సంఘం(జీజేఎఫ్) అంచనా వేస్తోంది. అయితే దీపావళి సీజన్లో మాత్రం 10-15 శాతం వృద్ధిని ఆశిస్తోంది. మూడ్ వచ్చినప్పుడే.. ఆభరణాల విషయంలో మూడ్ వచ్చినప్పుడే కస్టమర్లు కొనుగోలు చేస్తారని హైదరాబాద్ జువెల్లరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ తెలిపారు. కొందరు వినియోగదారులు మాత్రమే ధర తగ్గొచ్చని వేచి చూస్తారని పేర్కొన్నారు. దసరా తర్వాత బంగారానికి సీజన్ మొదలవుతుందని, ధరతేరాస్, దీపావళి పీక్ సీజన్ అవుతుందని, దాంతో దీపావళి కల్లా ధర తిరిగి రూ.28-29 వేలకు చేరువ అవుతుందని చెప్పారు. స్వర్ణం కొనుగోలుకు ఇదే సరైన సమయమని ఆయన సూచిస్తున్నారు. ఈ మధ్య ధర తగ్గుతుండటంతో దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. దీపావళికల్లా అమ్మకాలు జోరందుకుంటాయని ధీమాగా చెప్పారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర క్రమేపీ తగ్గుతూ 1,266 డాలర్లకు దిగింది. నెలరోజుల క్రితం ఇది 1,300 డాలర్లకుపైగా వుంది. ఫ్యూచర్స్‌లో ఇలా.. 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఫ్యూచర్స్ మార్కెట్లో శుక్రవారం రూ.27,400లోపునకు తగ్గింది. అంతర్జాతీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉండడంతో స్పెక్యులేటర్లు పొజిషన్లను తగ్గించడమే ఈ క్షీణతకు కారణం. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ డెలివరీ ధర రూ.100 మేర పడిపోయింది. డిసెంబర్ డెలివరీ రూ.36 తగ్గి రూ.27,599గా ఉంది.