న్యూఢిల్లీ : బంగారం ధరలు 32 వేల రూపాయల మార్కుకు కిందకి పడిపోయాయి. అంతర్జాతీయంగా ఉన్న బలహీనమైన ట్రెండ్‌తో పాటు దేశీయంగా కూడా స్థానిక బంగార దుకాణాదారుల నుంచి డిమాండ్ క్షీణించడంతో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. 390 రూపాయలు తగ్గిన 10 గ్రాముల పసిడి ధర రూ.31800కు చేరింది. వెండి ధరలు సైతం భారీగా తగ్గి, రూ.42 వేల కిందకు వచ్చి చేరాయి. 1050 రూపాయలు తగ్గిన కిలో వెండి ధర రూ.41,350గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తగ్గినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు.
అమెరికా-చైనాల మధ్య తాజాగా ట్రేడ్‌వార్ ఆందోళనలు పెరిగినప్పటికీ, విలువైన మెటల్‌గా పేరున్న బంగారానికి మాత్రం సెంటిమెంట్ కిందకి పడిపోయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు 1.77 శాతం వరకు తగ్గాయి. 1.77 శాతం క్షీణించిన బంగారం ధరలు ఔన్స్‌కు 1,278.90 డాలర్లుగా నమోదయ్యాయి. వెండి కూడా 3.44 శాతం పడిపోయి కేజీకి 16.54 డాలర్లుగా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 390 రూపాయల చొప్పున తగ్గి, రూ.31,800గా, రూ.31,650గా నమోదయ్యాయి. నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధర 330 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment