న్యూఢిల్లీ : నాలుగు రోజులు ఎగిసిన బంగారం ధరలు బ్రేక్ పడింది. నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కిందకి దిగొచ్చాయి. 105 రూపాయల మేర తగ్గిన బంగారం ధర 10 గ్రాములకు 32,370 రూపాయలుగా నమోదైంది. గత నాలుగు సెషన్లలో ఈ ధరలు 600 రూపాయల మేర పెరిగిన సంగతి తెలిసిందే. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయంగా సంకేతాలు బలహీనంగా ఉండటంతో బంగారం ధరలు దిగొచ్చినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా కిందకి పడిపోయాయి.
కేజీ వెండి ధర 350 రూపాయల మేర తగ్గి, కేజీకి 41,200 రూపాయలుగా నమోదైంది. అమెరికా డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి సహకరించాయి. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 105 రూపాయల చొప్పున తగ్గి, రూ.32,370గా, రూ.32,220గా నమోదయ్యాయి. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. నిన్న న్యూయార్క్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం ధర 0.22 శాతం తగ్గి ఔన్స్‌కు 1,301.20 డాలర్లుగా, వెండి ధర 0.99 శాతం తగ్గి, ఔన్స్‌కు 16.47 డాలర్లుగా రికార్డయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment