SILVER PRICES
-
పడిలేసిన పసిడి.. మళ్ళీ తగ్గిన వెండి - కొత్త ధరలు ఇవే..
జూన్ 8న భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు (జూన్ 11) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..విజయవాడ, హైదరాబాద్‌లలో 10 గ్రాముల బంగారం ధరలు రూ.65850 (22 క్యారెట్స్), రూ.71840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 170 తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66000 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71990 వద్ద ఉంది. ఈ ధరలు నిన్నటి కంటే రూ. 150, రూ. 170 ఎక్కువ.ఇక చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 150, రూ. 170 తగ్గి.. రూ. 66450 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 72490 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం తగ్గు ముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 11) ఒక కేజీ వెండి ధర రూ. 90500 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 1200 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ధర పెరిగినా బంగారమే
న్యూఢిల్లీ: భారత్ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో పోలి్చతే భారత్ పసిడి డిమాండ్ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్ నెలకొనడం గమనార్హం. సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్ ఇయర్ మొత్తంలో ఆర్బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్ మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా 5 % ఎక్కువ. సెంట్రల్ బ్యాంకులు తమ హోల్డింగ్స్‌ను ఈ కాలంలో 290 టన్నులు పెంచుకున్నాయి. ∗ మార్చి త్రైమాసికంలో భారత్ పసిడి డిమాండ్ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్‌లో ఆభరణాల డిమాండ్ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది. ∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి. ∗గోల్డ్ రీసైక్లింగ్ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా. -
Gold prices: దీపావళికి మోతే! బంగారం, వెండి ధరలు ఆకాశానికి..
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. నవంబర్ నెలలో రానున్న దీపావళి నాటికి ఇవి రికార్డ్ స్థాయికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. 10 గ్రాముల పసిడి రూ.61,000 లను తాకుతుందని, కేజీ వెండి రూ. 75,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా, దేశీయంగా బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనుకూల వాతావరణం కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని అంచనాకు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కారణాలివే.. ప్రపంచంలోని పలు దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి సానుకూల ప్రకటన, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోలు, ఫిజికల్ డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలు పెరగడానికి దారితీస్తాయని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా అన్నారు. కెడియా ప్రకారం, ఈ దీపావళికి బంగారం ధరలు రూ. 61,000 నుంచి రూ. 61,500, వెండి ధరలు రూ. 75,000 నుంచి రూ. 76,000 స్థాయిలను తాకవచ్చు. గత సంవత్సరం దీపావళి నుంచి బంగారం ధరలు 17 శాతానికిపైగా పెరిగాయి. అలాగే వెండి ధరలు 23 శాతానికి మించి పెరిగాయి. -
షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధరలు..వెండి వెయ్యికి పైగా..!
అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, సిల్వర్ ధరలు సోమవారం రోజున భారీగా పెరిగాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్యవిధానాలను కఠినతరం చేసే అవకాశాలు, రష్యా-ఉక్రెయిన్ వార్, ప్రపంచ ద్రవ్యోల్భణ ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక సిల్వర్ ఒకరోజులోనే రూ. 1000కిపైగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .53, 148 వద్ద ట్రేడవుతోంది. ఇక సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్‌సీఎక్స్‌లో రూ.69, 976వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. హైదరాబాద్‌లో సోమవారం 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.320కి పైగా పెరిగి రూ. 54,380కి చేరుకుంది. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి, రూ.49,850కి పెరిగింది. సిల్వర్ ధరలు సోమవారం ఏకంగా రూ. 1000పైగా పెరిగి కిలో సిల్వర్ ధర రూ. 75,200కు చేరుకుంది. మంగళవారం సిల్వర్ ధరలు కాస్త తగ్గాయి. కేజీ సిల్వర్ ధర రూ. 300 తగ్గి రూ. 74,900 వద్ద ఉంది. చదవండి: ఆరు వారాల్లో అతిపెద్ద నష్టం -
బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్..! రెండు రోజుల్లో ఏకంగా...
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా వున్నాయి. కాగా రెండు రోజుల వ్యవధిలో నే బంగారం ధరలు సుమారు రూ. 500 వరకు పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో అంతర్జాతియంగా గోల్డ్ ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .52,860 వద్ద ట్రేడవుతోంది. కాగా నేడు 10 గ్రాముల బంగారం ధర రూ. 18 తగ్గడం విశేషం. ఇక సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్‌సీఎక్స్‌లో కిలోకు రూ.147 పెరిగి రూ.68,937 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.440కి పైగా పెరిగి ₹53,460కి చేరుకుంది. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010కి పెరిగింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 గా వుంది.. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.53,020 నుంచి రూ.53,460కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. -
పెరుగుతున్న బంగారం ధర
ముంబై: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కొంతమేరకు ధరలు తగ్గగా.. ఈ సోమవారం (జూలై 26, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్కి సంబంధించి ప్రారంభ సెషన్లో రూ.94.00 పెరిగి రూ.47628.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00 పెరిగి రూ.47902.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.48,000 పైకి చేరుకున్న పుత్తడి చివరి సెషన్లలో కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక వెండికి సంబంధించి సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.189.00 పెరిగి రూ.67213.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.205.00 పెరిగి రూ.68380.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత క్షీణించాయి. డెల్టా వేరియంట్ భయాలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లు సేఫ్‌గా భావించడంతో ఆ ప్రభావం ధరలపై కనిపించింది. -
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు ఇప్పుడు కిందకు చూస్తున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.45,900కి చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలకు డిమాండ్ తగ్గడమే దేశంలో ఇవాళ బంగారం ధరలు తగ్గడానికి కారణమని నిపుణులు తెలిపారు. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,730కు చేరుకుంది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గి రూ.43,750కు చేరుకుంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. హైదరాబాద్ కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,400కు చేరుకుంది. చదవండి: 5జీ కోసం క్వాల్‌కామ్‌తో ఎయిర్టెల్ జట్టు భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్ -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా సరికొత్త శిఖరాలతో వెలుగులు విరజిమ్మిన బంగారం... ఇప్పుడు కొండ దిగుతోంది!! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు తొలిసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలతో పుత్తడి ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశంలో పసిడి ధర పతనం అవుతోంది. దేశీయ స్పాట్ ప్రధాన మార్కెట్– న్యూఢిల్లీలో శుక్రవారం (ఆగస్టు 7వ తేదీ) 10 గ్రాములు స్వచ్చత ధర రికార్డు స్థాయిలో రూ.57,008 చూస్తే, బుధవారం నాటికి రూ.52,946కు దిగివచ్చింది. అంటే కేవలం మూడు రోజుల్లో రూ.4,062 తగ్గిందన్నమాట. మూడు రోజులుగా పసిడి ప్రతిరోజూ ఇక్కడ రూ.1,200కుపైగా తగ్గుతూ వచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగా పతనం అవుతుండడం గమనార్హం. 7వ తేదీన ఇక్కడి స్పాట్ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ.77,840కి చేరిన కేజీ వెండి ధర బుధవారానికి రూ.67,584కు చేరింది. మూడు రోజుల్లో వెండి రూ.10,256కు తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. 7వ తేదీ వరకూ వరుసగా 16 రోజులు ఏరోజుకారోజు దేశీయంగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన విషయం గమనార్హం. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 9.30 గంటలు) దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర రూ.52,292 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ శుక్రవారం రికార్డు స్థాయిలో ధర రూ.55,850 చేరిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఈక్విటీ మార్కెట్ పెరుగుదల ధోరణి నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ (ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో) దాదాపు స్థిరంగా ఉంది. బుధవారం ధర 74.83 వద్ద ఉంది. రూపాయికి ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). పరుగుకు రష్యా ‘వ్యాక్సిన్’ బ్రేకులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో బంగారం అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) గత శుక్రవారం (7వ తేదీ) ఒక దశలో చరిత్రాత్మక రికార్డుస్థాయి 2,078 డాలర్లకు చేరింది. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత కేవలం 10 రోజుల్లోనే పసిడి ఈ స్థాయికి చేరడం గమనార్హం. అయితే ఈ స్థాయి వద్ద భారీ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు దిగారు. దీనితో శుక్రవారం (7వ తేదీ) ట్రేడింగ్ చివర గంటల నుంచీ పసిడి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. దీనికితోడు కరోనా వ్యాక్సిన్ విడుదల చేసినట్లు స్వయంగా దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం పసిడి ధరకు మరింత ప్రతికూలం అయ్యాయి. బుధవారం ఈ వార్త రాసే 9.30 గంటల సమయానికి చరిత్రాత్మక గరిష్ట స్థాయిల నుంచి (2,078 డాలర్ల) చూస్తే, ధర 128 డాలర్లు పతనమై, 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 202 డాలర్లు పడిపోయి ఏకంగా 1,876 డాలర్లు చూడ్డం గమనార్హం. అయితే ఈ స్థాయిని చూసిన కేవలం కొద్ది గంటల్లోనే ధర కీలక నిరోధ స్థాయి (1,911 డాలర్లు)ని మళ్లీ దాటి, మంగళవారం ముగింపుకన్నా 12 డాలర్ల లాభంతో 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కళకళలాడుతున్న పసిడి.. వెండి
అటు కేంద్ర బ్యాంకులకూ, ఇటు ప్రజలకూ ప్రియమైన బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.3 శాతం బలపడి 1992 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి 1.2 శాతం పుంజుకుని 24.5 డాలర్లను తాకింది. కాగా.. పసిడి స్పాట్ మార్కెట్లో 1974 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 72 లాభపడి రూ. 53,900కు చేరింది. ఇది ఆగస్ట్ ఫ్యూచర్స్ ధరకాగా.. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర రూ. 658 పెరిగి రూ. 65,642 వద్ద ట్రేడవుతోంది. జులైలో జోరు గత 8ఏళ్లలోలేని విధంగా విదేశీ మార్కెట్లో పసిడి ధరలు జులైలో 10.3 శాతం ర్యాలీ చేశాయి. వారాంతానికల్లా కామెక్స్ పసిడి ఔన్స్ 1986 డాలర్లకు చేరింది. ఈ బాటలో వెండి మరింత మెరిసింది. ఏకంగా 31 శాతం దూసుకెళ్లి 24.2 డాలర్ల వద్ద నిలిచింది. వెరసి సరికొత్త రికార్డ్ సాధించింది. ఒక నెలలో వెండి ఈస్థాయిలో లాభపడటం చరిత్రలో ఇదే తొలిసారని బులియన్ విశ్లేషకులు తెలియజేశారు. గత వారం ఇంట్రాడేలో కామెక్స్ పసిడి 2005 డాలర్లను తాకడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం విదితమే. దేశీయంగానూ దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు జులైలో జోరు చూపాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి 9.5 శాతం పురోగమించి రూ. 53,544ను తాకింది. ఇక వెండి 29 శాతం జంప్‌చేసి కేజీ రూ. 64,984 వద్ద స్థిరపడింది. కామెక్స్‌లో పసిడి 1835-1840 డాలర్లను అధిగమించడంతో స్వల్ప కాలంలో ధరలు ఈ స్థాయికి ఎగువనే నిలదొక్కుకోగలవని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పసిడి ధరలు తదుపరి 2020-2030 డాలర్లను అందుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే 1920 డాలర్ల దిగువకు చేరితే మరింత బలహీనపడవచ్చని విశ్లేషించారు. వెండి సంగతేంటి? కొద్ది నెలల కన్సాలిడేషన్ తదుపరి జోరందుకున్న వెండి జులైలో పటిష్ట బ్రేకవుట్‌ను సాధించినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. కీలకమైన 20 డాలర్లకు ఎగువన నిలవడంతో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నట్లు తెలియజేశారు. తదుపరి కాలంలో 26 డాలర్లను తాకవచ్చని అంచనా వేశారు. అయితే 22 డాలర్ల దిగువకు చేరితే వెనకడుగు వేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎంసీఎక్స్ అంచనాలు ఇలా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ ధరలు రూ. 51,000కు ఎగువన నిలవడంతో సమీపకాలంలో రూ. 55,200-55,500ను తాకవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రూ. 51,000 దిగువకు చేరితే మరింత నీరసించవచ్చని అంచనా వేశారు. ఇక వెండికి సమీపకాలంలో రూ. 69,000 టార్గెట్‌ను ఊహిస్తున్నారు. అయితే రూ. 60,000-60,500 వద్ద మద్దతును కోల్పోతే మరింత క్షీణించే వీలున్నదని అభిప్రాయపడ్డారు. -
పండుగ చేసుకుంటున్న బంగారం ధరలు
న్యూఢిల్లీ : అంతకంతకు క్షీణిస్తున్న రూపాయి విలువతో, బంగారం పండుగ చేసుకుంటోంది. రూపాయి విలువ పడిపోతుండటంతో, బులియన్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగింది. నేడు 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు పెరిగి రూ.31,550గా నమోదైంది. బంగారానికి గ్లోబల్‌గా డిమాండ్ లేనప్పటికీ, దేశీయంగా మాత్రం రివర్స్ ట్రెండ్ నమోదైంది. గ్లోబల్‌గా వరుసగా రెండో రోజు బంగారం ధరలు పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు సెప్టెంబర్‌లో రెండోసారి వడ్డీరేటు పెంచనున్నట్టు తెలియడంతో, గ్లోబల్‌గా బంగారం బలహీనపడుతోంది. కానీ దేశీయంగా మాత్రం స్థానిక ఆభరణ వర్తకుల నుంచి కొనుగోళ్లు పెరగడం బంగారానికి బాగా సహకరించింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 200 రూపాయల చొప్పున పెరిగి రూ.31,550గా, రూ.31,400గా నమోదైంది. అయితే గత రెండు రోజుల్లో బంగారం మాత్రం 160 రూపాయల తగ్గింది. బంగారంతో పాటు వెండి కూడా 175 రూపాయలు పెరిగి కేజీ ధర 37,950 రూపాయలుగా నమోదైంది. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగింది. -
తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోపాటు స్థానికంగా డిమాండ్ లోపించడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. శనివారం నాటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గడంతో రూ. 31,350గా నమోదైంది. ఇటు బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం పైకి ఎగిశాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ రావడంతో, వెండి ధరలు పెరిగాయి. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర 275 రూపాయలు పెరిగి రూ. 37,775గా నమోదైంది. అమెరికా ఉద్యోగ డేటా సానుకూలంగా ఉండటంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో పసిడిలో పెట్టుబడులు తగ్గాయి. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కూడా కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు చెప్పాయి. అంతర్జాతీయంగానూ పసిడి 0.28శాతం తగ్గి ఔన్సు ధర 1,196.20 డాలర్లు పలికింది. 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 100 రూపాయల చొప్పున తగ్గి, రూ.31,350గా, రూ.31,200గా నమోదైంది. శుక్రవారం కూడా బంగారం ధరలు 60 రూపాయలు తగ్గాయి. -
భారీగా పడిపోయిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు పడిపోయి 30,435 రూపాయల వద్ద నమోదైంది. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ క్షీణించడం, గ్లోబల్‌గా ఈ విలువైన మెటల్‌కు సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్ మార్కెట్లో ధరలు క్షీణించినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలూ స్వల్పంగా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ కాస్త తగ్గడంతో, కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డైంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్ బలపడింది. దీంతో ఈ విలువైన మెటల్‌కు గ్లోబల్‌గా డిమాండ్ తగ్గింది. గ్లోబల్‌గా గోల్డ్ 0.65 శాతం పడిపోయి, ఔన్స్‌కు 1,215.50 డాలర్లుగా నమోదైంది. బలహీనమైన గ్లోబల్ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్ తగ్గిపోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదయ్యాయి. కాగ, నిన్న ఈ విలువైన మెటల్ ధర 150 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. -
తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలు తగ్గి రూ.30,740గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు, అంతర్జాతీయంగా బంగారానికి బలహీనమైన సంకేతాలు వీస్తుండటంతో బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి కూడా కేజీకి 230 రూపాయలు తగ్గింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో, కేజీ వెండి ధర 230 రూపాయలు తగ్గి, 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. యూరోపియన్ యూనియన్ల నుంచి వచ్చే కార్లపై టారిఫ్‌లను విధించకుండా ఉండేందుకు అమెరికా అంగీకరించడంతో, వాణిజ్య యుద్ధ భయాలు కాస్త సద్దుమణిగాయి. దీంతో డాలర్ బలపడుతోంది. డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో, విలువైన మెటల్ బంగారానికి డిమాండ్ పడిపోతుందని, దీంతో బంగారం ధరలు తగ్గుతున్నట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 190 చొప్పున తగ్గి, రూ.30,740గా, రూ.30,590గా నమోదైనట్టు పేర్కొన్నారు. అయితే గత రెండు రోజుల్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా 90 రూపాయలే పెరిగాయి. -
ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు 32 వేల రూపాయల మార్కుకు కిందకి పడిపోయాయి. అంతర్జాతీయంగా ఉన్న బలహీనమైన ట్రెండ్‌తో పాటు దేశీయంగా కూడా స్థానిక బంగార దుకాణాదారుల నుంచి డిమాండ్ క్షీణించడంతో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. 390 రూపాయలు తగ్గిన 10 గ్రాముల పసిడి ధర రూ.31800కు చేరింది. వెండి ధరలు సైతం భారీగా తగ్గి, రూ.42 వేల కిందకు వచ్చి చేరాయి. 1050 రూపాయలు తగ్గిన కిలో వెండి ధర రూ.41,350గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తగ్గినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. అమెరికా-చైనాల మధ్య తాజాగా ట్రేడ్‌వార్ ఆందోళనలు పెరిగినప్పటికీ, విలువైన మెటల్‌గా పేరున్న బంగారానికి మాత్రం సెంటిమెంట్ కిందకి పడిపోయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు 1.77 శాతం వరకు తగ్గాయి. 1.77 శాతం క్షీణించిన బంగారం ధరలు ఔన్స్‌కు 1,278.90 డాలర్లుగా నమోదయ్యాయి. వెండి కూడా 3.44 శాతం పడిపోయి కేజీకి 16.54 డాలర్లుగా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 390 రూపాయల చొప్పున తగ్గి, రూ.31,800గా, రూ.31,650గా నమోదయ్యాయి. నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధర 330 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. -
రెండో రోజు తగ్గిన బంగారం ధర
న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు బంగారం ధరలు కిందకి దిగొచ్చాయి. నేటి ట్రేడింగ్‌లో మరో 150 రూపాయలు ధర తగ్గిన 10 గ్రాముల బంగారం ధర 31,800 రూపాయలుగా నమోదైంది. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ అంతగా లేకపోవడంతో బంగారం ధరలు మెల్లమెల్లగా కిందకి పడుతున్నాయి. అయితే బంగారం కిందకి దిగొస్తుంటే, వెండి మాత్రం పైకి వెళ్తోంది. కేజీ వెండి ధర రూ.1,110 పెరిగి రూ.41,560గా రికార్డయింది. అమెరికా-ఉత్తరకొరియా మధ్య చర్చలు సానుకూల ధోరణిలో ఉండటంతో, డాలర్ బలపడుతోంది. యెన్‌తో పోలిస్తే అమెరికా డాలర్ మూడు వారాల గరిష్టానికి చేరింది. దీంతో గ్లోబల్‌గా బంగారం ధరలు కిందకి పడిపోతున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచే అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ బంగారాన్ని దెబ్బకొడుతున్నాయి. ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 150 రూపాయలు పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.31,800, రూ.31,650 చొప్పున పెరిగింది. సోమవారం కూడా ఈ ధరలు 100 రూపాయలు తగ్గాయి. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.19 శాతం తగ్గి ఔన్స్‌కు 1,297.50 డాలర్లుగా నమోదైంది. గత కొన్ని వారాల నుంచి బంగారం ధరలు రూ.32,500 నుంచి రూ.31,400 రేంజ్లో నడుస్తున్నాయని, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగిటివ్ సంకేతాలు వస్తుండటంతో ధరలు తగ్గుతున్నట్టు ఏబ్యాన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, వ్యవస్థాపకుడు అభిషేక్ బన్సాల్ చెప్పారు. -
నాలుగు రోజులకు బ్రేక్ : దిగొచ్చిన బంగారం
న్యూఢిల్లీ : నాలుగు రోజులు ఎగిసిన బంగారం ధరలు బ్రేక్ పడింది. నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కిందకి దిగొచ్చాయి. 105 రూపాయల మేర తగ్గిన బంగారం ధర 10 గ్రాములకు 32,370 రూపాయలుగా నమోదైంది. గత నాలుగు సెషన్లలో ఈ ధరలు 600 రూపాయల మేర పెరిగిన సంగతి తెలిసిందే. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయంగా సంకేతాలు బలహీనంగా ఉండటంతో బంగారం ధరలు దిగొచ్చినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా కిందకి పడిపోయాయి. కేజీ వెండి ధర 350 రూపాయల మేర తగ్గి, కేజీకి 41,200 రూపాయలుగా నమోదైంది. అమెరికా డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి సహకరించాయి. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 105 రూపాయల చొప్పున తగ్గి, రూ.32,370గా, రూ.32,220గా నమోదయ్యాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. నిన్న న్యూయార్క్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం ధర 0.22 శాతం తగ్గి ఔన్స్‌కు 1,301.20 డాలర్లుగా, వెండి ధర 0.99 శాతం తగ్గి, ఔన్స్‌కు 16.47 డాలర్లుగా రికార్డయ్యాయి. -
బంగారం ధరలు రెండో రోజూ పతనం
న్యూఢిల్లీ : బంగారం ధరలు వరుసగా రెండో కూడా పతనమయ్యాయి. గత రెండు రోజుల నుంచి పడిపోతున్న ధరలతో బంగారం రూ.32వేల మార్కు దిగువకు వచ్చి చేరింది. బుధవారం ఒక్కసారిగా 430 రూపాయల మేర పడిపోయిన బంగారం ధరలు, నేడు మరో 240 రూపాయలు కిందకి దిగజారాయి. 240 రూపాయలు తగ్గడంతో నేడు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.31,780గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్‌తో పాటు దేశీయ జువెల్లర్ల వద్ద నుంచి డిమాండ్ తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పడిపోతున్నట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. అంతర్జాతీయంగా అమెరికా బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరగడం, ఇటలీలో రాజకీయ ఆందోళనలు చెలరేగడం వంటి వాటితో డాలర్ ఇండెక్స్ భారీగా పెరుగుతోంది. ఈ ప్రభావం బంగారం ధరలపై పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం 2 శాతానికి పైగా పడిపోయినట్టు తెలిసింది. దేశీయంగా 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.240 చొప్పున పడిపోయి రూ.31,780గా, రూ.31,630గా నమోదయ్యాయి. నిన్న రూ.430 పడిపోయిన బంగారం ధరలు రూ.32,020 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం బంగారం బాటలోనే నడిచిన వెండి, నేడు మాత్రం రికవరీ అయింది. వెండి ధరలు నేటి మార్కెట్లో 100 రూపాయలు పెరిగి కేజీకి రూ.40,750గా నమోదయ్యాయి. -
భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
న్యూఢిల్లీ : బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే 430 రూపాయల మేర పడిపోయాయి. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ క్షీణించడంతో పాటు, అంతర్జాతీయంగా సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో, బుధవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 430 రూపాయలు తగ్గి రూ.32,020గా నమోదైంది. సిల్వర్ కూడా బంగారం బాటనే పట్టింది. సిల్వర్ ధరలు సైతం కేజీకి 250 రూపాయలు తగ్గి రూ.40,650గా నమోదయ్యాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్క ఔన్స్‌కు 1300 డాలర్ల కిందకి పడిపోవడంతో, దేశీయంగా బంగారం ధరలు తగ్గినట్టు తెలిసింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటంతో బంగారం ధర అంతర్జాతీయంగా ఈ ఏడాది కనిష్ట స్థాయిల్లో ఔన్స్‌కు 1290.30 డాలర్లను నమోదుచేసింది. సిల్వర్ కూడా అంతర్జాతీయంగా 1.52 శాతం తగ్గి, ఔన్స్‌కు 16.24 డాలర్లగా ఉంది. కేవలం అంతర్జాతీయంగా ఈ విలువైన మెటల్స్ ధరలు పడిపోవడమే కాకుండా.. స్థానిక ఆభరణదారులు, వర్తకుల నుంచి ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో దేశీయంగా ధరలు దిగొచ్చాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.430 చొప్పున తగ్గి రూ.32,020, రూ.31,870గా నమోదయ్యాయి. నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు 165 రూపాయలు లాభపడిన సంగతి తెలిసిందే. -
తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నా.. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ సన్నగిల్లడంతో బంగారం ధరలు నేడు బులియన్ మార్కెట్లో రూ.115 తగ్గాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేటి మార్కెట్లో రూ.32,285గా నమోదైంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా వంద రూపాయలు తగ్గి, కేజీకి రూ.41,300గా రికార్డయ్యాయి. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కూడా పడిపోయినట్టు మార్కెట్ ట్రేడర్లు చెప్పారు. అధిక ధరలు స్థానిక జువెలర్స్, రిటైలర్ల డిమాండ్‌ను దెబ్బ తీస్తున్నాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు 1,320 డాలర్లుగా నమోదనప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గినట్టు పేర్కొన్నారు. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.115 తగ్గి రూ.32,285, రూ.32,135 చొప్పున నమోదయ్యాయి. అధిక ధరలతో ఈ ఏడాది దేశీయంగా బంగారపు ఆభరణాల డిమాండ్ 2-4 శాతం తగ్గే సూచనలు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ అంచనావేస్తోంది. గత మూడు నెలల నుంచి కొనసాగింపుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఐక్రా వైస్ ప్రెసిడెంట్ కే శ్రీ కుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో జెమ్స్, జువెల్లరీ రంగంలో పెట్టే ఫైనాన్సింగ్‌పై కూడా పరిశీలనలు పెరిగాయని తెలిపారు. -
ఒక్కసారిగా పడిపోయిన బంగారం
న్యూఢిల్లీ : మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. బంగారం 240 రూపాయల మేర కిందకి పడిపోయింది. దీంతో నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.32,390గా రికార్డైంది. గ్లోబల్‌గా వస్తున్న బలహీనమైన సంకేతాలు, స్థానిక జువెలర్ల నుంచి డిమాండ్ అంతగా లేకపోవడం బంగారం ధరల తగ్గుదలకు కారణమైంది. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి వెండికి కూడా డిమాండ్ తగ్గడంతో, వెండి ధరలు సైతం 180 రూపాయిలు క్షీణించాయి. దీంతో కేజీ వెండి ధర మార్కెట్లో రూ.41,300గా ఉంది. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.28 శాతం తగ్గి ఔన్స్‌కు 1,341.50 డాలర్లుగా నమోదైంది. వెండి 0.75 శాతం తగ్గి ఔన్స్ 17.09 డాలర్లుగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.240 చొప్పున పెరిగి రూ.32,390గా, రూ.32,240గా రికార్డయ్యాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు రూ.630 మేర పెరిగిన సంగతి తెలిసిందే. -
రేపే అక్షయ తృతీయ : బంగారం జంప్
న్యూఢిల్లీ : అక్షయ తృతీయ పర్వదినానికి ఒక్క రోజు ముందు బంగారం ధరలు పైకి జంప్ చేశాయి. ఢిల్లీలో బంగారం ధరలు 350 రూపాయలు పైకి ఎగిసి, 10 గ్రాములకు రూ.32,350గా నమోదయ్యాయి. అక్షయ తృతీయ సందర్భంగా స్థానిక జువెలర్స్ నుంచి కొనుగోళ్లు పెరగడంతో, బంగారం ధరలు రికవరీ అయినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. సిల్వర్ ధరలు కూడా కేజీకి రూ.400 పెరిగి రూ.40,300గా రికార్డయ్యాయి. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి డిమాండ్ పెరగడంతో సిల్వర్ ధరలు ఎగిసినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతున్నప్పటికీ దేశీయంగా మాత్రం పైకి ఎగిశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.350 చొప్పున పెరిగి 10 గ్రాములకు రూ.32,350గా, రూ.32,200గా రికార్డయ్యాయి. కాగ, సోమవారం బంగారం ధరలు 100 రూపాయలు కిందకి పడిపోయిన సంగతి తెలిసిందే. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ పడిపోవడం కూడా ఈ విలువైన మెటల్ ధరలు పెరగడానికి దోహదం చేస్తున్నట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. -
తగ్గింపుకు బ్రేక్ : పెరిగిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. నేటి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. వచ్చే పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్‌ను అందుకోవడం కోసం స్థానిక జువెల్లర్ల నుంచి తాజాగా కొనుగోళ్లు పెరుగడంతో, 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.31,170గా నమోదైంది. వెండి ధరలు సైతం రికవరీ అయ్యాయి. రూ.330 మేర పెరిగిన వెండి నేటి మార్కెట్లో కేజీకి రూ.39,230గా రికార్డైంది. వెండికి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగింది. వచ్చే పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్‌ను అందుకోవడం కోసం స్థానిక జువెల్లర్లు కొనుగోళ్లు చేపడుతున్నారని, అదేవిధంగా గ్లోబల్‌గా స్వల్పంగా ట్రెండ్ మెరుగుపడిందని దీంతో బంగారం, వెండి ధరలు రికవరీ అవుతున్నట్టు ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా న్యూయార్క్‌లో బంగారం ధర 0.02 శాతం పెరిగి ఔన్స్‌కు 1,318.30 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధానిలో 99.9, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.220 చొప్పున పెరిగి రూ.31,170గా, రూ.31,020గా నమోదయ్యాయి. గత రెండు సెషన్లలో ఈ ధరలు రూ.650 తగ్గాయి. -
ర్యాలీకి బ్రేక్ : తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : రాబోతున్న పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పైపైకి ఎగుస్తూ వచ్చిన బంగారం ధరలు, నేడు పతనబాట పట్టాయి. స్థానిక ఆభరణ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడంతో పాటు, అంతర్జాతీయంగా పరిస్థితుల ప్రభావం స్తబ్దుగా ఉండటం వల్ల మార్కెట్లో బంగారం ధరలు తగ్గినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. నేడు(శనివారం) బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 250 రూపాయలు తగ్గి, రూ.31,200గా నమోదైంది. అయితే, గ్లోబల్ మార్కెట్లో మాత్రం 0.15 శాతం పెరిగి ఔన్సు ధర 1,349.30 డాలర్లకు చేరింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున పెరిగి రూ.31,200, రూ.31,050గా నమోదయ్యాయి. కాగ, కిలో వెండి ధర రూ. 350 తగ్గడంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 40,650గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోయాయని విశ్లేషకులు చెప్పారు. -
పెరిగిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : సంక్రాంతి పండుగ సీజన్లో బంగారం ధరలు పైపైకి పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేటి బులియన్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏడు వారాల గరిష్టంలో వంద రూపాయలు పెరిగి 30,750 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలు మాత్రమే కాకుండా.. డాలర్ విలువ పడిపోవడం, స్థానిక ఆభరణ వర్తకదారుల నుంచి కొనుగోళ్లు దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరను పెంచుతున్నాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా బంగారం ధరలు ఒక్కో ఔన్స్‌కు 1.17 శాతం పెరిగి 1,337.40 డాలర్లుగా నమోదయ్యాయి. అదేవిధంగా సిల్వర్ ధరలు కూడా 1.44 శాతం లాభపడి, ఔన్స్‌కు 17.21 డాలర్లకు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 10 గ్రాములకు 30,750 రూపాయలుగా, 30,600 రూపాయలుగా ఉన్నాయి. అదేవిధంగా వెండి ధరలు కూడా దేశీయంగా 100 రూపాయలు లాభపడి కేజీకి 39,900 రూపాయలకు పెరిగాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి మద్దతు వస్తుండటంతో, వెండి ధరలు పెరిగినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. -
మళ్లీ కిందకి పడిన పుత్తడి
న్యూఢిల్లీ : వరుసగా పది రోజుల నష్టాల అనంతరం ఒక్కసారిగా పైకి ఎగిసిన బంగారం ధరలు, మళ్లీ కిందకి పడిపోయాయి. నేటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.155 నష్టపోయి, 10 గ్రాములకు రూ.29,510గా నమోదయ్యాయి. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు బంగారం ధరలను పడగొట్టాయి. వెండి ధరలు కూడా రూ.480 క్షీణించాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో, వెండి ధరలు రూ.480 తగ్గి, కేజీకి రూ.37,800గా నమోదయ్యాయి. ప్రస్తుతం స్థానిక జువెల్లర్స్, రిటైలర్స్ నుంచి డిమాండ్ తగ్గిపోయిందని, దీంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయని ట్రేడర్లు చెప్పారు. అంతేకాక అమెరికా ఫెడ్ వడ్డీరేట్లను పెంచడంతో బంగారానికి అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు వీస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు 0.22 శాతం పడిపోయి, ఔన్స్‌కు 1,252.70 డాలర్లుగా నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం బంగారం ధరలు రూ.155 చొప్పున పడిపోయి రూ.29,510, రూ.29,360గా ఉన్నాయి. -
బంగారం ధరలు పెరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం ధరల పతనానికి బ్రేక్ పడింది. వరుసగా పది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా పైకి ఎగిశాయి. నేటి మార్కెట్లో బంగారం ధర రూ.230 పెరిగి పది గ్రాములకు రూ.29,665గా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితులతోపాటు స్థానిక జువెల్లర్స్ నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలు పెరిగినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. గత వారం బంగారు ఆభరణాల కొనుగోళ్లు భారీగా తగ్గడంతో 12రోజుల్లో రూ.1,551 వరకు తగ్గింది. వెండి కూడా రూ.680 పెరిగి రూ.38వేల మార్కు పైకి చేరుకుంది. నేటి మార్కెట్లో కిలో వెండి ధర రూ.38,280గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి భారీగా కొనుగోళ్లు జరగడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం, డాలర్ విలువ మారకపోవడం బంగారం ధర పెరుగుదలకు దోహదం చేసిందని ట్రేడర్లు తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.17శాతం పెరిగి ఔన్సు 1,257.50 డాలర్లు పలికింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.230 చొప్పున పెరిగి రూ.29,665, రూ.29,515గా నమోదయ్యాయి. -
4 నెలల పతనానికి బంగారం ధరలు
న్యూఢిల్లీ : వరుసగా ఆరో రోజుల నుంచి బంగారం ధరలు కిందకి పడిపోతూ ఉన్నాయి. నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నాలుగు నెలల కనిష్ట స్థాయిల్లో నమోదయ్యాయి. రూ.180 చొప్పున పడిపోయిన బంగారం ధరలు 10 గ్రాములకు రూ.29,400గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్, జువెల్లర్ల నుంచి తక్కువ డిమాండ్ నేపథ్యంలో బంగారం ధరలు మరింత కిందకి దిగజారుతున్నాయి. వెండి కూడా స్వల్పంగా రూ.25 తగ్గి, కేజీకి రూ.37,775గా నమోదైంది. ఈ వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచవచ్చనే సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ కొనసాగుతుందని, అంతేకాక స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ సరిగా లేదని బులియన్ ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.54 శాతం తగ్గి, ఒక్కో ఔన్స్‌కు 1,241.40 డాలర్లు నమోదైంది. వెండి 0.95 శాతం తగ్గి, ఔన్స్‌కు 15.67 డాలర్లుగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.180 చొప్పున తగ్గి, రూ.29,400, రూ.29,250గా నమోదయ్యాయి. ఆగస్టు 5 తర్వాత ఇవే అత్యంత కనిష్ట స్థాయిలు. గత ఐదు రోజుల్లో బంగారం ధరలు రూ.670 కిందకి పడిపోయాయి. -
మరింత తగ్గిన బంగారం ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు మరింత కిందకి పడిపోయాయి. గురువారం రూ.200లు తగ్గిన బంగారం ధర, శుక్రవారం ట్రేడింగ్‌లో మరో రూ.200 తగ్గింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.29,750గా నమోదైంది. బలహీనమైన అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అటు వెండి ధరలు కూడా రూ.38 వేల మార్కుకు కిందకి పడిపోయాయి. రూ.425 క్షీణించడంతో కేజీ వెండి రూ.37,700గా నమోదైంది. వెండికి కూడా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ధర పడిపోయినట్లు ట్రేడర్లు చెప్పారు. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలే మెటల్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. మే నుంచి బంగారం ధరలు అత్యధిక వార పతనాన్ని నమోదుచేస్తున్నాయి. అమెరికా వడ్డీరేట్లు పెంచుతుందనే సంకేతాలు బంగారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ వారంలో బంగారం 2.5 శాతం దిగజారింది. అంతర్జాతీయంగా బంగారం ధర 1.27శాతం తగ్గడంతో ఔన్సు 1,247.80 డాలర్లు పలికింది. వెండి 1.41శాతం తగ్గడంతో ఔన్సు 15.70డాలర్లుగా ఉంది. -
భారీగా ఎగిసిన బంగారం ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో శుక్రవారం మార్కెట్లో భారీగా ఎగిసిన బంగారం ధరలు, ఒక్కరోజుల్లో ఢమాలమన్నాయి. స్థానిక జువెలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు, బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో శనివారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.820 కిందకి పడిపోయి రూ.30,530గా నమోదైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా పడిపోవడం ఇదే తొలిసారి. నిన్నటి బులియన్ మార్కెట్లో ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 990 రూపాయల మేర పెరిగి రూ.31,350గా నమోదైన సంగతి తెలిసిందే. గ్లోబల్‌గా కూడా ఏడాది గరిష్టానికి ఎగిసిన బంగారం ధరలు 0.19 శాతం పడిపోయి ఔన్స్‌కు 1,346 డాలర్లగా నమోదయ్యాయి. సిల్వర్ ధరలు 0.91 శాతం తగ్గుముఖం పట్టాయి. దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 820 రూపాయల చొప్పున రూ.30,530, రూ.30,380గా నమోదయ్యాయి. మరోవైపు సిల్వర్ ధరలు దేశీయ మార్కెట్లో ఫ్లాట్‌గా ఉన్నాయి. కేజీకి రూ.42వేలుగా నమోదయ్యాయి. -
ఒక్కరోజులోనే కిందకి పడిన బంగారం
సాక్షి, న్యూఢిల్లీ : పరుగులు పెట్టిన పుత్తడి ఒక్కరోజులోనే మళ్లీ భారీగా కిందకి పడిపోయింది. ఉత్తరకొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించిందనే వార్తల నేపథ్యంలో మంగళవారం అమాంతం పైకి ఎగిసిన బంగారం ధరలు, బుధవారం 350 రూపాయల మేర ఢమాలమన్నాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, దానికి తోడు స్థానిక జువెల్లర్ల నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 350 రూపాయలు పడిపోయి, రూ.30,100గా నమోదైంది. వెండి కూడా 500 రూపాయల మేర క్షీణించి, 41వేల రూపాయల మార్క్ కిందకి చేరింది.. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి పెద్దగా డిమాండ్ రాకపోవడంతో కేజీ వెండి ధర బులియన్ మార్కెట్లో రూ.40,600గా నమోదైంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు 0.07 శాతం పడిపోయి ఔన్స్‌కు 1,308.60 డాలర్లుగా నమోదయ్యాయి. సిల్వర్ కూడా 0.43 శాతం క్షీణించి ఔన్స్‌కు 17.35 డాలర్లుగా ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.350 చొప్పున పడిపోయి రూ.30,100గా, రూ.29,950గా నమోదయ్యాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఇది రూ.550 మేర పెరిగిన సంగతి తెలిసింది. -
బంగారం ధరలు మరింత పతనం!
న్యూఢిల్లీ : బంగారం ధరలు మరింత కుదేలయ్యాయి. శనివారం బంగారం ధరలు మరో రూ.130 పడిపోయి, 10 నెలల కనిష్టానికి నమోదయ్యాయి. దీంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.28,450కి దిగజారింది. అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్ కొనసాగుతుండటంతో పాటు, దేశీయ మార్కెట్లో జువెల్లరీల నుంచి డిమాండ్ రాకపోతుండటంతో బంగారం ధరలు భారీగా క్షీణిస్తున్నాయి. అటు సిల్వర్ ధరలు కూడా రూ.600 పతనమై కేజీకి రూ.41,250గా నమోదయ్యాయి. పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీదారుల డిమాండ్ క్షీణించడంతో వెండి కూడా తిరోగమనంలో పడింది. ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచుతాదనే సంకేతాలతో బంగారానికి అంతర్జాతీయంగా సెంటిమెంట్ పడిపోయిందని ట్రేడర్లు పేర్కొన్నారు. గ్లోబల్‌గా బంగారం ఒక్క ఔన్స్‌కు 0.92 శాతం దిగజారి, 1,159.60 డాలర్లుగా ఉంది. దేశీయ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం ప్యూరిటీ బంగారం ధరలు చెరో రూ. 130 పడిపోయి రూ.28,450గా, రూ.28,300గా నమోదయ్యాయి. శుక్రవారం కూడా ఈ విలువైన మెటల్ రూ.130 పడిపోయింది. అంతర్జాతీయ దెబ్బతో పాటు, దేశీయంగా బ్లాక్‌మనీ దారులపై ప్రభుత్వం ప్రకటించిన పాత నోట్ల రద్దు, బంగారంపై ఆంక్షలు ఈ ధరలకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. -
మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు!
ముంబై : గత కొన్ని రోజులుగా తగ్గుముఖంగా ఉన్న బంగారం ధరలు సోమవారం రికవరీ అయ్యాయి. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో పాటు దేశీయ బులియన్ మార్కెట్లో నెలకొన్న తాజా డిమాండ్‌తో బంగారం ధరలు ఎగిశాయి. వెండి సైతం స్వల్పంగా లాభపడింది. శుక్రవారం రూ.29,160గా ఉన్న 99.5 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర నేటి మార్కెట్లో రూ.135 రూపాయలు లాభపడి రూ.29,295గా నమోదైంది. అదేవిధంగా 10 గ్రాముల ప్యూర్ బంగారం ధర రూ.29,445గా ఉంది. వెండి ధర సైతం స్వల్పంగా రూ.35 ఎగిసి కేజీ రూ.41,800 వద్ద ముగిసింది. డాలర్ షాక్‌తో ఐదున్నర కనిష్ట స్థాయికి పడిపోయిన బంగారం ధరలు గ్లోబల్‌గా పునరుద్ధరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ద్రవ్యోల్బణం పెరగొచ్చనే అంచనాలతో డాలర్ విలువ బలపడుతూ వస్తోంది. దూసుకుపోతున్న డాలర్ కొంచెం నెమ్మదించే సరికి, బంగారం ధరలు పునరుద్ధరించుకోవడం ప్రారంభించాయి. స్పాట్ గోల్డ్ ధరలు అంతర్జాతీయంగా ఒక ఔన్స్‌కు 1,214.21 డాలర్లు ఎగిశాయి. సిల్వర్ సైతం 16.67 డాలర్లు పెరిగింది. -
ఒకేరోజు వెండి రూ.1,000 అప్
ముంబై: దేశీ మార్కెట్లో బంగారు, వెండి ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయ పరిస్థితులను అనుసరించి ఇన్వెస్టర్లు సహా రిటైల్ జువె లర్స్ నుంచి డిమాండ్ ఏర్పడటంతో పసిడి ధర ఒక్కసారిగా పరుగు తీసింది. ముంబై మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల 24 క్యారెట్ల బంగారం ధర రూ.355 పెరుగుదలతో రూ.31,080 నుంచి రూ.31,435కు ఎగసింది. అలాగే 99.5 స్వచ్ఛత గల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.355 వృద్ధితో రూ.30,930 నుంచి రూ.31,285కు చేరింది. ఒక వెండి విషయానికి వస్తే.. పరిశ్రమల నుంచి ఉన్న డిమాండ్ కారణంగా దీని ధర ఏకంగా రూ.1,100కుపైగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1,118 పెరుగుదలతో రూ.46,695 నుంచి రూ.47,813కి ఎగసింది. అంతర్జాతీయంగా లండన్ మార్కెట్లో బంగారం ధర మార్కెట్ ప్రారంభంలో ఒక శాతం వృద్ధితో ఔన్స్‌కు 1,353 డాలర్లకు పెరిగింది. ఇక వెండి ధర 2.6 శాతం వృద్ధితో ఔన్స్‌కు 20 డాలర్లకు ఎగసింది. -
మళ్లీ దిగివస్తున్న బంగారం ధరలు
- ముంబై బులియన్ మార్కెట్లో రెండు రోజుల్లో రూ.765 డౌన్ - అంతర్జాతీయ బలహీన ధోరణి ప్రభావం ముంబై: పసిడి, వెండి ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో ముంబై బులియన్ మార్కెట్లో పసిడి 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.765 పడింది. వెండి కేజీ ధర రూ.1,355 నష్టపోయింది. స్థానిక బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.355 పడి రూ.26,595కు చేరింది. 22 క్యారెట్ల ధర సైతం అంతే పరిమాణంలో కిందకుదిగి రూ.26,445కు జారింది. వెండి కేజీ ధర రూ.785 పడి రూ.35,045కు చేరింది. కారణం: అంతర్జాతీయ, దేశీ మార్కెట్లలో ఫ్యూచర్స్ మార్కెట్లో బలహీన ధోరణి, అలాగే స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లేకపోవడం వంటి అంశాలు దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితి ఇదీ... కాగా బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లలో సైతం పసిడి, వెండి ధరలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నెమైక్స్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర 15 డాలర్ల నష్టంతో 1,123 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా నష్టాల్లో 14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇందుకు అనుగుణంగా దేశీయ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర 374 నష్టంతో రూ.26,366 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర ఏకంగా రూ.1,250 నష్టంతో రూ.33,414 వద్ద ట్రేడవుతోంది. తాజా ట్రేడింగ్ ఇదే ధోరణిలో ముగిసి, గురువారం రూపాయి బలహీనపడితే, దేశీయ మార్కెట్లో పసిడి వెండి ధర రేపు (గురువారం) మరింత పడే అవకాశం ఉంది. -
నెల గరిష్టానికి పసిడి
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ ధోరణికి అనుగుణంగా దేశీయంగా బుధవారం పలు బులియన్ స్పాట్ మార్కెట్లలో పసి డి, వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి నెల రోజుల గరిష్ట స్థాయికి చేరింది. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కూడా దీనికి జతయ్యింది. ప్రధాన బులియన్ మార్కెట్ ముంబైలో పసిడి ధర 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.465 పెరిగి, రూ.27,055కు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా ఇదే పరిమాణంలో ఎగసి రూ.26,905కు ఎగసింది. వెండి కేజీకి రూ.1,300 పెరిగి రూ.38,550కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యూచర్స్‌లో బుధవారం రాత్రి కడపటి సమాచారం అందే సరికి పసిడి, వెండి స్వల్ప లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. పసిడి ఔన్స్‌కు (31.1 గ్రా) 1,230 డాలర్లు, వెండి 17 డాలర్లకు ఎగువన ట్రేడింగ్ జరుగుతోంది. -
బంగారం ధర మళ్లీ 29 వేలకు
ముంబై: బంగారం ధర శుక్రవారం నెల గరిష్ట స్థాయిని తాకింది. అమెరికా-ఇరాక్, రష్యా-ఉక్రేయిన్, ఇజ్రాయెల్-గాజాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి అందుతున్న మద్దతు పసిడి ధర పెరుగుదలకు ఒక కారణం. ఈ పరిస్థితుల్లో దేశీయంగా స్టాకిస్టుల కొనుగోళ్లూ కనకం ధరకు ఊతం ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ (31.1.గ్రా)కు దాదాపు 1315 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ముంబై స్పాట్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత ధర గురువారం ముగింపు ధరతో పోల్చితే శుక్రవారం రూ.210 పెరిగింది. రూ.28,735 వద్ద ముగిసింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,585 వద్ద ముగిసింది. ఢిల్లీలో ధర రెండు నెలల గరిష్ట స్థాయిలో మళ్లీ రూ. 29 వేల పైకి ఎగసింది. ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు ఇదే స్థాయికి చేరాయి. కాగా అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితుల్లో క్రూడ్ ధరలు సైతం స్వల్పకాలంలో కొంతమేర పెరిగే అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణ. -
10 నెలల కనిష్టానికి పుత్తడి
ముంబై: పసిడి ధర ముంబై స్పాట్ మార్కెట్లో శనివారం 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర క్రితం ధరతో పోల్చితే... రూ.70 తగ్గి, రూ.26,755కు చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర కూడా అంతే మొత్తం తగ్గి రూ.26,605కు చేరింది. కాగా వెండి కేజీ ధర రూ.215 తగ్గి రూ.40,865కు దిగివచ్చింది. వరుసగా ఆరు రోజుల నుంచీ బంగారం ధరలు తగ్గుతున్నాయి. దేశీయంగా డిమాండ్ తగ్గడం, స్టాకిస్టుల అమ్మకాలు వంటి అంశాలు దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్లో సైతం బంగారం ధర బలహీనంగానే ట్రేడవుతోంది. నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,250 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. వెండి విషయంలో ఈ ధర 19 డాలర్లుగా ఉంది. అమెరికా ఉద్యోగ కల్పన గణాంకాలు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతోందన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. దీనితో పసిడిలో డబ్బు క్యాపిటల్ మార్కెట్లలోకి మళ్లుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పసిడి, వెండి ధర మెట్టు దిగడానికి దారితీస్తోందని వారు తెలుపుతున్నారు. ఆయా అంశాలుసైతం దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని వారు భావిస్తున్నారు. -
పడిన పసిడి ధర
ముంబై: దిగుమతులపై ఆంక్షలను రిజర్వు బ్యాంకు సడలించడంతో బంగారం ధర గురువారం భారీగా పతనమైంది. పది నెలల కనిష్టస్థాయికి చేరింది. ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం (99.5 ప్యూరిటీ) రేటు రూ.780 క్షీణించి రూ.27,690కి చేరింది. బుధవారం క్లోజింగ్ ధర రూ.28,470. ప్యూర్ గోల్డ్ (99.9 ప్యూరిటీ) ధర ఇదే స్థాయిలో పతనమై రూ.28,620 నుంచి రూ.27,840కి చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.85 పెరిగి రూ.41,860 వద్ద ముగిసింది. బుధవారం క్లోజింగ్ ధర రూ.41,775. ఢిల్లీలో రూ.800... దేశ రాజధానిలో బంగారం ధర రూ.800 వరకు క్షీణించింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో రేటు పతనం కావడం ఈ ఏడాది ఇదే ప్రథమం. పది గ్రాముల పసిడి ధర రూ.28,550కి చేరింది. గత పది నెలల్లో ఇదే కనిష్ట ధర. చెన్నై మార్కెట్లోనూ ధర దిగజారింది. పది గ్రాముల పుత్తడి రేటు రూ.800 తగ్గిపోయి రూ.28,310కి చేరుకుంది. కోల్‌కతాలోనూ రూ.665 తగ్గుదలతో రూ.28,340కి చేరింది. పసిడి దిగుమతికి ట్రేడింగ్ హౌస్‌లను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటు(క్యాడ్)ను అదుపు చేసేందుకు గతేడాది జూలై నుంచి పుత్తడి దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. బ్యాంకులను మాత్రమే, అది కూడా 80ః20 ఫార్ములాతో(దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలనే నిబంధన) దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం క్యాడ్ అదుపులోకి రావడం తో పాటు ఆభరణాల తయారీదారులు, బులి యన్ డీలర్ల విజ్ఞప్తులతో దిగుమతులపై ఆంక్షల ను సడలించారు. దీంతో స్టాకిస్టులు భారీగా అ మ్మకాలు జరపడంతో ధరలు పతనమయ్యాయి. నెలకు 10-15 టన్నులు పెరగనున్న దిగుమతులు.. దిగుమతులపై ఆంక్షలు సడలించడంతో బంగారం దిగుమతులు నెలకు 10-15 టన్నుల మేరకు పెరిగే అవకాశముంది. ఎన్నికల ఫలితాల తర్వాత రూపాయి మారకం రేటు పుంజుకుందనీ, కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడనుండడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందనీ అఖిల భారత రత్నాలు, ఆభరణాల సమాఖ్య (జీజేఎఫ్) డెరైక్టర్ బచ్‌రాజ్ బామాల్వా న్యూఢిల్లీలో తెలిపారు. సరఫరాలు పెరుగుతాయి: ఆంక్షల సడలింపు నేపథ్యంలో భారత్‌లోకి బంగారం అధికారిక సరఫరాలు పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) అభిప్రాయపడింది. దిగుమతి లెసైన్సు ఉన్న వారు మళ్లీ మార్కెట్లోకి వస్తారని కౌన్సిల్ ఎండీ సోమసుందరం చెప్పారు. అయితే 80ః20 ఫార్ములా నేటికీ కొనసాగడం ప్రతికూల అంశమని వ్యాఖ్యానించారు. -
బంగారం ఇప్పటికే కొనేశారు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా ఏదైనా వస్తువు ధర తగ్గితే ఎవరైనా కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. బంగారం విషయంలో ఇది మరీ ఎక్కువ. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ధర తగ్గినా కస్టమర్లు దూరంగానే ఉంటున్నారు. భారత్‌లో కొన్ని నెలల క్రితం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.35 వేల దాకా వెళ్లి ప్రస్తుతం రూ.29 వేలకు అటూ ఇటుగా ఉంది. అయినప్పటికీ కస్టమర్లను మెప్పించడం లేదు. దీనికి కారణం ఇప్పటికే అవసరానికి మించి బంగారం కొనడమే. గతేడాది జూన్‌లో బంగారం ధర రూ.25 వేలకు చేరినప్పుడు వినియోగదారులు ఇబ్బడిముబ్బడిగా పుత్తడిని దక్కించుకున్నారు. అదీ గంటల తరబడి క్యూలో నిలుచుని. ఇప్పుడు అందుకు భిన్నంగా బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. బ్యాంకుల వల్లే ప్రీమియం..: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు(31.1 గ్రాములు) 1,300 డాలర్ల వద్ద కదలాడుతోంది. 10 గ్రాములకు సుమారుగా రూ.24,980 అన్నమాట. 10% కస్టమ్స్ పన్ను, 1% వ్యాట్ మొత్తం రూ.2,841 కలుపుకుంటే భారత్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.27,727 ఉండాలి. కానీ ప్రీమియం ధరకు ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.28,500 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో 999 స్వచ్ఛత బంగారం 10 గ్రాములు రూ.29,830 పలుకుతోంది. బ్యాంకులు అధిక ధరకు విక్రయించడం వల్లే ఈ ప్రీమియం వుంటున్నదనేది బులియన్ వర్తకుల వాదన. గతేడాది ఔన్సుకు 3 డాలర్లున్న ప్రీమియం, పన్నులతో కలిపి నేడు 70 డాలర్లకుపైగా ఎగబాకిందని బులియన్ విశ్లేషకులు, రిద్ధిసిద్ధి బులియన్స్(ఆర్‌ఎస్‌బీఎల్) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి జి.శేఖర్ తెలిపారు. పసిడి దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తే ప్రీమియం తగ్గుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు, భారత్‌కు మధ్య ధరలో వ్యత్యాసం ఉన్నందునే స్మగ్లింగ్ అధికమైందని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ తెలిపారు. బ్యాంకులు ప్రీమియం భారీగా వసూలు చేస్తున్నాయన్నారు. సెంటిమెంటు బాగోలేదు కాబట్టే ప్రస్తుతం అమ్మకాలు లేవని చెప్పారు. బంగారం దిగుమతుల్లో 20% ఎగుమతి చేయాలన్న నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 20% లోపే..: 2013 ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే ప్రస్తుత కాలంలో పసిడి అమ్మకాలు 20% లోపే ఉంటాయని వర్తకులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారం కొనుగోలు చేయడం ఒక కారణమైతే, ప్రస్తుతం కస్టమర్ల చేతిలో నగదు లేకపోవడమూ మరో కారణంగా తెలుస్తోంది. అటు ఆభరణాలకు, ఇటు పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ తగ్గింది. గతేడాది ఏప్రిల్ లో డాలరుతో రూపాయి మారకం విలువ రూ.54 ఉంటే, నేడు రూ.60కి చేరడమూ ధర ఎక్కువ కావడానికి కారణమైంది. ఇక దిగుమతులు కట్టడి చేసినప్పటికీ ఆభరణాల వర్తకులకు రీసైకిల్డ్ బంగారం మార్కెట్లో లభిస్తోంది. పసిడిపై రుణాలిచ్చే సంస్థల వద్ద ఆభరణాల నిల్వలు పేరుకుపోతున్నాయి. రుణగ్రస్తులు తిరిగి నగదు చెల్లించకపోవడంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నాయి. ఇలా మార్కెట్లోకి బంగారం వస్తోంది. దీనికితోడు స్మగ్లింగ్ జోరందుకుందని ఓ వ్యాపారి వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో 2011లో ఔన్సు బంగారం ధర 1,910 డాలర్ల దాకా వెళ్లి సంచలనం సృష్టిస్తే, 2013 జూన్ చివరివారంలో 1,180 డాలర్లకు పడింది. మార్కెట్ తీరునుబట్టి చూస్తే అంతర్జాతీయంగా బంగారం ధర ఈ వారం ఔన్సుకు 1,293-1,350 డాలర్ల మధ్య ఉండొచ్చని ఆర్‌ఎస్‌బీఎల్ అంచనా వేస్తోంది. భారత్‌లో 10 గ్రాములకు రూ.29-31 వేలు పలుకుతుందని ఆర్‌ఎస్‌బీఎల్ ఎండీ పృథ్వీరాజ్ కొఠారి తెలిపారు. అక్షయ తృతీయ సమీపిస్తోందని, దీంతో గిరాకీ పెరిగి బంగారం దిగుమతులు జోరందుకుంటాయని చెప్పారు. రూపాయి బలపడడం కూడా ధర తగ్గేందుకు కారణమైందని చెప్పారు. దేశంలో బంగారం అన్వేషణకై పరిశోధన, అభివృద్ధికి కొత్త ప్రభుత్వం చొరవ చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బంగారం దిగుమతి నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలి. ఇది కార్యరూపం దాల్చితే ఆసియాలో డిమాండ్‌కు భారత్ నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో బంగారం ఆస్తిగా పనికొస్తుందన్న సత్యం జగమెరిగింది. ధరలు తగ్గిన నేపథ్యంలో పసిడికి డిమాండ్ ఊపందుకుంటుంది’ అని చెప్పారు. -
బంగారం, వెండి కళకళ
ముంబై: అటు అంతర్జాతీయంగా, ఇదే దేశీయంగా బంగారం, వెండి ధరలు గురువారం తళుక్కుమన్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్ విషయానికి వస్తే- ఇక్కడ పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.365 పెరిగి రూ.31,120కి చేరింది. 22 క్యారెట్లకు సంబంధించి కూడా ధర కూడా ఇదే పరిమాణంలో పెరిగి రూ.30,970కి ఎగసింది. వెండి కేజీ ధర రూ. 670 ఎగసి రూ.49,000కు చేరింది. ‘ఫ్యూచర్స్’లో ఇలా...: కాగా గురువారం అంతర్జాతీయంగా నెమైక్స్- కమోడిటీ డివిజన్లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా)కు కడపటి సమాచారం అందేసరికి 40 డాలర్ల లాభంతో (3 శాతం) 1,322 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కాంట్రాక్ట్ సైతం 2 శాతం లాభంతో 22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీనిని అనుసరిస్తూ, దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పసిడి ధర రూ. 605 (2 శాతానికి పైగా) లాభంతో రూ. 29,553 వద్ద ట్రేడవుతుండగా, వెండి కేజీ రూ. 728 లాభంతో (1.55 శాతం) రూ. 48,100 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణిలో ట్రేడింగ్ కొనసాగి, శుక్రవారం రూపాయి బలహీనపడితే దేశీయంగా స్పాట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం వారం గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. డాలర్ బలహీనత, రుణ పరిమితి పెంపునకు సంబంధించి . కుదిరిన ఒప్పందం నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ సహాయక చర్యలు కొనసాగుతాయన్న విశ్వాసం బంగారం, వెండి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. ఈ అంశాలకు తోడు దేశీయంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ బంగారం, వెండి ధరల పెరుగుదల కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టారిఫ్‌ల తగ్గింపు: కాగా దేశీయంగా కస్టమ్స్ సుంకాల నిర్ణయానికి ప్రాతిపదిక అయిన బంగారం, వెండి టారిఫ్ విలువలను కేంద్ర ప్రభుత్వం గురువారం తగ్గించింది. దీని ప్రకారం బంగారం దిగుమతుల టారిఫ్ విలువ 10 గ్రాములకు 436 డాలర్ల నుంచి 418 డాలర్లకు తగ్గింది. వెండి కేజీ టారిఫ్ విలువ 702 డాలర్ల నుంచి 699 డాలర్లకు తగ్గింది. -
బంగారం భగ్గు ఎగదోసిన రూపాయి పతనం
ముంబై: దేశీయ ప్రధాన బులియన్ మార్కెట్ ముంబైలో పసిడి ధరలు మంగళవారం చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకాయి. దీనికి దేశీయంగా రూపాయి విలువ భారీ పతనమే కాకుండా, అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో ఈ మెటల్ ధర పరుగు కూడా కారణం. వెండిది కూడా అదే ధోరణి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో నెమైక్స్, బ్రెంట్ ధరలు సైతం భారీగా పెరిగాయి.ముంబైలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర క్రితం ముగింపుతో పోల్చితే 5 నెలల గరిష్ట స్థాయికి చేరింది. రూ.810 ఎగసి రూ.32,730కి ఎగసింది. ఆభరణాల బంగారం ధర రూ.820 ఎగసి రూ. 32,585కు చేరింది. వెండి ధర కూడా భారీగా రూ.1,940 పెరిగి రూ. 56,670 వద్దకు పెరిగింది. కాగా దేశ వ్యాప్తంగా పలు బులియన్ మార్కెట్లలో పూర్తి స్వచ్ఛత ధర రూ. 31 వేలు దాటిపోయినప్పటికీ, ఆభరణాల బంగారం ధర రూ. 29 వేలు-రూ.30వేల శ్రేణిలోనే విక్రయిస్తుండడం విశేషం. అధిక ధరల వద్ద ఆభరణాల వినియోగదారుల డిమాండ్ మందగించకుండా చూడడం రిటైలర్ల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫ్యూచర్స్‌లో ఇలా...: అటు న్యూయార్క్ మర్కం టైల్ ఎక్స్ఛేంజ్- కమోడిటీ ఎక్స్ఛేంజ్ విభాగంలోసైతం పసిడి, వెండి కమోడిటీలు పరుగులు తీస్తున్నాయి. కడపటి సమాచారం అందేసరికి పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోల్చితే 25 డాలర్లు పెరిగి 1,418 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా 2% లాభంతో 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి ధర 5% పైగా లాభంతో (రూ.1,758) రూ.33,614 వద్ద ట్రేడవుతోంది. వెండి 6%కి పైగా ఎగసి(రూ.3,440) రూ.57,227 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే- బుధవారం దేశీయ మార్కెట్లో (రూపాయి విలువ కదలికలకు లోబడి) పసిడి, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రూడ్ ఇలా...: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు మంగళవారం కడపటి సమాచారం అందే సరికి 3%కి పైగా ఎగశాయి. నెమైక్స్ 109 డాలర్ల వద్ద, బ్రెంట్ 114 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. -
32 వేలకు చేరువలో పసిడి
ముంబై: కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధర దేశీయంగా శనివారం తొమ్మిది నెలల గరిష్టాన్ని తాకింది. ముంబై బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం పది గ్రాముల రేటు రూ. 635 పెరిగి రూ. 31,945 వద్ద, ఆభరణాల బంగారం ధర రూ. 630 పెరిగి రూ. 31,790 వద్ద ముగిసింది. మరోవైపు, వెండి కూడా భారీగా ఎగిసి రూ. 54,000 మార్కును దాటింది. కిలో ధర రూ. 2,260 పెరిగి రూ. 54,260 వద్ద ముగిసింది. -
పెరిగిన బంగారం ధరలు
ముంబై: బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే బంగారం ధర 1310 రూపాయల దాకా పెరిగింది. బంగారంపై దిగుమతి సుంకం పెంచడం, పండుగల సీజన్ మొదలవడంతో బంగారం ధరలు భారీగా పెరిగినట్లు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 31,010 ధర పలుకుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 30,810 రూపాయలకు పెరిగింది. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఒక్క రోజులోనే వెండి ధర 3270 రూపాయలు పెరిగి కిలో 49వేల 320 కి చేరింది. 2012 నవంబర్ 27 తరువాత అంటే దాదాపుగా ఆరు నెలల తరువాత బంగారం ధరలు మళ్ళీ 31వేల మార్క్‌ను చేరాయి.