
బంగారం ధరలు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నా.. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ సన్నగిల్లడంతో బంగారం ధరలు నేడు బులియన్ మార్కెట్‌లో రూ.115 తగ్గాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేటి మార్కెట్‌లో రూ.32,285గా నమోదైంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా వంద రూపాయలు తగ్గి, కేజీకి రూ.41,300గా రికార్డయ్యాయి. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కూడా పడిపోయినట్టు మార్కెట్ ట్రేడర్లు చెప్పారు.
అధిక ధరలు స్థానిక జువెలర్స్, రిటైలర్ల డిమాండ్‌ను దెబ్బ తీస్తున్నాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు 1,320 డాలర్లుగా నమోదనప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గినట్టు పేర్కొన్నారు. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.115 తగ్గి రూ.32,285, రూ.32,135 చొప్పున నమోదయ్యాయి. అధిక ధరలతో ఈ ఏడాది దేశీయంగా బంగారపు ఆభరణాల డిమాండ్ 2-4 శాతం తగ్గే సూచనలు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ అంచనావేస్తోంది. గత మూడు నెలల నుంచి కొనసాగింపుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఐక్రా వైస్ ప్రెసిడెంట్ కే శ్రీ కుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో జెమ్స్, జువెల్లరీ రంగంలో పెట్టే ఫైనాన్సింగ్‌పై కూడా పరిశీలనలు పెరిగాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment