న్యూఢిల్లీ : మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. బంగారం 240 రూపాయల మేర కిందకి పడిపోయింది. దీంతో నేటి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.32,390గా రికార్డైంది. గ్లోబల్‌గా వస్తున్న బలహీనమైన సంకేతాలు, స్థానిక జువెలర్ల నుంచి డిమాండ్ అంతగా లేకపోవడం బంగారం ధరల తగ్గుదలకు కారణమైంది. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి వెండికి కూడా డిమాండ్ తగ్గడంతో, వెండి ధరలు సైతం 180 రూపాయిలు క్షీణించాయి.
దీంతో కేజీ వెండి ధర మార్కెట్‌లో రూ.41,300గా ఉంది. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.28 శాతం తగ్గి ఔన్స్‌కు 1,341.50 డాలర్లుగా నమోదైంది. వెండి 0.75 శాతం తగ్గి ఔన్స్ 17.09 డాలర్లుగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.240 చొప్పున పెరిగి రూ.32,390గా, రూ.32,240గా రికార్డయ్యాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు రూ.630 మేర పెరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment