పెరిగిన బంగారం ధరలు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : అక్షయ తృతీయ పర్వదినానికి ఒక్క రోజు ముందు బంగారం ధరలు పైకి జంప్ చేశాయి. ఢిల్లీలో బంగారం ధరలు 350 రూపాయలు పైకి ఎగిసి, 10 గ్రాములకు రూ.32,350గా నమోదయ్యాయి. అక్షయ తృతీయ సందర్భంగా స్థానిక జువెలర్స్ నుంచి కొనుగోళ్లు పెరగడంతో, బంగారం ధరలు రికవరీ అయినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. సిల్వర్ ధరలు కూడా కేజీకి రూ.400 పెరిగి రూ.40,300గా రికార్డయ్యాయి. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి డిమాండ్ పెరగడంతో సిల్వర్ ధరలు ఎగిసినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు.
అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోతున్నప్పటికీ దేశీయంగా మాత్రం పైకి ఎగిశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.350 చొప్పున పెరిగి 10 గ్రాములకు రూ.32,350గా, రూ.32,200గా రికార్డయ్యాయి. కాగ, సోమవారం బంగారం ధరలు 100 రూపాయలు కిందకి పడిపోయిన సంగతి తెలిసిందే. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ పడిపోవడం కూడా ఈ విలువైన మెటల్ ధరలు పెరగడానికి దోహదం చేస్తున్నట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment