అలా ముగిసిందో లేదో.. ఇలా తగ్గింది! | gold price today rate may 11 Akshaya Tritiya | Sakshi
Sakshi News home page

అలా ముగిసిందో లేదో.. ఇలా తగ్గింది!

Published Sat, May 11 2024 1:25 PM | Last Updated on Sat, May 11 2024 2:55 PM

gold price today rate may 11 Akshaya Tritiya

దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ సందడి ముగిసింది. పండుగ రోజున భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర ఈరోజు (మే 11) 10 గ్రాములకు రూ.330 మేర తగ్గింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గింది. ప్రస్తుతం రూ.67,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.330 తగ్గి రూ. 73,360 లకు దిగొచ్చింది.

ఇతర ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.330 దిగొచ్చి రూ.73,510 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.330 క్షీణించి రూ.73,360 వద్దకు తగ్గింది.

బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.330 తగ్గి రూ.73,360లకు దిగొచ్చింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.67,500 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.210 తగ్గి రూ.73,640 లకు దిగొచ్చింది.

వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు రూ.700 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.87,000లుగా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement