
బంగారం
ముంబై: బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే బంగారం ధర 1310 రూపాయల దాకా పెరిగింది. బంగారంపై దిగుమతి సుంకం పెంచడం, పండుగల సీజన్ మొదలవడంతో బంగారం ధరలు భారీగా పెరిగినట్లు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 31,010 ధర పలుకుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 30,810 రూపాయలకు పెరిగింది.
వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఒక్క రోజులోనే వెండి ధర 3270 రూపాయలు పెరిగి కిలో 49వేల 320 కి చేరింది. 2012 నవంబర్ 27 తరువాత అంటే దాదాపుగా ఆరు నెలల తరువాత బంగారం ధరలు మళ్ళీ 31వేల మార్క్‌ను చేరాయి.