
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా వున్నాయి. కాగా రెండు రోజుల వ్యవధిలో నే బంగారం ధరలు సుమారు రూ. 500 వరకు పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో అంతర్జాతియంగా గోల్డ్ ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .52,860 వద్ద ట్రేడవుతోంది. కాగా నేడు 10 గ్రాముల బంగారం ధర రూ. 18 తగ్గడం విశేషం. ఇక సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్‌సీఎక్స్‌లో కిలోకు రూ.147 పెరిగి రూ.68,937 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.440కి పైగా పెరిగి ₹53,460కి చేరుకుంది.
ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010కి పెరిగింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 గా వుంది.. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.53,020 నుంచి రూ.53,460కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment