
ముంబై: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కొంతమేరకు ధరలు తగ్గగా.. ఈ సోమవారం (జూలై 26, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్‌కి సంబంధించి ప్రారంభ సెషన్లో రూ.94.00 పెరిగి రూ.47628.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00 పెరిగి రూ.47902.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.48,000 పైకి చేరుకున్న పుత్తడి చివరి సెషన్లలో కాస్త తగ్గుముఖం పట్టింది.
ఇక వెండికి సంబంధించి సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.189.00 పెరిగి రూ.67213.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.205.00 పెరిగి రూ.68380.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత క్షీణించాయి. డెల్టా వేరియంట్ భయాలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లు సేఫ్‌గా భావించడంతో ఆ ప్రభావం ధరలపై కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment