ముంబై: గత ఐదురోజుల్లో 5 వేల రూపాయల వరకూ తగ్గిన పదిగ్రాముల పసిడి మంగళవారం స్వల్పంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి బంగారంలో పెట్టుబడులకు మళ్లుతుండటంతో యల్లో మెటల్‌కు డిమాండ్ పెరిగింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 107 రూపాయలు పెరిగి రూ. 39,625 పలికింది. ఇక కిలో వెండి రూ. 155 తగ్గి రూ. 36,052కు దిగివచ్చింది. కాగా, కొద్ది రోజులు బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య సాగినా క్రమంగా స్థిరంగా ముందుకు సాగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment