
ఈక్విటీ మార్కెట్ల పతనంతో పసిడి ధరలు మళ్లీ పైకెగిశాయి.
ముంబై : గత రెండు రోజులుగా స్వల్పంగా దిగివచ్చిన బంగారం గురువారం మళ్లీ కొండెక్కింది. ఈక్విటీ మార్కెట్ల పతనంతో మదుపరులు బంగారం వైపు మొగ్గుచూపడంతో హాట్‌మెటల్ మళ్లీ పైపైకి ఎగబాకింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 210 భారమై రూ 42,714 పలికింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా భగ్గుమంది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ 492 పెరిగి రూ 47,068 పలికింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.