న్యూఢిల్లీ : వరుసగా పది రోజుల నష్టాల అనంతరం ఒక్కసారిగా పైకి ఎగిసిన బంగారం ధరలు, మళ్లీ కిందకి పడిపోయాయి. నేటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.155 నష్టపోయి, 10 గ్రాములకు రూ.29,510గా నమోదయ్యాయి. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు బంగారం ధరలను పడగొట్టాయి. వెండి ధరలు కూడా రూ.480 క్షీణించాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో, వెండి ధరలు రూ.480 తగ్గి, కేజీకి రూ.37,800గా నమోదయ్యాయి.
ప్రస్తుతం స్థానిక జువెల్లర్స్, రిటైలర్స్ నుంచి డిమాండ్ తగ్గిపోయిందని, దీంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయని ట్రేడర్లు చెప్పారు. అంతేకాక అమెరికా ఫెడ్ వడ్డీరేట్లను పెంచడంతో బంగారానికి అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు వీస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు 0.22 శాతం పడిపోయి, ఔన్స్‌కు 1,252.70 డాలర్లుగా నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం బంగారం ధరలు రూ.155 చొప్పున పడిపోయి రూ.29,510, రూ.29,360గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment