ఒకేరోజు వెండి రూ.1,000 అప్
ముంబై: దేశీ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయ పరిస్థితులను అనుసరించి ఇన్వెస్టర్లు సహా రిటైల్ జువె లర్స్ నుంచి డిమాండ్ ఏర్పడటంతో పసిడి ధర ఒక్కసారిగా పరుగు తీసింది. ముంబై మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత గల 24 క్యారెట్ల బంగారం ధర రూ.355 పెరుగుదలతో రూ.31,080 నుంచి రూ.31,435కు ఎగసింది. అలాగే 99.5 స్వచ్ఛత గల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.355 వృద్ధితో రూ.30,930 నుంచి రూ.31,285కు చేరింది. ఒక వెండి విషయానికి వస్తే.. పరిశ్రమల నుంచి ఉన్న డిమాండ్ కారణంగా దీని ధర ఏకంగా రూ.1,100కుపైగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1,118 పెరుగుదలతో రూ.46,695 నుంచి రూ.47,813కి ఎగసింది. అంతర్జాతీయంగా లండన్ మార్కెట్‌లో బంగారం ధర మార్కెట్ ప్రారంభంలో ఒక శాతం వృద్ధితో ఔన్స్‌కు 1,353 డాలర్లకు పెరిగింది. ఇక వెండి ధర 2.6 శాతం వృద్ధితో ఔన్స్‌కు 20 డాలర్లకు ఎగసింది.