Today Gold and Silver rates: ఆషాఢం ముగిసి శ్రావణ మాసం అలా షురూ అయిందో లేదో బంగారం ధరలు ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ధరల్లో హెచ్చు తగ్గులను నమోదు చేస్తున్న బంగారం మంగళవారం ఆరంభంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ. 60వేల ఎగువకు చేరింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల రూ. 120 పెరిగి రూ.55100 స్థాయికి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.60,100 పలుకుతోంది. అటు వెండి ధర మాత్రం (హైదరాబాద్‌లో) స్వల్పంగా తగ్గింది. ఆరంభంలో కిలోకు రూ.200 పెరిగిన వెండి ధర ప్రస్తుతం 100 క్షీణించి 81,400 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కీలో వెండి 300 పెరిగి ధర 78 వేలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.55,130 గాను, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.60,130 స్థాయివద్ద ఉంది.
డాలరు బలహీనం, గ్లోబల్ గోల్డ్
ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఔట్‌లుక్‌ను ప్రభావితం చేసే అమెరికా రిటైల్ అమ్మకాల డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నాయి. డాలర్ వీక్‌నెస్ అంతర్జాతీయం పసిడి ధరలను ప్రభావితంచేస్తున్నాయి. స్పాట్ బంగారం 0.4శాతం పెరిగి ఔన్సుకు 1,961.67 డాలర్లకు చేరుకుంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.5శాతం పెరిగి 1,965.40డాలర్లకు చేరింది.
కొనుగోళ్లతో షేర్లు షైన్
అస్థిర బంగారం ధరలు ఉన్నప్పటికీ 2023లో బంగారు ఆభరణాల రిటైలర్ల స్టాక్‌లు మాత్రం లాభాలను ఆర్జిస్తున్నాయని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్‌లో 13 శాతం లాభంతో పోలిస్తే కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, పిసి జ్యువెలర్స్, తంగమయిల్ జువెలరీ , త్రిభోవందాస్ భీమ్‌జీ జవేరి (టిబిజెడ్) ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 21-72 శాతం ర్యాలీ చేశాయి. బంగారం ఆల్-టైమ్ హై ,బలమైన వినియోగదారుల కొనుగోలు నుండి 6 శాతం పడిపోయిన నేపథ్యంలో ఈ ర్యాలీ ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment