నెల గరిష్టానికి పసిడి
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ ధోరణికి అనుగుణంగా దేశీయంగా బుధవారం పలు బులియన్ స్పాట్ మార్కెట్‌లలో పసి డి, వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి నెల రోజుల గరిష్ట స్థాయికి చేరింది. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కూడా దీనికి జతయ్యింది. ప్రధాన బులియన్ మార్కెట్ ముంబైలో పసిడి ధర 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.465 పెరిగి, రూ.27,055కు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా ఇదే పరిమాణంలో ఎగసి రూ.26,905కు ఎగసింది. వెండి కేజీకి రూ.1,300 పెరిగి రూ.38,550కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఫ్యూచర్స్‌లో బుధవారం రాత్రి కడపటి సమాచారం అందే సరికి పసిడి, వెండి స్వల్ప లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. పసిడి ఔన్స్‌కు (31.1 గ్రా) 1,230 డాలర్లు, వెండి 17 డాలర్లకు ఎగువన ట్రేడింగ్ జరుగుతోంది.