బంగారం ధరలు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : అంతకంతకు క్షీణిస్తున్న రూపాయి విలువతో, బంగారం పండుగ చేసుకుంటోంది. రూపాయి విలువ పడిపోతుండటంతో, బులియన్ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెరిగింది. నేడు 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు పెరిగి రూ.31,550గా నమోదైంది. బంగారానికి గ్లోబల్‌గా డిమాండ్ లేనప్పటికీ, దేశీయంగా మాత్రం రివర్స్ ట్రెండ్ నమోదైంది. గ్లోబల్‌గా వరుసగా రెండో రోజు బంగారం ధరలు పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు సెప్టెంబర్‌లో రెండోసారి వడ్డీరేటు పెంచనున్నట్టు తెలియడంతో, గ్లోబల్‌గా బంగారం బలహీనపడుతోంది. కానీ దేశీయంగా మాత్రం స్థానిక ఆభరణ వర్తకుల నుంచి కొనుగోళ్లు పెరగడం బంగారానికి బాగా సహకరించింది.
దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 200 రూపాయల చొప్పున పెరిగి రూ.31,550గా, రూ.31,400గా నమోదైంది. అయితే గత రెండు రోజుల్లో బంగారం మాత్రం 160 రూపాయల తగ్గింది. బంగారంతో పాటు వెండి కూడా 175 రూపాయలు పెరిగి కేజీ ధర 37,950 రూపాయలుగా నమోదైంది. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment