
32 వేలకు చేరువలో పసిడి
ముంబై: కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధర దేశీయంగా శనివారం తొమ్మిది నెలల గరిష్టాన్ని తాకింది. ముంబై బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం పది గ్రాముల రేటు రూ. 635 పెరిగి రూ. 31,945 వద్ద, ఆభరణాల బంగారం ధర రూ. 630 పెరిగి రూ. 31,790 వద్ద ముగిసింది. మరోవైపు, వెండి కూడా భారీగా ఎగిసి రూ. 54,000 మార్కును దాటింది. కిలో ధర రూ. 2,260 పెరిగి రూ. 54,260 వద్ద ముగిసింది.