బంగారం: రెండో దశ కరెక్షన్‌కు చాన్స్‌?! | Gold prices may fall in second wave of correction | Sakshi
Sakshi News home page

బంగారం: రెండో దశ కరెక్షన్‌కు చాన్స్‌?!

Published Wed, Aug 26 2020 9:57 AM | Last Updated on Wed, Aug 26 2020 11:05 AM

Gold prices may fall in second wave of correction  - Sakshi

గత ఐదు రోజులుగా నేలచూపులకే పరిమితమవుతున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ.. వరున నష్టాలకు చెక్‌ పెడుతూ లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం  రూ. 176 పెరిగి రూ. 51,110వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 113 బలపడి రూ. 64,120 వద్ద కదులుతోంది. ఈ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. రెండు వారాలుగా పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. 

మంగళవారమిలా
ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల పసిడి రూ. 345 క్షీణించి రూ. 50,924 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,533 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,820 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,562 కోల్పోయి రూ. 64,007 వద్ద నిలిచింది. ఒక దశలో 66,159 వరకూ జంప్‌చేసిన వెండి తదుపరి రూ. 63,766 వరకూ నీరసించింది. ఎంసీఎక్స్‌లో ఇటీవల నమోదైన గరిష్టం రూ. 56,200 నుంచి పసిడి ధరలు రూ. 5,000కుపైగా దిగిరాగా.. వెండి మరింత అధికంగా రూ. 78,000 స్థాయి నుంచి రూ. 14,000 వరకూ పతనంకావడం గమనార్హం!

కామెక్స్‌లో ప్లస్‌..
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.6 శాతం బలపడి 1,934 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లో నామమాత్ర లాభంతో 1,930 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి ఔన్స్ 0.8 శాతం ఎగసి 26.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఆశలు, అమెరికా,  చైనా మధ్య ఒప్పందంపై అంచనాల కారణంగా మంగళవారం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించినట్లు నిపుణులు తెలియజేశారు.

మళ్లీ పతనం
అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డ్‌ గరిష్టం 2075 డాలర్ల నుంచి రెండు వారాల క్రితం పతన బాట పట్టిన పసిడి ధరలు మరోసారి బ్రేక్‌డవున్‌ కావచ్చని బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. చార్టుల ప్రకారం ఈ వారంలోనే ఇందుకు వీలున్నట్లు చెబుతున్నారు. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1915 డాలర్ల దిగువకు చేరితే సాంకేతికంగా మరింత బలహీనపడవచ్చని అంచనా వేశారు. ఇది గరిష్ట స్థాయిలవద్ద కొనుగోలు చేసిన ట్రేడర్లలో భయాలకు కారణమై అమ్మకాలు మరింత పెరిగే వీలున్నదని వివరించారు. అయితే 1800 డాలర్ల వద్ద తొలి సపోర్ట్‌ కారణంగా ఔన్స్‌బ్యాక్‌ కావచ్చని తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement