బులియన్ ట్రేడర్లపై ఈడీ దాడులు | ED raids 6 'bogus' companies of bullion traders in Mumbai after suspicious transfers of Rs 69 crore | Sakshi
Sakshi News home page

బులియన్ ట్రేడర్లపై ఈడీ దాడులు

Published Sat, Dec 17 2016 12:47 PM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM

బులియన్ ట్రేడర్లపై ఈడీ దాడులు - Sakshi

బులియన్ ట్రేడర్లపై ఈడీ దాడులు

ముంబాయి : డీమానిటైజేషన్ అనంతరం బులియన్ ట్రేడర్లు తెరతీసిన భారీ అక్రమాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. అనుమానిత లావాదేవీలు జరిపిన బులియన్ ట్రేడర్లపై దాడులు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే నలుగురు బులియన్ ట్రేడర్లు డిపాజిట్ చేసిన రూ.69 కోట్లకు సంబంధించిన అనుమానిత నగదుపై దాడులు నిర్వహించింది. ఆరు బోగస్ కంపెనీల ద్వారా  బులియన్ ట్రేడర్ల అకౌంట్లోకి ఈ నగదును బదిలీ అయినట్టు తెలిసింది. ఈ నగదంతా లెక్కలో చూపని డబ్బుగా ఈడీ గుర్తించింది. ఈ బదిలీ ప్రక్రియంతా ప్రధాని నరేంద్రమోదీ నోట్ల రద్దు చేసినప్పటి నుంచి ప్రారంభమైందని ఈడీ పేర్కొంది..
 
బ్లాక్మనీని వైట్గా మార్చుకోవడానికి నగదు బదిలీల అక్రమాలకు తెరతీశారని అనుమానాల నేపథ్యంలో జరిపిన దాడుల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు ఈడీ వెల్లడించింది. గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసినందుకు ఈ కంపెనీల ద్వారా నగదు బదిలీ చేసినట్టు ఈడీ విచారణలో తేలింది. శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైన ఈ దాడులు శనివారం వరకు కొనసాగాయి. ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ సూచనల మేరకు జావేరి బజార్లో ఈ రైడ్స్ను జరిపారు.  ఈ రైడ్స్లో ఆ నలుగురికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లో రూ.1.2 కోట్ల నగదును ఈడీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement