మహారాష్ట్ర: కొవిడ్ ఫీల్డ్ ఆస్పత్రి స్కామ్ కేసులో శివసేన(యూబీటీ) నేతలు అధిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ అనుచరుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ఐఏఎస్ అధికారి సంజీవ్ జైశ్వాల్‌తో పాటు ఆదిత్య ఠాక్రే అనుచరుడు సూరజ్ ఛవాన్, సంజయ్ రౌత్‌కు సన్నిహితుడైన సుజిత్ పాట్కర్ ఇళ్లలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. థాణె, నవీ ముంబయిలో మొత్తం 15 ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
జైశ్వాల్ థాణె మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. కొవిడ్ సమయంలో ముంబయి అదనపు కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఫీల్డ్ ఆస్పత్రి కాంట్రాక్టు కేటాయింపులపై ముంబయి కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన ఇక్భాల్ సింగ్ చాహల్‌ను జనవరిలోనే ఈడీ ప‍్రశ్నించింది. సుజిత్ పాట్కర్‌పై ఇప్పటికే మనీ లాండరింగ్ అభియోగాలు ఉన్నాయి.
ఇదీ కేసు..
ఆరోగ్య రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినా కొవిడ్ సమయంలో సుజిత్ పాట్కర్‌కే ఫీల్డ్ ఆస్పత్రి కాంట్రాక్టు దక్కింది. తప్పుడు విధానంలో కాంట్రాక్టులు దక్కించుకున్నారని గతేడాది ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేత కీర్తి సోమయ్య ఫిర్యాదుచేశారు. దీంతో లైఫ్‌లైన్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, పాట్కర్, అతడి ముగ్గురు సన్నిహితులపై కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: మొట్టమొదట యోగాకు ప్రాచుర్యం కల్పించిన ప్రధాని ఆయనే..
Comments
Please login to add a commentAdd a comment