యస్ బ్యాంకు కుంభకోణం : ఈడీ దాడులు | Yes Bank case: ED raids five premises of Cox and Kings in Mumbai | Sakshi
Sakshi News home page

యస్ బ్యాంకు కుంభకోణం : ఈడీ దాడులు

Published Mon, Jun 8 2020 3:28 PM | Last Updated on Mon, Jun 8 2020 3:44 PM

Yes Bank case: ED raids five premises of Cox and Kings in Mumbai - Sakshi

సాక్షి, ముంబై : యస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు సోమవారం భారీ తనిఖీలు నిర్వహించారు. మనీలాండరింగ్ ఆరోపణల కేసులో దర్యాప్తునకు సంబంధించి ముంబైలోని గ్లోబల్ టూర్ అండ్ ట్రావెల్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్‌ కు సంబంధమున్న ఐదు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. ఈ సంగతిని ధృవీకరించిన సీనియర్ అధికారి దాడులు కొనసాగుతున్నాయనీ  చెప్పారు. కాక్స్ అండ్ కింగ్స్ ప్రమోటర్ పీటర్ కెర్కర్‌కు మార్చిలోనే నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.   (మరోసారి ఈడీ ముందుకు..)

మాజీ యస్ బ్యాంక్ సీఈవో రవ్ నీత్ గిల్‌ను ఉటంకిస్తూ కాక్స్ అండ్ కింగ్స్, అడాగ్ గ్రూప్, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్సెల్ గ్రూప్, కాక్స్ అండ్ కింగ్స్, ఓంకార్ గ్రూప్, రేడియస్ డెవలపర్, సహానా డెవలపర్స్, అవంత గ్రూప్ వంటి సంస్థల రుణాలతో భారీ ఒత్తిడి పెరిగిందని ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఈడీ వెల్లడించింది. 2019 మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి స్వల్పకాలిక స్లిప్పేజీలకు గురయ్యే ఖాతాదారుల పేర్లతో క్రెడిట్ వాచ్ జాబితాను బ్యాంక్ వెల్లడించినట్టు ఈడీ పేర్కొంది.  ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.  డీహెచ్‌ఎఫ్‌ఎల్ తరువాత సుమారు 2,267 కోట్ల రూపాయల రుణాలతో  కాక్స్ అండ్ కింగ్స్  రెండవ రుణ గ్రహీతగా ఉన్న సంగతి తెలిసిందే. (యస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ 60 వేల కోట్లు)

కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద బ్యాంక్ మాజీ సీఎండీ రానా కపూర్, భార్య, కుమార్తెలు రాఖీ, రోష్ని పై ఇప్పటికే ఈడీ  కేసులు నమోదు చేసింది. వీరితోపాటు కుంభకోణంతో సంబంధముందన్న ఆరోపణలతో మోర్గాన్ క్రెడిట్స్, రాబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, యెస్ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేర్లను కూడా చార్జిషీట్ లో చేర్చింది. (వాధవాన్‌ సోదరుల అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement