రెండో రోజూ పసిడి, వెండి పరుగు | Gold, Silver gains second consecutive day in MCX | Sakshi
Sakshi News home page

రెండో రోజూ పసిడి, వెండి పరుగు

Published Wed, Dec 16 2020 10:37 AM | Last Updated on Wed, Dec 16 2020 12:18 PM

Gold, Silver gains second consecutive day in MCX - Sakshi

న్యూయార్క్/ ముంబై: వరుసగా రెండో రోజు పసిడి, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నెల 18న యూఎస్‌ కాంగ్రెస్‌ సహాయక ప్యాకేజీపై సమీక్షను చేపట్టే వీలున్నట్లు వెలువడిన వార్తలు పసిడికి జోష్‌ నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ రెండున్నరేళ్ల కనిష్టం 90.62కు చేరడం, యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షను చేపట్టడం వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే యూకే, కెనడా, యూఎస్‌ తదితర దేశాలలో వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకావడంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశంలేదని బులియన్‌ వర్గాలు భావిస్తున్నాయి. నేటి ట్రేడింగ్‌ వివరాలు ఇలా.. (పసిడి ధరలకు కోవిడ్‌-19 పుష్‌)

సానుకూలంగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 137 పుంజుకుని రూ. 49,580 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ధర కాగా.. తొలుత 49,510 వద్ద ప్రారంభమైంది ఇది కనిష్టంకాగా.. తదుపరి రూ. 49,626 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ సైతం రూ. 318 వృద్ధితో రూ. 65,171 వద్ద కదులుతోంది. రూ. 65,000 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో రూ. 65,324 వద్ద గరిష్టానికి చేరింది. (పసిడికి ఉద్యోగ గణాంకాల దెబ్బ)

హుషారుగా..
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్‌ 0.3 లాభంతో 1,861 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.2 శాతం బలపడి 1,857 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.75 శాతం ఎగసి 24.83 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్‌ ధరలు. మంగళవారం పసిడి ఫ్యూచర్స్ 1855 డాలర్ల వద్ద స్థిరపడగా.. వెండి 24.64 డాలర్ల వద్ద ముగిసింది. బులియన్‌ వర్గాల అంచనాల ప్రకారం పసిడికి 1870-1884 డాలర్ల వద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చు. ఇదేవిధంగా 1840-1828 డాలర్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement