Jewellers expect
-
సోమాజిగూడ జ్యువెలరీలో మెరిసిన నటి తేజస్వి మదివాడ (ఫొటోలు)
-
నగల అమ్మకాలు జిగేల్!
న్యూఢిల్లీ: ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా బంగారం ఆభరణాల విక్రయాలు జోరుగా సాగుతాయని జ్యుయలరీ పరిశ్రమ అంచనాలతో ఉంది. ముఖ్యంగా దసరా సందర్భంగా ఆభరణాల విక్రయాలు 30 శాతం అధికంగా నమోదు కావడం, పరిశ్రమలో సానుకూల అంచనాలకు మద్దతునిస్తోంది. ఇదే ధోరణి దీపావళి పండుగ వరకు కొనసాగొచ్చని భావిస్తోంది. తదుపరి వివాహ శుభ ముహూర్తాలు కూడా ఉండడంతో అమ్మకాలపై బలమైన అంచనాలతో కంపెనీలు ఉన్నాయి. బంగారం ధరలు దిగిరావడానికి తోడు, ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అనుమతించడం అనుకూలిస్తున్నట్టు పరిశ్రమ అంటోంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50వేల దిగువకు రావడం గమనార్హం. దసరా సమయంలో రూ.49,000 స్థాయిలో ఉన్న ధర ప్రస్తుతం ఇంకా తగ్గి రూ.46వేలకు దిగొచ్చింది. దీంతో దీపావళికి విక్రయాలు అంచనాలను మించుతాయని ఆభరణాల వర్తకులు భావిస్తున్నారు. దసరా నుంచి సానుకూలత దసరా నుంచి కొనుగోళ్లు సానుకూలంగా ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే కస్టమర్లు రెట్టింపు విలువ మేరకు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. కస్టమర్లు ముందుగా బుక్ చేసుకుని, స్టోర్లకు వచ్చి తీసుకెళుతున్నట్టు తెలిపారు. టెంపుల్ జ్యుయలరీ, ఆధునికతను జోడించుకున్న సంప్రదాయ డిజైన్లకు మద్దతు ఉన్నట్టు వివరించారు. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్లో విక్రయాలు సమారు 30 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. ద్రవ్యోల్బణ ప్రభావం పెద్దగా లేదు ద్రవ్యోల్బణ ప్రభావం కస్టమర్ల కొనుగోళ్లను పెద్దగా ప్రభావితం చేయలేదని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. దసరా విక్రయాల్లో ఇదే కనిపించిందని, ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అనుమతించడం కలిసొచ్చినట్టు చెప్పారు. దసరా నవరాత్రుల్లో విక్రయాలు బలంగా నమోదు కావడం, తదుపరి దీపావళి విక్రయాలకు మద్దతుగా నిలుస్తుందని పరిశ్రమ అంచనాతో ఉంది. ‘‘దీపావళి సందర్భంగా విక్రయాలు మరింత అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. గతేడాది దీపావళి విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతం అధికంగా ఉండొచ్చు. ఈ పండుగల సీజన్ పట్ల మేము ఎంతో ఆశావహంగా ఉన్నాం’’అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. ‘‘దసరా సీజన్ బలంగా ఉంది. దీంతో దీపావళి, ధనత్రయోదశి విక్రయాలపై ఆశలతో ఉన్నాం. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ సీజన్ గొప్పగా ఉంటుంది’’అని సి. కృష్ణయ్య చెట్టి గ్రూప్ ఆఫ్ జ్యుయలర్స్ ఎండీ సి. వినోద్ హయగ్రీవ్ పేర్కొన్నారు. ‘‘దసరా సమయంలో మా స్టోర్లలో 30 శాతం అధిక విక్రయాలు నమోదయ్యాయి. మార్కెట్లో ఎంతో పెంటప్ డిమాండ్ (గతంలో నిలిచిన డిమాండ్ ఇప్పుడు పుంజుకోవడం) ఉంది. వినియోగదారులు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల కోణంలో కస్టమర్లు కాయిన్లను సైతం కొనుగోలు చేస్తున్నారు’’అని జోయాలుక్కాస్ జ్యుయలరీ సీఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు. -
అక్షయ తృతీయ.. ‘నగ’ ధగలు!
న్యూఢిల్లీ: రెండు సంవత్సరాల కోవిడ్ సంబంధిత అంతరాయాల తర్వాత మే 3వ తేదీ అక్షయ తృతీయపై కొందరు నగల వ్యాపారులు పూర్తి ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నందున అమ్మకాలు 2019 స్థాయిలను అధిగమిస్తాయని ఆశిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో పెరిగిన బంగారం ధరలు అడ్డంకిగా మారవచ్చని కూడా కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దాదాపు రూ.52,000 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర రూ.1,900 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కొనుగోళ్లకే మొగ్గు... ధరల పెరుగుదల వల్ల ముందస్తు బుకింగ్స్ తగ్గాయని పేర్కొన్న అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) చైర్మన్ అశిష్ పాతే తెలిపారు. అయితే పరిస్థితి ఎలా ఉన్నా, పసిడి అమ్మకాలు 2019తో పోల్చితే 5 శాతానికిపైగా పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్షయ తృతీయనాడు పసిడి కొనుగోళ్లకే ప్రజలు మొగ్గుచూపుతారన్న అభిప్రాయాన్ని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ అహ్మద్ ఎంపీ వ్యక్తం చేశారు. ఎటువంటి పరిమితులు లేకుండా 2019 తరువాత జరుగుతున్న తొలి అక్షయ తృతీయ పర్వదినాన అమ్మకాలు పెరుగుతాయన అభిప్రాయాన్ని డబ్ల్యూహెచ్పీ జ్యూయెలర్స్ డైరెక్టర్ అదిత్య పాథే పేర్కొన్నారు. ధరలు దిగివస్తే పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉండేదని కూడా ఆయన అన్నారు. డిమాండ్లో 11 శాతం వృద్ధి 2022–23పై ఇక్రా అంచనా భారత్ పసిడి డిమాండ్ ఏప్రిల్తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం పురోగమిస్తుందన్న అంచనాలను ఇక్రా రేటింగ్స్ వెలువరించింది. ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ జయంత రాయ్ వెల్లడించిన నివేదికలోని ముఖ్యాంశాలు... ఆభరణాల రిటైల్ పరిశ్రమలో వ్యవస్థీకృత రిటైలర్ల ఆదాయాలు 14 శాతం వృద్ధితో పెరిగే అవకాశం ఉంది, స్టోర్ విస్తరణ, సంబంధిత ప్రణాళికలు అలాగే డిమాండ్ అసంఘటిత విభాగం నుండి క్రమంగా వ్యవస్థీకృత రంగం వైపు వాటి వైపు మళ్లడం వంటి అంశాలు దీనికి కారణం. ప్రస్తుత అక్షయ తృతీయ సీజన్లో డిమాండ్ పటిష్టంగా ఉంటుందని అంచనా. 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వృద్ధి ఏకంగా 45 శాతం ఉంటుందని భావిస్తున్నాం. భారతీయ వినియోగదారులకు బంగారం పట్ల ఉన్న బలమైన సాంస్కృతిక అనుబంధం, వివాహాలు, పండుగల వంటి అంశాలు ఆర్థిక సంవత్సరం మొత్తంమీద డిమాండ్ 11 శాతం పెరగడానికి దోహదపడుతుంది. కరోనా సవాళ్లకు ముందు ఆర్థిక సంవత్సరం 2019–20తో పోల్చితే ఆభరణాలకు డిమాండ్ 2022–23లో ఏకంగా 40 శాతం అధికంగా ఉంటుందని అంచనా. ధరలు పెరిగినప్పటికీ 2021–22లో ఈ డిమాండ్ 26 శాతంగా అంచనా వేయడం జరిగింది. స్టోర్ల విస్తరణ వంటి అంశాలతో వ్యవస్థీకృత రంగం ఆదాయాలు 14% మెరుగుపడతాయని భావిస్తున్నాం. స్టోర్ విస్తరణలు, ఇతర నిధుల అవసరాల కోసం రిటైలర్ల రుణ స్థాయిలు ఇటీవలి త్రైమాసికాల్లో పెరిగినప్పటికీ, ఆదాయాలలో స్థిరమైన వృద్ధి వల్ల పరిశ్రమ రుణాలకు సంబంధించి ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొనబోదు. అడ్డంకులు ఉన్నా.. కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ఆక్షయ తృతీయ పసిడి కొనుగోళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నాం. కోవిడ్ పరిమితుల సడలింపు, ఎకానమీ పటిష్ట రికవరీ, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా పసిడిని పరిగణించడం వంటి అంశాలు కొనుగోళ్లకు మద్దతునిస్తే, అధిక ధరలు కొంత అడ్డంకిగా మారే వీలుంది. అయినా పండుగ రోజు పసిడి కొనుగోలు మంచిదన్న సెంటిమెంట్ పరిశ్రమకు ఉత్సాహాన్ని ఇస్తుందన్నది మా అంచనా. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) సీఈఓ -
అక్షయ తృతీయ : భారీ సేల్స్పై జ్యూవెలర్ల అంచనా
సాక్షి, న్యూఢిల్లీ : అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి అమ్మకాలు రెట్టింపవుతాయని జ్యూవెలర్లు అంచనా వేస్తున్నారు. ధరలు నిలకడగా ఉండటం, కొనుగోలుదారులు బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతుండటంతో ఈ ఏడాది అక్షయ తృతీయ అమ్మకాలు రికార్డుస్ధాయిలో నమోదవుతాయని ట్రేడర్లు, రిటైల్ వర్తకులు భావిస్తున్నారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారానికి డిమాండ్ 20 శాతం పెరుగుదల ఉంటుందని భారత బులియన్, జ్యూవెలర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది.మరోవైపు దేశంలో పలు ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడం, తొలివారంలో వేతన జీవులు వేతనాలు అందుకునే సమయం కావడంతో అక్షయ తృతీయ సేల్స్ ప్రోత్సాహకరంగా ఉంటాయని భారత బులియన్, జ్యూవెలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సౌరవ్ గాడ్గిల్ అంచనా వేశారు. ఈనెల 7న అక్షయ తృతీయ సందర్భంగా పలు జ్యూవెలరీ సంస్ధలు, దుకాణాలు బంగారు ఆభరణాలపై ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. -
పసిడికి ‘అక్షయ’ కాంతులు...
పుత్తడి అమ్మకాలపై భారీ అంచనాలు 30 శాతం వృద్ధి ఆశిస్తున్న జువెల్లర్స్ మార్చిలో పెరిగిన పసిడి దిగుమతులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో అక్షయ తృతీయకు బంగారం మెరుపులు ఉంటాయా? అవుననే చెబుతున్నారు ఆభరణాల వర్తకులు. అక్షయ సెంటిమెంటుకుతోడు పుత్తడి ధర తక్కువగా ఉండడం ఇందుకు కారణమని అంటున్నారు. ఈసారి భారీ అంచనాల నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో మార్చిలో 125 టన్నుల పుత్తడి భారత్కు దిగుమతి అయింది. ఫిబ్రవరితో పోలిస్తే ఈ పరిమాణం రెండింతలకుపైమాటే. దీన్నిబట్టి చూస్తే అక్షయ మెరుపులు భారీ స్థాయిలో ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ప్రత్యేకమైన రోజుకోసం కస్టమర్లను రెడీ చేసేందుకు ఆభరణాలపై అడ్వాన్స్ బుకింగ్లను జువెల్లరీ కంపెనీలు ఇప్పటికే ప్రారంభించాయి. అలాగే పోటీపడి మరీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. జోరుమీదున్న ఈ-కామర్స్నూ వేదికగా చేసుకుని విభిన్న డిజైన్లను కస్టమర్ల ముందుంచుతున్నాయి. ఏప్రిల్ 21న అక్షయ తృతీయ. ధర పెరిగే అవకాశం..: ఈ ఏడాది జనవరి నుంచి పుత్తడి ధర పతనమవుతూ వస్తోంది. నెల రోజుల క్రితం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 26 వేలకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ. 27 వేల వద్ద కదలాడుతోంది. అక్షయ తృతీయ నాటికి 1-2 శాతం ధర పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) దక్షిణ ప్రాంత చైర్మన్ జి.వి. శ్రీధర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ప్రస్తుత ధర అనుకూలంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా అమ్మకాలపై స్వల్ప ప్రభావం చూపినప్పటికీ, మొత్తంగా 2015-16లో ఆభరణాల విపణి ఉత్తమంగా ఉంటుందని చెప్పారు. ఆన్లైన్లో చిన్న చిన్న ఆభరణాలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో డిజైనర్, తేలికైన ఆభరణాలకే మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. బంగారు నాణేలు విక్రయించకూడదని వ్యాపారులు గతేడాది స్వచ్ఛందంగా నిర్ణయించి అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఆభరణాలతోపాటు నాణేలనూ సిద్ధం చేస్తున్నారు. ఈ అక్షయకు పుత్తడి అమ్మకాల్లో 20-30% వృద్ధి ఆశిస్తున్నామని హైటెక్ సిటీ జువెల్లరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ కుమార్ తయాల్ తెలిపారు. ఊహించని స్థాయిలో దిగుమతులు ఈ ఏడాది మార్చి నెలలో ఊహించని స్థాయిలో బంగారం భారత్కు దిగుమతి అయింది. ఫిబ్రవరిలో 55 టన్నులు దిగుమతి అయితే మార్చిలో ఏకంగా 125 టన్నులకు ఎగసినట్టు సమాచారం. 2014 మార్చిలో 60 టన్నుల పసిడి దిగుమతైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో దిగుమతి చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.12,280 కోట్లుంది. మార్చిలో ఇది రూ.30,880 కోట్లకు ఎగసింది. 2013-14తో పోలిస్తే 2014-15లో 36 శాతం వృద్ధితో 900 టన్నుల బంగారం దిగుమతైంది. గతేడాది అక్షయ తృతీయ సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 30 వేలకు చేరువలో ఉంది.