gold sales
-
భారీగా బంగారం కొనుగోళ్లు: రేటు పెరిగినా.. తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ/కోల్‌కతా: ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ పసిడికి డిమాండ్ పటిష్టంగానే ఉంటోంది. ధన్‌తేరాస్ సందర్భంగాను అదే ధోరణి నెలకొంది. మంగళవారం ధన్‌తేరాస్ సందర్భంగా అమ్మకాలు ఉదయం పూట అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి పుంజుకున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఎక్కువగా చిన్న ఐటమ్స్, నాణేలకు డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి.బుధవారం మధ్యాహ్నం వరకు ధన్‌తేరాస్ ఉండటంతో మరింతగా వ్యాపారం జరగవచ్చని పీఎన్ గాడ్గిల్ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ధరలు అధిక స్థాయిలో ఉన్నా డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. అయితే, అధిక ధరల వల్ల విలువపరంగా అమ్మకాలు పెరిగినా, పరిమాణంపరంగా మాత్రం తగ్గొచ్చని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.‘రేటు అధికంగా ఉన్నా కొనుగోళ్లు మెరుగ్గానే ఉన్నాయి. పరిమాణంపరంగా గతేడాదితో పోలిస్తే 10 శాతం తగ్గినా, విలువపరంగా చూస్తే 20 శాతం అధికంగా ఉండొచ్చు‘ అని ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయ్యమ్ మెహ్రా తెలిపారు. రీసైకిల్డ్ ఆభరణాల అమ్మకాలు కూడా బాగున్నట్లు పేర్కొన్నారు. 2, 3, 4, 5, 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్, తేలికపాటి ఆభరణాలు విక్రయాలు గణనీయంగా ఉన్నట్లు వివరించారు.ఆఫర్లు, డిస్కౌంట్లను కొనుగోలుదార్లు వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. మొత్తం అమ్మకాల్లో 30–40% వాటా వివాహ ఆభరణాలది ఉండగా, మిగతాది పండుగపరమైన నామమాత్రపు కొనుగోళ్లది ఉన్నట్లు సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువంకర్ సేన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే పసిడి అమ్మకాల పరిమాణం 15% తగ్గొచ్చని, విలువపరంగా మాత్రం 12% అధికంగా ఉండొచ్చన్నారు. ధన్‌తేరాస్, దీపావళి సందర్భంగా దేశీ మార్కెట్లో అమ్మకాలు రూ. 30,000 కోట్ల పైగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రేటు 33 శాతం జంప్.. గతేడాది నవంబర్ 11న ధన్‌తేరాస్ నాడు న్యూఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 61,200గా ఉండగా ఈసారి ఏకంగా 33 శాతం ఎగిసి రూ. 81,400కి చేరింది. వెండి ధర కేజీకి గతేడాది ధన్‌తేరాస్ నాడు రూ.74,000గా ఉండగా ఈసారి 35% పెరిగి రూ. 99,700గా ఉంది.సుంకాల తగ్గింపుతో బూస్ట్: ఎంఎంటీసీఇటీవల పసిడిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో ధన్‌తేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ఊతం లభించిందని ఎంఎంటీసీ–పీఏఎంపీ ఎండీ వికాస్ సింగ్ తెలిపారు. కస్టమర్లు అధిక స్వచ్ఛత గల పసిడి ఉత్పత్తులపై ఆసక్తి కనపరుస్తున్నట్లు చెప్పారు. రాబోయే పెళ్లిళ్ళ సీజన్లోనూ ఇదే సానుకూల ధోరణి కొనసాగవచ్చని సింగ్ చెప్పారు. సీజన్‌తో సంబంధం లేకుండా సంప్రదాయాలపరమైన వివిధ వేడుకల కారణంగా కూడా పసిడికి డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
బంగారం డిమాండ్ తగ్గుతుందా.. పెరుగుతుందా?
ముంబై: పసిడి ధరల తీవ్రత నేపథ్యంలో.. వినియోగదారుల కొనుగోళ్లు ఎలా ఉంటాయన్న అంశంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆ అభిప్రాయాలు క్లుప్తంగా...డిమాండ్ పడిపోవచ్చు కస్టమ్స్ సుంకాలు తగ్గినప్పటికీ అటు అంతర్జాతీయ ఇటు దేశీయ పరిణామాలతో పసిడి ధరలు రికార్టులను సృష్టిస్తున్నాయి. దీపావళికి ముందు చోటుచేసుకుంటున్న ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ధన్‌తేరస్‌లో డిమాండ్, కొనుగోళ్ల పరిమాణాలు తగ్గుతాయని భావిస్తున్నాం. గత ధన్‌తేరాస్‌తో పోల్చితే కొనుగోళ్ల పరిమాణం కనీసం 10 నుంచి 12 శాతం తగ్గుతుందని అంచనా. అయితే పెరిగిన ధరల వల్ల విలువలో కొనుగోళ్లు 12 నుంచి 15 శాతం పెరగవచ్చు. – సువంకర్ సేన్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈఎఓగత ఏడాదికి సమానంగా బిజినెస్ధరలు పెరుగుతున్నప్పటికీ మేము మంచి వ్యాపారాన్ని ఆశిస్తున్నాము. ధన్తేరస్ తర్వాత 40 లక్షలకు పైగా వివాహాలు జరుగుతున్నందున అమ్మకాలు గత సంవత్సరం మాదిరిగానే ఉండవచ్చని మేము ఆశిస్తున్నాము. ధన్తేరస్ నాడు అమ్మకాల పరిమాణం 20 నుంచి 22 టన్నులు ఉండవచ్చు. ఇది గత ఏడాదికి దాదాపు సమానం. – సయం మెహ్రా, ఆల్ ఇండియా జీజేసీ చైర్మన్ఆశాజనంగానే ఉన్నాం... రెండో త్రైమాసికంలో బులియన్ మార్కెట్ పటిష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పండుగల సమయంలో అమ్మకాలపై మేము ఆశాజనకంగా ఉన్నాము. పండుగలకు ప్రీ–బుక్ ఆర్డర్లు కూడా బాగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా సానుకూల సెంటిమెంట్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది. అకస్మాత్తుగా ధర పెరిగితే వినియోగదారులు కొంత విరామం తీసుకునే మాట వాస్తవమే. అయితే ఈ రోజుల్లో వినియోగదారులు తమ బడ్జెట్ మేరకు కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము ఈ దశలో ‘కొనుగోళ్ల పరిమాణం’ గురించి ఇప్పుడు మాట్లాడము. – టీఎస్ కళ్యాణరామన్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎండీపెళ్లిళ్ల సీజన్‌తో డిమాండ్ పదిలం బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకినప్పటికీ కొనుగోళ్ల విషయంలో పరిశ్రమ నుండి వచ్చిన సమాచారం సానుకూలంగానే ఉంది. కొనసాగుతున్న పండుగల కారణంగా బంగారం కొనుగోళ్ల డిమాండ్ పటిష్టంగా ఉండే వీలుంది. పెట్టుబడి సెంటిమెంట్, వివాహ సంబంధిత కొనుగోళ్లు పరిశ్రమకు అండగా ఉండే అవకాశాలే ఎక్కువ. వ్యవసాయ పరిస్థితుల మెరుగుదల, ఆదాయాలు పెరగడం, ఎకానమీ, వినియోగం పటిష్టత వంటి అంశాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పసిడికి డిమాండ్ ఉటుంది. – సచిన్ జైన్, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
మరింత మెరిసిన బంగారం! దసరా అమ్మకాలు అదుర్స్..
Dussehra Gold Sales: పండుగ వేళ బంగారం మరింత మెరిసింది. ఓ వైపు గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌లో పండుగ సీజన్లో పసిడి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, పీఎన్జీ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ జ్యువెలర్స్ ఈ దసరా-నవరాత్రి సమయంలో అమ్మకాలు గతేడాది కంటే 30 శాతం వరకు పెరిగినట్లుగా పేర్కొన్నాయి. ధరలు పెరుగుతున్నా.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం చెలరేగినప్పటి నుంచి బంగారం ధరలు 5.5 శాతం పెరిగినప్పటికీ అమ్మకాలు మాత్రం తగ్గలేదు. ఇక అధిక్ మాసం కాలం (జులై-ఆగస్టు) నుంచి వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హమాస్ దాడులకు ముందు రూ.57,415 ఉన్న 10 గ్రాముల బంగారం ధర గత రెండు వారాల్లో రూ.60,612కి చేరింది. శ్రాద్ధ మాసం నుంచి బంగారం అమ్మకాలలో పురోగతి కనిపిస్తోందని, నవరాత్రుల సమయంలో మరింత జోరందుకుందని పీఎన్జీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు ఆయన అంచనా వేశారు. టైటాన్ ఆభరణాల విభాగం జులై నుంచి సెప్టెంబరు వరకు అమ్మకాలలో 19 శాతం పెరుగుదలను చూసింది. ఈ దసరా సందర్భంగా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అమ్మకాలు పెరిగాయని మలబార్ గోల్డ్ నివేదించింది. బలమైన వినియోగదారుల డిమాండ్, స్థిరమైన రిటైల్ విస్తరణ ఈ వృద్ధికి కారణమని మలబార్ గోల్డ్ చైర్మన్ అహమ్మద్ చెప్పారు. ధరల సున్నితత్వం ఉండే తూర్పు ప్రాంతాల్లో సెంకో గత దసరాతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధిని సాధించింది. వజ్రాభరణాల అమ్మకాలు 20 శాతం పెరిగాయని సెన్కో మేనేజింగ్ డైరెక్టర్ సువంకర్ సేన్ తెలిపారు. ఇదీ చదవండి: Gold Prices: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొబైల్‌కే బంగారం ధరలు! -
Akshaya Tritiya 2023: ‘అక్షయ’కు పుత్తడి మెరిసేనా?
ముంబై: ఈ అక్షయకు పుత్తడి వెలుగులు విరజిమ్మేనా? ప్రస్తుత ధరలు అమ్మకాలను ప్రభావితం చేస్తాయా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పరిమాణం పరంగా విక్రయాలు 20 శాతం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల పుత్తడి ధర 24 క్యారెట్లు రూ.60,930, అలాగే 22 క్యారెట్లు అయితే రూ.55,850 పలికింది. ‘ఇటీవల 10 గ్రాములకు రూ.60 వేలు దాటడంతో వినియోగదార్లు పుత్తడి కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత ధర స్వల్పంగా తగ్గినప్పటికీ.. ధరలు మాత్రం బుల్లిష్‌గానే ఉన్నాయి. విలువైన లోహాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే అక్షయ తృతీయ సమయంలో ఇది అమ్మకాలపై ప్రభావం చూపుతుంది’ అని ఆల్ ఇండియా జెమ్, జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ సైయమ్ మెహ్రా తెలిపారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వస్తోంది. దక్షిణాది వాటాయే అధికం.. అక్షయ విక్రయాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 40 శాతం ఉంది. పశ్చిమ భారత్ 25 శాతం, తూర్పు 20, ఉత్తరాది రాష్ట్రాలు 15 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. ధరలు అధికంగా ఉండడం డిమాండ్‌పై ప్రభావం చూపనుందని జీజేసీ మాజీ చైర్మన్, ఎన్ఏసీ జ్యువెల్లర్స్ ఎండీ అనంత పద్మనాభన్ తెలిపారు. ధరలు పెరిగిన ప్రభావం ఇప్పటికే కనపడుతోంది. 2022తో పోలిస్తే విలువ పరంగా అక్షయ అమ్మకాల్లో ఈ ఏడాది 10 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని చెప్పారు. పరిమాణం పరంగా 20 శాతం క్షీణతకు చాన్స్ ఉందన్నారు. అకస్మాత్తుగా పుత్తడి ధర తగ్గితే అమ్మకాలకు బూస్ట్‌నిస్తుందని వివరించారు. స్థిరంగా పసిడి ధర.. ప్రస్తుతం కొనసాగుతున్న బంగారం ధరలు బుల్లిష్‌గా ఉన్నప్పటికీ.. కొంతకాలం స్థిరంగా ఉండే అవకాశం ఉందని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. ‘ప్రస్తుతం యూఎస్ ఆర్థిక పరిస్థితుల మాదిరిగా పసిడి ధరలను అస్థిరంగా మార్చడానికి కారణాలేవీ లేవు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల వంటి ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ఇటీవల పుత్తడి ధరలను ప్రభావితం చేయలేదు. భారత్‌లోని వినియోగదార్లకు బంగారం ధరల పెరుగుదలకు అలవాటుపడటానికి ఎల్లప్పుడూ సమయం పడుతుంది. కాబట్టి ఈ సవత్సరం అక్షయ తృతీయ సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది’ అని వివరించారు. విడదీయలేని బంధం.. లక్షలాది మంది భారతీయులకు అక్షయ తృతీయ వేడుకల్లో బంగారం కొనుగోళ్లు విడదీయరాని భాగం అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత్ సీఈవో సోమసుందరం పీఆర్ వివరించారు. ‘పుత్తడిని సంపద చిహ్నంగా భావిస్తారు. అక్షయకు కాలానుగుణ కొనుగోలు ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రధాన బంగారం కొనుగోలు పండుగ అయినప్పటికీ.. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పసిడి జీవితకాల అధిక ధరలను ఎదుర్కొంటోంది. గత కొన్ని వారాలుగా వినియోగదారుల నుండి మోస్తరు స్పందన ఉంది’ అని తెలిపారు. మహమ్మారి కారణంగా రెండేళ్ల మందకొడి పనితీరు తర్వాత బంగారు పరిశ్రమకు తిరిగి మెరుపు వచ్చిందని కామా జ్యువెల్లరీ ఎండీ కోలిన్ షా అన్నారు. ‘కొంతకాలంగా పసిడి ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరంలో పెరుగుతున్న ధరలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో వినియోగదారులు తమ కొనుగోళ్లతో మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. అయితే పెట్టుబడిదారుల వర్గం రాబోయే కాలంలో పుత్తడి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు’ అని చెప్పారు. -
ఇంతకు మించి బంగారం ఇంట్లో ఉంటే చిక్కులు తప్పవు
-
పసిడికి ధన్‌తెరాస్ ధగధగలు..
న్యూఢిల్లీ/ముంబై: ఈ ఏడాది ధన్‌తెరాస్ రెండు రోజులు (శని, ఆదివారాలు) రావడంతో పసిడి, ఆభరణాలు, నాణేల విక్రయాలు జోరుగా జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 35 శాతం వరకూ పెరిగి ఉంటాయని ఆభరణాల పరిశ్రమ అంచనా వేస్తోంది. ఆదివారం నాడు భారత్–పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండటంతో కొద్ది గంటల పాటు మార్కెట్లో కాస్తంత స్తబ్దత నెలకొన్నా, మ్యాచ్ తర్వాత అమ్మకాలు వేగం పుంజుకున్నట్లు ఆభరణాల విక్రేతలు తెలిపారు. పసిడి రేటు కాస్త పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లు జరిపినట్లు పేర్కొన్నారు. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 50,139 (పన్నులు కాకుండా) పలికింది. ధన్‌తెరాస్ రోజున విలువైన లోహాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ధన్‌తెరాస్ నాడు 20–30 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. కోవిడ్ అనంతరం డిమాండ్ పుంజుకోవడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు 10–15 శాతం మేర అమ్మకాలు పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశీష్ పేఠే తెలిపారు. మరోవైపు, ధన్‌తెరాస్ సందర్భంగా 15–25 శాతం వరకూ బంగారం అమ్మకాలు పెరిగి ఉండవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రాంతీయ సీఈవో (భారత్) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ధన్‌తెరాస్ కోసం భారీ స్థాయిలో ప్రి–బుకింగ్స్ జరిగినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. ఈ ఏడాది దాదాపు కొనుగోళ్లలో దాదాపు 80 శాతం వాటా జ్యుయలరీ ఉంటుందని, మిగతాది బులియన్ ఉంటుందని పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ఎకానమీ కోలుకుందని ప్రజల్లో నమ్మకం కలగడాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. రెండు రోజుల ధన్‌తెరాస్ సందర్భంగా తమ అమ్మకాలు పరిమాణంపరంగా 30–35 శాతం, విలువపరంగా 40–45 శాతం పెరిగాయని అంచనా వేస్తున్నట్లు పీఎం షా జ్యుయలర్స్ ఎండీ దినేష్ జైన్ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరపడం ఈసారి ఆసక్తికరమైన ట్రెండ్ అని పేర్కొన్నారు. -
అక్షయ తృతీయ: బంగారం అమ్మకాలు అదుర్స్, అమ్మో..ఒక్కరోజే ఇన్నివేల కోట్లా!
అక్షయ తృతీయ రోజు మనదేశంలో బంగారం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. 2019 తరువాత ఈ స్థాయిలో అమ్మకాలు జరగడంతో అక్షయ తృతీయ రోజే బంగారం అమ్మకాల మార్కెట్ విలువ రూ.15వేల కోట్లుగా ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) అంచనా వేసింది. కరోనా మహమ్మారికి కారణంగా రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న బులియన్ మార్కెట్ (బంగారం) ఈ ఏడాది పుంజుకుంది. కరోనా లాక్డౌన్లు, ఆంక్షలు లేకపోవడం..రంజాన్ సెలవుదినం కావడం కారణంగా నిన్న ఒక్కరోజే (అక్షయ తృతీయ) బంగారం అమ్మకాలు 15వేల కోట్లకు పైగా జరిగాయని సీఏఐటీ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఖండేల్వాల్, ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరాలు తెలిపారు. ముఖ్యంగా లైట్ జ్యుయలరీ (డ్రిల్ చేయని రాక్ క్రిస్టల్ ఆర్బ్స్) ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు ఉత్సాహం చూపించారని అన్నారు. భారీగా పెరిగిన బంగారం ధరలు అక్షయ తృతీయ అమ్మకాలపై అరోరా మాట్లాడుతూ..మూడేళ్ల క్రితం కంటే ఈ ఏడాది బంగారం ధర భారీగా పెరిందని, అయినా కొనుగోలు దారులు బంగారం కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని, అందుకు ఈ ఏడాది జరిగిన బంగారం అమ్మకాలే నిదర్శనమన్నారు. 2019 అక్షయ తృతీయ నాటికి 10గ్రాముల బంగారం ధర రూ.32,700 ఉండగా.. కిలో వెండి ధర రూ.38,350గా ఉంది. మరి ఈ ఏడాది అదే 10 గ్రాముల బంగారం ధర రూ.53వేలు ఉండగా.. కిలో వెండి ధర రూ.66,600గా ఉంది. ఎంత బంగారం దిగుమతి చేశారంటే సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భారతియా తెలిపిన వివరాల ప్రకారం.. 2021 క్యూ1లో 39.3 టన్నుల గోల్డ్ బార్స్ (కడ్డీలు), కాయిన్స్ బంగారం దిగుమతి చేసుకుంటే.. ఈ ఏడాది తొలి క్యూ1లో 41.3 టన్నలు బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు నివేదించారు. బంగారం జ్యుయలరీ (రింగ్స్,చైన్లు,బ్రాస్లెట్లు మొదలైనవి) 2021 తొలి క్యూ1లో 126.5 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే..2022లో 94.2టన్నుల బంగాన్ని దిగుమతి చేసుకున్నట్లు భారతీయ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్ల ఆలోచనా ధోరణి మారిందని, ఎక్కువగా బంగారం కడ్డీలు, కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సేల్స్ పెరిగాయి ఖండేల్వాల్, పంకజ్‌లు.. 2019లో అక్షయ తృతీయ రోజు రూ.10వేల కోట్లు బంగారం అమ్మకాలు జరిగాయని, ఇక 2020లో కేవలం బంగారం అమ్మకాలు 5శాతంతో రూ.500కోట్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో మాత్రం రూ.15వేల కోట్ల మేర బంగారం కోనుగోలు జరిగినట్లు అంచనా వేశారు. రెండేళ్ల తరువాత దేశంలో జరిగిన ఈ అమ్మకాలు గడిచిన రెండేళ్లలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. చదవండి👉అక్షయ తృతీయ: బంగారం కొన్నారా? అయితే ఇది మీ కోసమే! -
అక్షయ తృతీయ అమ్మకాలు అంతంతే!
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు అక్షయ తృతీయపై ఆశలు వదులుకున్న బంగారం వ్యాపారులు ఈ ఏడాది బంగారం అమ్మకాలకు పూర్వవైభవం వస్తుందని భావించారు. కానీ.. వారి ఆశలపై కొనుగోలుదారులు నీళ్లు చల్లారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అది ఉండేకొద్దీ అక్షయం అవుతుందన్న నమ్మకం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని బంగారం దుకాణాల్లో సందడి అంతంతమాత్రంగానే కనిపించింది. అక్షయ తృతీయ కొనుగోళ్లు కేవలం కార్పొరేట్ షాపులకు మాత్రమే పరిమితమైందని, మిగిలిన షాపుల్లో సాధారణ స్థాయిలోనే లావాదేవీలు జరిగాయని బులియన్ వ్యాపారులు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ సమయంలో అక్షయ తృతీయ వచ్చినప్పటికీ కొనుగోళ్లు అంతగా లేవని, ఈ పండుగ సందర్భంగా బంగారం నిల్వలు పెంచుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదని ఏపీ గోల్డ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్స్ ఉపాధ్యక్షుడు బూశెట్టి రామ్మోహనరావు ‘సాక్షి’కి తెలిపారు. నగరాలకే పరిమితం రాష్ట్రంలో 50 వేలకు పైగా బంగారం షాపులు ఉన్నప్పటికీ అక్షయ తృతీయ సందడి కేవలం విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి పట్టణాల్లో కార్పొరేట్ షాపులకు మాత్రమే పరిమితమైందని బులియన్ మర్చంట్స్ చెబుతున్నారు. గతంతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 30 శాతం క్షీణత కనిపిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, కోవిడ్ భయాలు ఇంకా వెంటాడుతుండటంతో భారీ కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేస్తుండటం అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర ఒకానొక దశలో రూ.5,800 చేరి.. ప్రస్తుతం రూ.5,300 వచ్చినప్పటికీ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి చూపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. సామాన్యుడు దూరంగా.. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అక్షయ తృతీయ అమ్మకాలు కొద్దిగా పెరిగినప్పటికీ కోవిడ్ ముందు కాలం 2019తో పోలిస్తే అమ్మకాలు 30 నుంచి 40 శాతం తక్కువగానే నమోదైనట్లు విజయవాడలోని ఎంబీఎస్ జ్యూవెలరీ అధినేత ప్రశాంత్ జైన్ పేర్కొన్నారు. ఈ సారి కొనుగోళ్లకు మధ్య తరగతి ప్రజలు, సామాన్యులు దూరంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ భయాలు ఇంకా ప్రజలను వెంటాడుతుండటంతో మరో ఏడాదిన్నర వరకు బంగారం అమ్మకాలు ఇదే స్థాయిలోనే జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే రెండు నెలలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో వ్యాపారం జోరుగా సాగాల్సి ఉన్నా.. ఆ వాతావరణం కనిపించడం లేదని విజయవాడలోని ఆర్ఎస్ జ్యూవెల్స్ అధినేత లక్ష్మణ్ పేర్కొన్నారు. పెళ్లిళ్లు జరుగుతున్నా ఆ మేరకు బంగారం అమ్మకాలు జరగడం లేదన్నారు. అక్షయ తృతీయనాడు బంగారం కొనాలన్న సెంటిమెంట్ ఉన్న వాళ్లు ఒకటి రెండు గ్రాముల బంగారం నాణేలు కొనడానికి పరిమితమైనట్లు తెలిపారు. అక్షయ తృతీయ సందర్బంగా పత్రికా ప్రకటనలు, షాపుల అలంకరణకు భారీగా ఖర్చు చేసినా ఆ స్థాయిలో ఈ సారి అమ్మకాలు కనిపించలేదని ఒక కార్పొరేట్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. -
అక్షయ తృతీయ.. జోరుగా అమ్మకాలు..!
ముంబై: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల విక్రయాలు జోరుగా సాగాయి. డిమాండ్ బలంగా ఉందని, కస్టమర్ల రాక పెరిగినట్టు వరక్తులు వెల్లడించారు. గత రెండేళ్లలో చూసినట్టు కరోనా లాక్డౌన్లు, ఆంక్షలు లేకపోవడం.. రంజాన్ సెలవుదినం కావడం విక్రయాలకు కలిసొచ్చింది. దీంతో అధిక విక్రయాలకు అనుకూలించినట్టు వర్తకులు పేర్కొన్నారు. విక్రయాలను ముందే ఊహించిన వర్తకులు కొంచెం ముందుగానే దుకాణాలను తెరిచి, రాత్రి 10 గంటల వరకు ఉండడం కనిపించింది. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 10 శాతం అధికంగా ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ‘‘అక్షయ తృతీయ పర్వదినం ఈ ఏడాది చాలా సానుకూలంగా ఉంది. 2019లో నమోదైన గణాంకాలను మించి విక్రయాలను నమోదు చేయగలమని భావిస్తున్నాం. గత రెండేళ్లుగా నిలిచిన డిమాండ్ తోడు కావడం, ధరలు తగ్గడం కలసి వచ్చింది’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సియామ్ మెహ్రా తెలిపారు. బంగారం ధరలు పన్నులతో కలిపి 10 గ్రాముల ధర రూ.48,300 వద్ద ఉన్నట్టు చెప్పారు. 2019 అక్షయ తృతీయతో పోలిస్తే 10 శాతం అధికంగా విక్రయాలు ఉండొచ్చన్నారు. కస్టమర్ల రాక పెరిగినట్టు, 2019తో పోలిస్తే 30 శాతం అధికంగా అమ్మకాలు నమోదైనట్టు పీఎన్జీ జ్యుయలర్స్ ఎండీ, సీఈవో సౌరభ్ గడ్గిల్ సైతం తెలిపారు. మంచి స్పందన..: కస్టమర్ల నుంచి మంచి స్పందన కనిపించినట్టు టాటా గ్రూపు ఆభరణాల సంస్థ తనిష్క్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ నారాయణన్ తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే కస్టమర్ల రాక 30–40 శాతం అధికంగా ఉందని కోల్‌కతా జ్యుయలర్లు తెలిపారు. కొనుగోలుదారులకు కేలండర్లు, స్వీట్ బాక్స్‌లు పంచేందుకు వర్తకులు ఆర్డర్లు ఇచ్చి మరీ సిద్ధం చేసుకోవడం ఈ ఏడాది కనిపించింది. సానుకూల సెంటిమెంట్ అక్షయ తృతీయ రోజున బంగారం కొనే సంప్రదాయం ఉందని, దీనికితోడు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొనేలా చేసినట్టు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణ రామన్ చెప్పారు. ‘‘రెండు సంవత్సరాల పాటు లాక్డౌన్, ఆంక్షల తర్వాత నూరు శాతం షోరూమ్‌లను తెరిచి ఉంచడం ఈ ఏడాదే. మా షోరూమ్‌లకు కస్టమర్ల రాక గణనీయంగా పెరిగింది’’అని కల్యాణరామన్ తెలిపారు. పెంటప్ డిమాండ్‌తో ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లకు సానుకూల వాతావరణం కనిపించినట్టు కార్ట్‌లేన్ సీవోవో అవనీష్ ఆనంద్ పేర్కొన్నారు. -
డిజిటల్ గోల్డ్ సేవలకు చెక్
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్లు, సభ్యులు డిజిటల్ గోల్డ్ విక్రయించకుండా నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ నిషేధం విధించింది. సెప్టెంబర్ 10 నాటికి తమ ప్లాట్‌ఫామ్‌లపై డిజిటల్ గోల్డ్ విక్రయాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. కొందరు సభ్యులు తమ క్లయింట్లకు డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు, విక్రయాలకు వీలుగా వేదికలను అందుబాటులో ఉంచుతున్నట్టు గుర్తించిన సెబీ ఈ మేరకు స్టాక్ ఎక్సే్చంజ్‌లకు లేఖ రాసింది. ‘‘ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీల కాంట్రాక్టుల నిబంధనలు (ఎస్సీఆర్ఆర్) 1957కు వ్యతిరేకమంటూ, సభ్యులను ఈ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలంటూ ఆగస్ట్ 3న రాసిన లేఖలో సెబీ కోరింది’’అంటూ ఎన్ఎస్ఈ పేర్కొంది. సెక్యూరిటీలు, కమోడిటీ డెరివేటివ్‌లు మినహా ఇతర ఏ కార్యకలాపాలు నిర్వహించడానికి లేదని ఎస్సీఆర్ఆర్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తన సభ్యులు అందరూ డిజిటల్ గోల్డ్ తరహా కార్యకలాపాలు నిర్వహించకుండా నియంత్రణపరమైన నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘డిజిటల్ గోల్డ్ సేవల్లో ఉన్న సభ్యులు ఇందుకు సంబంధించి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలి. ఈ ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి నెలలోపు అమలు చేయాలి’’ అంటూ ఎన్ఎస్ఈ ఈ నెల10నే ఆదేశాలు జారీ చేసింది. నియంత్రణల పరిధిలో లేదు.. దీనిపై ట్రేడ్‌స్మార్ట్ చైర్మన్ విజయ్ సింఘానియా స్పందిస్తూ.. డిజిటల్ గోల్డ్ యూనిట్లను నియంత్రణపరమైన సంస్థలు జారీ చేయడం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో డిజిటల్ గోల్డ్ సర్టిఫికెట్లకు సరిపడా భౌతిక బంగారాన్ని నిల్వ చేస్తున్న విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. -
బంగారం అమ్మేసుకుంటున్నారు.. ఎందుకో తెలుసా?
వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ముందుగా చేతులకు అంటుకుని.. ఆ తర్వాత నోరు, ముక్కు, కళ్ల ద్వారా గొంతులోకి చేరుతుంది. అక్కడ పెరిగి ఊపిరితిత్తుల్లో తిష్ట వేసుకుని ప్రాణాంతకమవుతుంది. కరోనా కష్టాలు కూడా ఇలాగే ఉన్నాయి. ముందుగా ఆప్పులు, ఆ తర్వాత తాకట్టులు, చివరకు ఉన్న ఆస్తులు అమ్మేయడం. తాజా గణాంకాలు ఇదే చెబుతున్నాయి. కరోనా దెబ్బకు భారీ ఎత్తున బంగారం తాకట్టు పెట్టడమో లేదా అమ్ముకోవడమో చేస్తున్నారు భారతీయులు. పొదుపు సొమ్ముతోనే కరోనా మహమ్మారి కట్టడికి 2020లో తొలిసారి లాక్డౌన్ విధించారు. దాదాపు మూడు నెలల పాటు కఠిన ఆంక్షలు కొనసాగాయి. కరోనా భయంతో దాదాపు దేశమంతటా ఈ కఠిన నిబంధనలకు మద్దతుగానే నిలిచారు. ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదాయం లేక పోయినా దాచుకున్న సొమ్ముతో, పొదుపు చేసిన మనీతో ఇళ్లు గడిపేశారు. కుదువ బెట్టారు కానీ ఆరు నెలలు తిరగకుండానే కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడింది. ప్రతీ రోజు వేల సంఖ్యలో మరణాలు, లక్షల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. మళ్లీ కఠిన ఆంక్షలు తెరపైకి వచ్చాయి. జనజీవనం స్థంభించిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యులకు, వేతన జీవులపైనా తీవ్ర ప్రభావం చూపింది కరోనా. అయితే ఈసారి ఇళ్లు గడిచేందుకు ఎంతో కష్టపడి కొనుకున్న బంగారం, ముచ్చపటి చేసుకున్న ఆభరణాలే దిక్కయ్యాయి. తాకట్టుతో సరి మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ గత మూడు నెలలో సుమారు రూ. 404 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేసింది. అంతకుముందు తొమ్మిది నెలల్లో కేవలం రూ. 8 కోట్ల రూపాయల విలువైన బంగారాన్నే ఆ సంస్థ వేలం వేసింది. అంటే కరోనా కష్టాలతో మణపురం దగ్గర తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునే పరిస్థితి సామాన్యులకు లేకపోయింది. అందుకే ఆ సంస్థకే బంగారాన్ని వదిలేశారు. ఇలా నష్టపోయని వారిలో రైతులు, చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, కార్మికులే ఎక్కువగా ఉన్నారు. భయపెడుతున్న థర్డ్ వేవ్ ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన వారిని మరింత భయపెడుతోంది థర్డ్ వేవ్ ముప్పు. మరోసారి దేశంపై కరోనా విజృంభిస్తే బంగారం మీద రుణాలు తీసుకోవడం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని లండన్ కు చెందిన మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ కన్సల్టెంట్ చిరాగ్ సేఠ్ వెల్లడించారు. ఆర్థిక అవసరాల కోసం పాత బంగారం అమ్మకాలు భారీగా పెరగవచ్చన్నారు. ఈ మొత్తం 215 టన్నులు దాటొచ్చని అంచనా వేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఇదే అత్యధికమని ఆయన చెబుతున్నారు. 25 శాతం తగ్గాయి కరోనా ఎఫెక్ట్‌తో పాత బంగారం అమ్మకాలు సౌతిండియాలో ఈ సారి 25 శాతం ఎక్కువగా ఉన్నాయని కొచ్చికి చెందిన బంగారం శుద్ధి చేసే సంస్థ సీజీఆర్ మెటల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జేమ్స్ జోష్ అభిప్రాయపడ్డారు. తగ్గిన కొనుగోళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రెండేళ్లుగా భారతీయులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం గత ఏడాది అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అమ్మకాలు పెరగొచ్చు మరోవైపు ఈ ఏడాది అమ్మకాలు 40 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ధరలు తగ్గడం, వివాహాల సీజన్ ఉండడంతో 50 టన్నులకు పైగా బంగారం క్రయవిక్రయాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. -
కానరాని ‘అక్షయ’ మెరుపులు.. టన్ను బంగారం కూడా అమ్మలేదు..
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం షాపుల ముందు కస్టమర్ల క్యూలు.. వినియోగదార్లతో కిటకిటలాడే దుకాణాలు. అక్షయ తృతీయ అనగానే సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. ఇదంతా గతం. కోవిడ్–19 మహమ్మారి ఒక్కసారిగా మార్కెట్‌ను తారుమారు చేసింది. వరుసగా రెండవ ఏడాదీ పరిశ్రమను దెబ్బతీసింది. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో జువెల్లరీ షాపులు మూతపడ్డాయి. పాక్షిక లాక్డౌన్ కొనసాగుతున్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని దుకాణాలే తెరుచుకున్నాయి. వీటిలోకూడా వినియోగదార్లు లేక వెలవెలబోయాయి. వైరస్ భయంతో కస్టమర్లు బయటకు రాలేదు. పుత్తడి కొనాలన్న సెంటిమెంటూ లేకపోవడంతో శుక్రవారం అక్షయ తృతీయ మెరుపులు కానరాలేదు. మరోవైపు పరిమిత సమయం దుకాణాలు తెరిచే అవకాశం ఉన్నా చాలాచోట్ల వర్తకులు ఆసక్తి చూపలేదు. ఒక టన్ను కూడా అమ్మలేదు.. సాధారణంగా అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా సుమారు 30 టన్నుల పుత్తడి అమ్ముడవుతుంది. ఈసారి ఒక టన్ను కూడా విక్రయం కాలేదని పరిశ్రమ వర్గాలు సమాచారం. ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, పుణేతోపాటు పుత్తడి అధికంగా విక్రయమయ్యే కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో ఆఫ్‌లైన్ సేల్స్‌పై తీవ్ర ప్రభావం పడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ఆన్లైన్ విక్రయాలను వర్తకులు ప్రోత్సహించారని చెప్పారు. ‘90 శాతం రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంది. ఈ రాష్ట్రాల్లో అమ్మకాలు నిల్. జరిగిన కొద్ది విక్రయాలు కూడా ఫోన్, డిజిటల్ మాధ్యమం ద్వారా జరిగాయి. గతేడాది 2.5 టన్నులు విక్రయమైతే, ఈ ఏడాది 3–4 టన్నులు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తుందని భావించారు. షాపులు తెరిచినచోట 10–15 శాతం సేల్స్ జరిగే అవకాశం ఉందని వర్తకులు అంచనా వేస్తున్నారు’ అని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పేథీ తెలిపారు. ఈ ఏడాది అక్షయకు 1 నుంచి 1.5 టన్నుల మధ్య సేల్స్ ఉండే అవకాశం ఉందని ఇండియా బులియన్, జువెల్లర్స్ అసోసియేషన్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ వెల్లడించారు. సానుకూలంగా లేదు.. గతేడాదితో పోలిస్తే 2021 అక్షయ తృతీయ భిన్నమైనదని కళ్యాణ్ జువెల్లర్స్ ఈడీ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. సంస్థకు చెందిన 20 శాతం షోరూంలు మాత్రమే తెరుచుకున్నాయని, అది కూడా పరిమిత సమయమేనని చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కస్టమర్లు ఇష్టపడడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో సెంటిమెంట్ సానుకూలంగా లేదని పేర్కొన్నారు. ‘అక్షయ తృతీయ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు లాక్డౌన్లో ఉన్నాయి. రెండు మూడు రాష్ట్రాల్లో రిటైల్ షాపులు ఉదయం 6 నుంచి 10 వరకే తెరిచేందుకు అనుమతి ఉంది. ఇది కస్టమర్లకు అసాధారణ సమయం’ అని వివరించారు. కరోనాకు భయపడి వినియోగదార్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదని హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి గుల్లపూడి నాగకిరణ్ కుమార్ తెలిపారు. షాపింగ్‌కు తక్కువ సమయం ఉండడం, పుత్తడి కొనాలన్న ఆలోచన కూడా కస్టమర్లలో లేదని అన్నారు. కోవిడ్–19 ముందస్తుతో పోలిస్తే అమ్మకాలు స్వల్పమని సిరివర్ణిక జువెల్లర్స్ ఫౌండర్ వడ్డేపల్లి ప్రియమాధవి చెప్పారు. -
ఈ సీజన్లోనే 65% పుత్తడి అమ్మకాలు
ముంబై: సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పండుగల సీజన్లోనే 60–65 శాతం అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని జువెల్లరీ పరిశ్రమ భావిస్తోంది. ‘వారం నుంచి కస్టమర్ల రాక మొదలైంది. 20–25 శాతం జరిగిన అమ్మకాలు ఇప్పుడు 40 శాతానికి చేరాయి. డిసెంబర్ దాకా పెళ్లిళ్లు ఉండడంతో పెద్ద ఎత్తున ఆభరణాలకు గిరాకీ ఉంటుంది’ అని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. అతిథుల సంఖ్య పరంగా నియంత్రణ ఉండడంతో జువెల్లరీపై అధికంగా వెచ్చిస్తారని అభిప్రాయపడ్డారు. బంగారం ధర బలహీనంగా ఉండడం కూడా కలిసి వచ్చే అంశమన్నారు. ఏడాది మొత్తం విక్రయాల్లో 60–65 శాతం ఈ సీజన్లోనే జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పుత్తడి ధర విషయంలో కస్టమర్లు అలవాటుపడ్డారని సిరివర్ణిక జువెల్లర్స్ ఫౌండర్ ప్రియ మాధవి వడ్డేపల్లి తెలిపారు. ‘24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56 వేల దాకా వెళ్లి ఇప్పుడు రూ.52 వేలకు దిగొచ్చింది. ఇది అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది. మొత్తంగా మార్కెట్ కోలుకుంటోంది’ అని వివరించారు. -
షాకింగ్: బంగారం అమ్మేస్తున్నాం..
బ్యాంకాక్ : బంగారాన్ని నమ్మినవారెవరూ నష్టపోరంటారు పెద్దలు.... ఇది థాయ్‌లాండ్ ప్రజలకు పక్కాగా వర్తిస్తుంది. ఆపద కాలంలో అక్కడ ప్రజలను పసిడి ఆదుకుంటోంది. సహజంగా బంగారాన్ని అమ్మడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు మాత్రమే అమ్మడానికి చూస్తారు. అయితే కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి చేతిలో డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. (ఏడాది చివర్లో రూ 50,000 దాటేస్తుందా..?) లాక్‌డౌన్‌తో థాయ్‌లాండ్ ప్రజలు నగదు లేక విలవిల్లాడుతున్నారు. దీంతో వారి దృష్టి బంగారం అమ్మకంపై పడింది. తమ దగ్గరున్న బంగారం విక్రయించి, సొమ్ము చేసుకునేందుకు ఎగబడుతున్నారు. బ్యాంకాక్‌లోని చైనాటౌన్‌లోని యోవారత్‌కు ప్రజలు పరుగులు పెడుతున్నారు. స్వర్ణం ధర భారీగా పెరగడం వారిలో ఆశలు రేకెత్తిస్తోంది. థాయ్‌లాండ్‌లో ఔన్స్ బంగారం ప్రస్తుతం 1,731 డాలర్లు పలుకుతోంది. గత ఏడేళ్లలో ఇదే అత్యధిక ధర. (లాక్డౌన్ 2.0 : ఆర్బీఐ కీలక నిర్ణయం ) ప్రజలు బంగారం అమ్ముకోవడానికి మాస్కులు ధరించి పెద్ద ఎత్తున జ్యూవెలరీ షాప్‌లకు బారులు తీరుతున్నారు. జనాల తాకిడి పోటెత్తడంతో ఆ దేశ ప్రధాని ప్రయూత్ చాన్-ఓచా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం విక్రయిస్తే నగదు సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, అవసరం మేరకే విక్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జనాలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా స్థానిక అధికారులు కసరత్తు కూడా చేపట్టారు. (ఇంట్లోనే మద్యం తయారు చేసుకోవడం ఎలా? ) కాగా థాయ్‌లాండ్ ప్రజలు చేతిలో నగదు ఉంటే వాటిని బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతారు. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా, నమ్మకమైన పెట్టుబడిగా చూస్తారు. దీంతో అక్కడ ప్రజలు బంగారు ఆభరణాలను భారీగా కొనుగోలు చేసి, ధరలు పెరిగినప్పుడు అమ్మడం చేస్తుంటారు. బ్యాంకాక్‌లో పక్షం రోజులుగా లాక్డౌన్ అమలులో ఉండటంతో చేతిలో సరైన నగదు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలతో పాటు ఇతరత్రా అవసరాలకు థాయ్ ప్రజలు బంగారపు కడ్డీలతో పాటు, నగలను అమ్ముకుంటున్నారు. బంగారం ధర పెరగడంతో ఇందుకోసం ఉదయం నుంచే షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. (విద్యార్థుల మృతదేహాలను రప్పించండి ) థానకార్న్ ప్రోమ్యూయెన్ మాట్లాడుతూ.. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దీంతో నగదు కోసం నా దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. నాకు ఖర్చులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆదాయం లేకపోవడంతో వేరే గత్యంతరం లేకపోయిందని మరొకరు వాపోయారు. ఇప్పటివరకూ తన సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేదని అందుకే బంగారాన్ని అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపాడు. ఇక గత 60 ఏళ్లలో ప్రజలు ఈ విధంగా క్యూ లైన్లలో నిలబడి బంగారం అమ్మడాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని గోల్డ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిట్టి టాంగ్సిత్పాక్డి వ్యాఖ్యానించారు. (మీకు ఇలాంటి సంఘటన ఎదురైందా ?) (ఆశ్చర్యం: గాలిపటం ఎగరేస్తున్న కోతి) -
ఈసారి బంగారాన్ని పట్టించుకోలేదా?
దీపావళికి అమాంతం పెరిగే బంగారం అమ్మకాలు ఈసారి వెలవెలబోయాయి. అయితే ట్రేడర్లు ఊహించినదానికన్నా ఎక్కువ కొనుగోళ్లు జరగడం గమనార్హం. దంతేరస్ నాడు 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లుగా దీపావళి సీజన్లో అమ్మకాలు 40 టన్నులకు చేరుకున్నాయి. కానీ ఈ ఏడాది బంగారం ధర మెట్టు దిగకపోవడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ.. బంగారం అధిక ధర పలకడంతో మార్కెట్లో వాటికి డిమాండ్ తక్కువగా ఉందన్నారు. దీంతో ఈసారి ధన త్రయోదశికి అమ్మకాలు 20 టన్నుల వద్ద ఆగిపోతాయని అంచనా వేశామన్నారు. కానీ అంచనాలను దాటి.. 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. అయితే అమ్మకాల్లో వృద్ధి కనిపించినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే 25 % క్షీణించాయని పేర్కొన్నారు. పసిడి రేట్లు ఎగబాకడం వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గిందన్నారు. భారత ప్రభుత్వం విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధర చుక్కలనంటడానికి కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.38,275గా నమోదైంది. గతేడాది అదేరోజున బంగారం ధర రూ.31,702 పలికింది. -
పడిపోయిన బంగారం అమ్మకాలు
-
పసిడి ప్రియం.. సేల్స్ పేలవం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధంతేరాస్‌గా పిలిచే ధన త్రయోదశికి పసిడి మెరుపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 40% దాకా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.40 వేలకు అటూఇటుగా కదులుతుండటంతో పాటు.. కస్టమర్లు చేసే వ్యయాలు తగ్గడం కూడా ఇందుకు కారణమని వర్తకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నిజానికి ధన త్రయోదశికి బంగారం, వెండి, లేదా విలువైన వస్తువులు కొనడం శుభసూచకమని హిందువులు భావిస్తారు. 2018లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిగాయి కూడా. అయితే పసిడి ధర అప్పటితో పోలిస్తే 10 గ్రా. రూ.6000 వరకూ ప్రస్తుతం ఎక్కువ. శుక్రవారం హైదరాబాద్‌లోని నగల షాపుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. ధర రూ.39,900 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.36,850 పలికింది. కిలో వెండి రూ.50,600 ఉంది. రూ.2,500 కోట్ల విక్రయాలు... ఈ సంవత్సరం ధన త్రయోదశికి శుక్రవారం సాయంత్రం వరకు రూ.2,500 కోట్ల విలువైన సుమారు 6,000 కిలోల పుత్తడి అమ్ముడైనట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. గతేడాది ధనత్రయోదశికి మాత్రం రూ.5,500 కోట్ల విలువైన 17,000 కిలోల బంగారం విక్రయమైనట్లు సీఏఐటీ తెలియజేసింది. ‘‘వ్యాపారం 35–40% పడిపోయింది. గోల్డ్, సిల్వర్ ధరలు క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో అత్యధికంగా నిరాశపర్చిన ఏడాది ఇదే’’ అని సీఏఐటీ గోల్డ్, జ్యుయలరీ కమిటీ చైర్మన్ పంకజ్ అరోరా చెప్పారు. పరిమాణం పరంగా 2018తో పోలిస్తే అమ్మకాలు 20% తగ్గొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. మెరిసిన వెండి..: అధిక ధర కారణంగా ఈ సారి సెంటిమెంట్ పడిపోయిందని గోల్డ్ రిఫైనింగ్ సంస్థ ఎంఎంటీసీ– పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేశ్ ఖోస్లా చెప్పారు. ‘‘బంగారం ప్రస్తుత ధర వినియోగదార్ల దృష్టిలో చాలా ఎక్కువ. అందుకే కస్టమర్లు వెండి నాణేల వైపు మొగ్గు చూపారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సిల్వర్ కాయిన్స్ విక్రయాలు 2018తో పోలిస్తే 15% పెరిగాయని చెప్పారాయన. వివాహాల సీజన్ తోడవడంతో వెండి వస్తువుల అమ్మకాలు పెరిగాయని శ్రీ స్వర్ణ జ్యుయలర్స్ ఎండీ ప్రియ మాధవి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాలికి వేసుకునే కడియాలకు మళ్లీ డిమాండ్ పెరిగిందన్నారు. విదేశాల నుంచి సైతం వీటికి ఆర్డర్లు వచ్చాయని చెప్పారామె. చిన్న ఆభరణాలకే.. అన్ని షోరూంలలోనూ అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్ తెలిపారు. స్తబ్దుగా ఉన్న మార్కెట్లో ధంతేరాస్ రాకతో పరిస్థితిలో కొంత మార్పు కనపడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ చెప్పారు. ఈ సారి తక్కువ విలువ ఉన్న ఆభరణాల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపారని జీజేసీ అంటోంది. 60–70 శాతం చిన్న ఆభరణాల అమ్మకాలేనని శారీనికేతన్ గోల్డ్ విభాగం ఇన్చార్జ్ గుల్లపూడి నాగ కిరణ్ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్‌తో ముడిపడి 30% పైగా అమ్మకాలు నమోదయ్యాయని చెప్పారాయన. మొత్తంగా పుత్తడి అమ్మకాలు 40 శాతం పడిపోయాయన్నారు. -
పండుగ సీజన్లో గోల్డ్ బాండ్ ధమాకా
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భౌతిక పసిడి కొనుగోళ్లను తగ్గించి, ఆ మొత్తాలను పూర్తిస్థాయి ఇన్వెస్ట్మెంట్గా మార్చడానికి కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ 7వ తేదీన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019–20– సిరీస్ 5కు శ్రీకారం చుట్టింది. ఈ సిరీస్‌లో పసిడి గ్రామ్ ఇష్యూ ధర రూ.3,788గా నిర్ణయించింది. అక్టోబర్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసిన, డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపిన ఇన్వెస్టర్లకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. అంటే వీరికి 3,738కే గ్రాము బాండ్ అందుబాటులో ఉంటుందన్నమాట. భౌతికపరమైన పసిడి డిమాండ్ తగ్గింపు, తద్వారా దేశీయ పొదుపుల పెంపు లక్ష్యంగా 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది. వ్యక్తిగతంగా ఒకరు ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల వరకూ విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేసే వీలుంది. హిందూ అవిభక్త కుటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ట్రస్టీల విషయంలో ఈ పరిమాణం 20 కేజీలుగా ఉంది. -
అక్షయ తృతీయ : భారీ సేల్స్‌పై జ్యూవెలర్ల అంచనా
సాక్షి, న్యూఢిల్లీ : అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి అమ్మకాలు రెట్టింపవుతాయని జ్యూవెలర్లు అంచనా వేస్తున్నారు. ధరలు నిలకడగా ఉండటం, కొనుగోలుదారులు బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతుండటంతో ఈ ఏడాది అక్షయ తృతీయ అమ్మకాలు రికార్డుస్ధాయిలో నమోదవుతాయని ట్రేడర్లు, రిటైల్ వర్తకులు భావిస్తున్నారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారానికి డిమాండ్ 20 శాతం పెరుగుదల ఉంటుందని భారత బులియన్, జ్యూవెలర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది.మరోవైపు దేశంలో పలు ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడం, తొలివారంలో వేతన జీవులు వేతనాలు అందుకునే సమయం కావడంతో అక్షయ తృతీయ సేల్స్ ప్రోత్సాహకరంగా ఉంటాయని భారత బులియన్, జ్యూవెలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సౌరవ్ గాడ్గిల్ అంచనా వేశారు. ఈనెల 7న అక్షయ తృతీయ సందర్భంగా పలు జ్యూవెలరీ సంస్ధలు, దుకాణాలు బంగారు ఆభరణాలపై ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. -
ధనత్రయోదశికి ధరల షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ధనత్రయోదశి రోజు బంగారం కొనడాన్ని శుభప్రదంగా భావించే ఆనవాయితీ ఉన్నా ఈసారి అధికధరలతో బంగారం కొనుగోళ్లకు మగువలు పెద్దగా ఆసక్తి కనబరచలేదని వర్తకులు పేర్కొన్నారు. ప్రధానంగా ఉత్తరాదిలో ధనత్రయోదశికి బంగారం కొనుగోలుకు మహిళలు మొగ్గుచూపుతారు. దుకాణాలకు ప్రజలు భారీగానే తరలివస్తున్నా ధరల కారణంగా బంగారం విక్రయాలు ఆశాజనకంగా లేవని, ప్రీ బుకింగ్‌లతో కలుపుకుని అమ్మకాల్లో కేవలం 5 నుంచి 7 శాతం మాత్రమే పెరుగుదల నమోదైందని అఖిల భారత జెమ్ అండ్ జ్యూవెలరీ కౌన్సిల్ చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ చెప్పారు. పదిగ్రాముల బంగారం రూ 32,000 దాటడంతో పలువురు కొనుగోలుదారులు ఆభరణాల కొనుగోలుకు వెనుకాడుతున్నారు. గత ఏడాది ధనత్రయోదశి రోజున దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల పసిడి రూ 30,710 కాగా, ఇప్పుడు రూ 32,690కి ఎగబాకింది. అధిక ధరలతో బంగారానికి డిమాండ్ తగ్గిందని, వినియోగదారులు ఆభరణాల కంటే బంగారం, వెండి నాణేల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని ఢిల్లీ బులియన్ అసోసియేషన్‌కు చెందిన సురేందర్ జైన్ పేర్కొన్నారు. బంగారం ధరల పెరుగుదలతో మార్కెట్లో స్ధబ్ధత నెలకొందని, ఈసారి బంగారు నాణేలకు కార్పొరేట్ వర్గాల నుంచే డిమాండ్ నెలకొందని ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేష్ ఖోస్లా వెల్లడించారు. -
మసకబారుతోన్న ‘పసిడి’.. భారీగా తగ్గిన ధర
సాక్షి, అమరావతి : ప్రతి ఏడాది శ్రావణ మాసంలో బంగారం అమ్మకాలు గణనీయంగా ఊపందుకునేవనీ.. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని బంగారు ఆభరణాల తయారీదారులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా.. ప్రస్తుతం అమ్మకాలు పుంజుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. రూపాయి విలువ పతనం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన విధంగా దేశంలో ధరలు తగ్గకపోయినా గడచిన ఆరు నెలల్లో విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.2,325 వరకు తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నమోదైన రూ.32,825 గరిష్ట స్థాయి నుంచి బంగారం ధర ఆగస్టు 20 నాటికి రూ.30,500 తగ్గింది. ఇదే సమయంలో ఆభరణాల బంగారం ధర (22 క్యారెట్లు) రూ.29,250 నుంచి రూ.1,140 తగ్గి రూ.28,110 చేరుకుంది. అదే అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్ 11న 159 డాలర్లుగా ఉన్న ఔన్స్ బంగారం ధర గత నాలుగు నెలల్లో పతనమవుతూ రూ.1,188 వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని నెలలుగా ఇలా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా అమ్మకాలు పుంజుకోవడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక తెలియజేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆభరణాల అమ్మకాలు దేశవ్యాప్తంగా 8 శాతం తగ్గినట్లు పేర్కొంది. 2016–17 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 161 టన్నులుగా ఉన్న ఆభరణాల అమ్మకాలు.. ఈ ఏడాది ఇదే కాలానికి 148 టన్నులకు పడిపోయినట్లు నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా ఇంకా ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తుండటం, అధిక పన్నులు, రూపాయి విలువ పతనంతో ఇక్కడి ధరలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో తగ్గిన రీతిలో తగ్గకపోవడంతో వినియోగదారులు కొనుగోళ్లు జరపడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 30 శాతం పడిపోయిన అమ్మకాలు: గతంలో వెయ్యి రూపాయలు తగ్గితే చాలు కొనుగోళ్లు పెరిగేవని, కానీ ధరలు దిగివస్తున్నా అమ్మకాలు ఆ స్థాయిలో పెరగడం లేదని బులియన్ వ్యాపారులు వాపోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 30 శాతం క్షీణించినట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది శ్రావణ మాస సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 250 నుంచి 270 కిలోల వరకు ఆభరణాల అమ్మకాలు జరిగాయని.. కానీ ఈ ఏడాది 200 కిలోలు మించి జరిగే అవకాశం కనిపించడం లేదని ఏపీ గోల్డ్, డైమండ్ జ్యూయలెరీ మర్చంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బూశెట్టి రామ్మోహనరావు తెలిపారు. జీఎస్టీ, భారీ నగదు లావాదేవీలపై నిఘా వల్ల అమ్మకాలు తగ్గుతున్నాయా, లేక ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిందో అంచనాకు అందడం లేదన్నారు. ఈ సారి వరలక్ష్మీ పూజకు కేవలం కాసులు, రూపులు, కమ్మీలు వంటి వాటితో సరిపెడుతున్నారని తెలిపారు. ఈసారి వర్షాలు సకాలంలో రావడం కూడా బంగారం అమ్మకాలు తగ్గడానికి ఒక కారణంగా చెపుతున్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల పొలం పనులు మొదలు కావడంతో అందరూ పెట్టుబడుల కోసం నిధుల వేటలో ఉండటం అమ్మకాలు తగ్గడానికి కారణంగా నరసరావుపేటకు చెందిన జ్యూవెలరీ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ రంగంలోకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ప్రవేశించడంతో చిన్న సంస్థల్లో అమ్మకాలు తగ్గిపోయాయని, ఇప్పుడు వారంలో రెండు రోజులకు మించి అమ్మకాలు ఉండటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విజయవాడకు చెందిన ఓ బులియన్ వ్యాపారి వాపోయారు. కార్పొరేట్ సంస్థలు కూడా ఈ ఏడాది అమ్మకాలపై పెదవి విరుస్తున్నాయి. భారీ వర్షాలు ఈసారి దక్షిణాదిలో ఆభరణాల అమ్మకాలను దెబ్బతీశాయంటున్నారు. ఇంకా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉండటంతో కనీసం దీపావళి సమయానికైనా అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశాభావంతో బంగారం వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. -
ఒక్క రోజే 20 కేజీల బంగారం విక్రయం
న్యూఢిల్లీ : అక్షయ తృతీయ సందర్భంగా జువెల్లరీ దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడాయి. ఇటు మొబైల్ వాలెట్లు సైతం భారీ అమ్మకాలను నమోదుచేశాయి. ప్రముఖ మొబైల్ వాలెట్ పేటీఎం అక్షయ తృతీయ సందర్భంగా తన బంగారం విక్రయాలను మూడు రెట్లు పెంచుకుంది. దీంతో ఒక్క రోజే(ఏప్రిల్ 18న) 20 కేజీల బంగారాన్ని విక్రయించినట్టు తెలిపింది. బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే అక్షయ తృతీయ రోజున అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని పేటీఎం వెల్లడించింది. ఎక్కువగా అమ్మకాలు బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా నగరాల్లో నమోదైనట్టు తెలిపింది. ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌పై 1.5 మిలియన్లకు పైగా కస్టమర్లు 20 కేజీల బంగారాన్ని కొన్నారని, ఎక్కువగా 24 క్యారెట్ బంగారు నాణేలను కొనుగోలు చేసినట్టు పేటీఎం తెలిపింది. గతేడాది ఇదే రోజు 6.5 కేజీల బంగారాన్ని మాత్రమే విక్రయించినట్టు పేర్కొంది. రానున్న నెలల్లో తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియాను మరింతగా విస్తరించనున్నామని పేటీఎం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ నితిన్ మిశ్ర చెప్పారు. పేటీఎం తన కస్టమర్ల బంగారాన్ని ఎంఎంటీసీ-పీఏఎంపీతో బీమా లాకెట్లలో ఉంచుతోంది. వీటిపై ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు. ఎప్పుడు కావాల్సి వస్తే, అప్పుడు డెలివరీ చేస్తోంది. -
పేటీఎంలో బంగారం అమ్మకాలు భారీగా..
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ వాలెట్ కంపెనీ పేటీఎంలో బంగారం అమ్మకాలు భారీగా పెరుగనున్నాయి. రాబోతున్న దంతెరాస్, దివాలి సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌పై బంగారం అమ్మకాలు ఐదింతల వృద్ధిని నమోదుచేస్తాయని పేటీఎం అంచనావేస్తోంది. గోల్డ్ రిఫైనరీ ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం, తమ ప్లాట్‌ఫామ్‌పై బంగారం కొనుగోళ్లకు వినియోగదారులకు అనుమతి ఇచ్చింది. మరింత మంది కస్టమర్లను తమ ప్లాట్‌ఫామ్‌పై తెచ్చుకోవడం కోసం మార్కెటింగ్‌కు కంపెనీ రూ.10 కోట్లను పెట్టుబడులు పెడుతోంది. అదేవిధంగా దివాలి గోల్డ్ సేల్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 19 వరకు బంగారం కొనుగోలు చేసిన వారికి ఎక్కువ రివార్డింగ్ కూడా ఇస్తోంది. కనీసం రూ.10వేల మొత్తంతో కొనుగోలు చేస్తే 3 శాతం అదనపు బంగారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మొదట్లో ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం, ఒక్క రూపాయికే బంగారాన్ని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. '' భారతీయులు బంగారాన్ని ప్రేమిస్తారు. దంతెరాస్ లాంటి పండుగల కాంలో లక్షల కొద్దీ భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు'' అని పేటీఎం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ నితిన్ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం డిమాండ్ తొలి దశలో ఉందని, దంతెరాస్, దీపావళి కాలంలో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని కంపెనీ తెలిపింది. పేటీఎం గోల్డ్ కోసం నెలవారీ కనీసం 20 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని నితిన్ పేర్కొన్నారు. -
మా బంగారం మేమే కొన్నాం!
మాటమార్చిన ముసద్దీలాల్ యాజమాన్యం నవంబర్ 8న భారీగా బంగారం అమ్మినట్టు తొలుత వెల్లడి ఇప్పుడు తమ డబ్బుతో తామే ఖరీదు చేసినట్టు ప్రకటన అయితే 350 కేజీల పసిడి చూపించాలంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఆ రోజు రాత్రి భారీగా బంగారం వ్యాపారం చేశాం. క్రయవిక్రయాలకు చెందిన డబ్బంతా వినియోగదారులదే. – ముసద్దీలాల్ యాజమాన్యం తొలుత చెప్పిన మాట ఇదీ. నాడు మా డబ్బుతో మేమే బంగారం ఖరీదు చేసుకున్నాం. దీనికి ఆదాయపు పన్ను చెల్లించేస్తాం. – కైలాశ్‌గుప్తా అరెస్టు తర్వాత మారిన మాట ఇదీ. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నవంబర్ 8 రాత్రి మూడు గంటల వ్యవధిలో బోగస్ పత్రాలు, రసీదులతో రూ.97.85 కోట్ల ‘వ్యాపారం’చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యుయెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యుయెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానుల వ్యవహారమిదీ. ఈ కేసు నమోదైన నాటి నుంచి తాము చేసింది వ్యాపారమే అని చెప్పిన వీరు.. లాభానికి మాత్రమే పన్ను చెల్లిస్తామన్నారు. అయితే సంస్థ యజమాని కైలాశ్‌గుప్తా అరెస్టు తర్వాత మాట మార్చేశారు. ఆ రోజు తమ డబ్బుతో తామే బంగారం ఖరీదు చేసుకున్నామని, మొత్తానికి కలిపి అపరాధ రుసుంతో పాటు పన్ను చెల్లిస్తామని ఇప్పుడు చెపుతున్నారు. బంగారం చూపమంటున్న అధికారులు.. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నవంబర్ 8 రాత్రి ఈ సంస్థల డైరెక్టర్లంతా కలసి తమ వద్ద ఉన్న, కొందరు బడాబాబులకు చెందిన నల్లధనాన్ని బంగారం రూపంలోకి మార్చాలని కుట్ర పన్నారని అధికార ులు చెపుతున్నారు. దీనికోసం ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య 5,200 మంది వినియోగదారులు రూ.97.85 కోట్ల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్ అడ్వాన్స్ పేమెంట్ రసీదులు సృష్టించారు. సాధారం గా బులియన్ ట్రేడర్స్ నుంచి బంగారం నేరుగా వ్యాపారుల దుకాణాలకు రాదు. వాట్గా పిలిచే ప్రత్యేక భద్రతా ప్రాంతాల్లో ఉంచుతారు. అక్కడ నుంచే రిటైల్ వ్యాపారులు తమ వద్దకు తెచ్చుకుంటూ ఉంటారు. వl¬సద్దీలాల్ యాజమాన్యం ఈ వాట్ నుంచే బంగారాన్ని ‘నల్లబాబులకు’చేర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ డబ్బుతో తామే బంగారం ఖరీదు చేశామని చెప్తున్న ముసద్దీలాల్ యాజమాన్యాన్ని ఆ 340 కేజీల బంగారం చూ పాల్సిందిగా స్పష్టం చేస్తున్నారు. డీఫ్రీజ్ చేయమంటూ విన్నపం.. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ముసద్దీలాల్ యాజమాన్యంతో పాటు వీరు బంగారం ఖరీదు చేసిన బులియన్ ట్రేడర్స్‌కు చెందినవీ కలిపి మొత్తం 15 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన బులియన్ ట్రేడర్స్ సీసీఎస్ అధికారుల్ని ఆశ్రయించి తాము ముసద్దీలాల్ యాజమాన్యానికి బంగారం విక్రయించినట్లు ఆధారాలు సమర్పిస్తున్నారు. సంతృప్తికర వివరణ ఇచ్చిన సంస్థల ఖాతాలను అధికారులు డీఫ్రీజ్ చేసు ్తన్నారు. ముసద్దీలాల్ యాజమాన్యం సైతం రూ.12 కోట్లు ఉన్న తమ వ్యక్తిగత ఖాతాలను డీఫ్రీజ్ చేస్తే తాము ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు చెల్లిస్తామని చెపుతున్నారు. దీనికి ససేమిరా అన్న అధికారులు ఐటీ అధికారులు పన్ను వసూలుకు అంగీకరిస్తే.. ఆ మొత్తం నేరుగా వారి ఖాతాలోకి మళ్లించేలా మాత్రమే బ్యాంకుకు లేఖ రాస్తామని స్పష్టం చేశారు. పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటాం.. ఈ కేసులో నిందితుల అరెస్టుపై మధ్యంతర స్టే ఉన్నప్పుడు అందుబాటులో ఉండే ముసద్దీలాల్ యాజమాన్యం.. ఆపై పత్తా లేకుండా పోతోంది. షెల్టర్లతో పాటు సెల్ఫోన్లు, సిమ్‌కార్డుల్ని తరచుగా మార్చేస్తూ తప్పించుకు తిరుగుతోంది. వీరికోసం గాలిస్తున్న పోలీసులపై రకరకాల ఒత్తిళ్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా తమ కోసం గాలిస్తే పోలీసుల పేర్లు రాసి ఆత్మహత్య కేసుకుంటామంటూ ఓ నిందితుడు బెదిరిస్తున్నాడని తెలిసింది. దీంతో ఈ అంశాన్నీ రికార్డుల్లో పొందుపరచడం ద్వారా చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
‘బ్లాక్’లో బంగారం విక్రయాలు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.33 వేలకు చేరింది. బుధవారం బ్లాక్ మార్కెట్లో బంగారం విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. బుధవారం ఉదయం బంగారం వ్యాపారులు 10 గ్రాముల బంగారాన్ని రూ.100 నోట్లు ఇచ్చినవారికి రూ.33 వేలకు విక్రయించారు. అదే రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే 10 గ్రాముల బంగారం రూ.43 వేలకు విక్రయించారు. హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్, సిద్దంబర్బజార్తో పాటు అబిడ్స, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో బ్లాక్‌లో బంగారం విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. పలువురు వ్యాపారులతో పాటు చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా బ్లాక్‌లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. దుకాణాలు వెలవెలబోయినా, కొనుగోలుదారులతో వ్యాపారులు ధరలు నిర్ణయించుకుని పక్కదారిలో బంగారం అమ్మకాలు సాగించారు. దీంతో సుమారు రూ.వంద కోట్ల వరకూ బ్లాక్ మార్కెట్లో చేతులుమారినట్లు అంచనా. ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారం బ్లాక్ లో రూ. 50 వేల వరకు విక్రయించినట్టు వార్తలు వచ్చాయి.