అక్షయ తృతీయ బంగారం విక్రయాలపై ధీమాగా ఈ-రిటైలర్లు | Akshaya tritiya Gold sales | Sakshi
Sakshi News home page

అక్షయ తృతీయ బంగారం విక్రయాలపై ధీమాగా ఈ-రిటైలర్లు

May 9 2016 1:03 AM | Updated on Sep 3 2017 11:41 PM

అక్షయ తృతీయ బంగారం విక్రయాలపై ధీమాగా ఈ-రిటైలర్లు

అక్షయ తృతీయ బంగారం విక్రయాలపై ధీమాగా ఈ-రిటైలర్లు

అమెజాన్, బ్లూస్టోన్ వంటి ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు (ఈ-రిటైలర్లు) అక్షయ తృతీయ రోజు జరిగే బంగారు, డైమండ్స్ విక్రయాలపై ఆశావహంగా ఉన్నాయి.

ముంబై: అమెజాన్, బ్లూస్టోన్ వంటి ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు (ఈ-రిటైలర్లు) అక్షయ తృతీయ రోజు జరిగే బంగారు, డైమండ్స్ విక్రయాలపై ఆశావహంగా ఉన్నాయి. ఈ రోజు వ్యాపారం బాగుంటుందని ఆశిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత అక్షయ తృతీయ రోజు విక్రయాల్లో 6 రెట్ల వృద్ధి నమోదు కావచ్చని, ఆన్‌లైన్ రద్దీ కూడా బాగా పెరగవచ్చని అమెజాన్ ఫ్యాషన్ విభాగం హెడ్ మాయంక్ శివం తెలిపారు. 22 క్యారెట్ల జువెలరీకి మరీ ప్రత్యేకించి బంగారు చైన్స్, నెక్‌లెస్‌లకు డిమాండ్ విపరీతంగా ఉంటుందన్నారు.

బ్లూస్టోన్.కామ్ సీవోవో అర్వింద్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. బంగారు నాణేలకు, డైమండ్ ఇయర్‌రింగ్స్‌కు డిమాండ్ ఉండొచ్చని తెలిపారు. బంగారం, డైమండ్ జువెలరీ కొనుగోలుకు అక్షయ తృతీయను ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈ ఏడాది బిజినెస్‌లో మంచి టర్నోవర్ జరగొచ్చని కార్ట్‌లేన్.కామ్ వైస్ ప్రెసిడెంట్ విపిన్ నాయర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement