మా బంగారం మేమే కొన్నాం! | gold sales with our money only | Sakshi
Sakshi News home page

మా బంగారం మేమే కొన్నాం!

Published Fri, Jan 6 2017 3:21 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

మా బంగారం మేమే కొన్నాం! - Sakshi

మా బంగారం మేమే కొన్నాం!

  • మాటమార్చిన ముసద్దీలాల్‌ యాజమాన్యం
  • నవంబర్‌ 8న భారీగా బంగారం అమ్మినట్టు తొలుత వెల్లడి
  • ఇప్పుడు తమ డబ్బుతో తామే ఖరీదు చేసినట్టు ప్రకటన
  • అయితే 350 కేజీల పసిడి చూపించాలంటున్న అధికారులు
  • సాక్షి, హైదరాబాద్‌:
    ఆ రోజు రాత్రి భారీగా బంగారం వ్యాపారం చేశాం. క్రయవిక్రయాలకు చెందిన డబ్బంతా వినియోగదారులదే.
    – ముసద్దీలాల్‌ యాజమాన్యం తొలుత చెప్పిన మాట ఇదీ.
    నాడు మా డబ్బుతో మేమే బంగారం ఖరీదు చేసుకున్నాం. దీనికి ఆదాయపు పన్ను చెల్లించేస్తాం.
    – కైలాశ్‌గుప్తా అరెస్టు తర్వాత మారిన మాట ఇదీ.

    రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నవంబర్‌ 8 రాత్రి మూడు గంటల వ్యవధిలో బోగస్‌ పత్రాలు, రసీదులతో రూ.97.85 కోట్ల ‘వ్యాపారం’చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయెలర్స్, వైష్ణవి బులియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమానుల వ్యవహారమిదీ. ఈ కేసు నమోదైన నాటి నుంచి తాము  చేసింది వ్యాపారమే అని చెప్పిన వీరు.. లాభానికి మాత్రమే పన్ను చెల్లిస్తామన్నారు. అయితే సంస్థ యజమాని కైలాశ్‌గుప్తా అరెస్టు తర్వాత మాట మార్చేశారు. ఆ రోజు తమ డబ్బుతో తామే బంగారం ఖరీదు చేసుకున్నామని, మొత్తానికి కలిపి  అపరాధ రుసుంతో పాటు పన్ను చెల్లిస్తామని ఇప్పుడు చెపుతున్నారు.

    బంగారం చూపమంటున్న అధికారులు..
    నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నవంబర్‌ 8 రాత్రి ఈ సంస్థల డైరెక్టర్లంతా కలసి తమ వద్ద ఉన్న, కొందరు బడాబాబులకు చెందిన నల్లధనాన్ని బంగారం రూపంలోకి మార్చాలని కుట్ర పన్నారని అధికార ులు చెపుతున్నారు. దీనికోసం ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య 5,200 మంది వినియోగదారులు రూ.97.85 కోట్ల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్‌ అడ్వాన్స్‌ పేమెంట్‌ రసీదులు సృష్టించారు. సాధారం గా బులియన్‌ ట్రేడర్స్‌ నుంచి బంగారం నేరుగా వ్యాపారుల దుకాణాలకు రాదు. వాట్‌గా పిలిచే ప్రత్యేక భద్రతా ప్రాంతాల్లో ఉంచుతారు. అక్కడ నుంచే రిటైల్‌ వ్యాపారులు తమ వద్దకు తెచ్చుకుంటూ ఉంటారు. వl¬సద్దీలాల్‌ యాజమాన్యం ఈ వాట్‌ నుంచే బంగారాన్ని ‘నల్లబాబులకు’చేర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ డబ్బుతో తామే బంగారం ఖరీదు చేశామని చెప్తున్న ముసద్దీలాల్‌ యాజమాన్యాన్ని ఆ 340 కేజీల బంగారం చూ పాల్సిందిగా స్పష్టం చేస్తున్నారు.

    డీఫ్రీజ్‌ చేయమంటూ విన్నపం..
    కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ముసద్దీలాల్‌ యాజమాన్యంతో పాటు వీరు బంగారం ఖరీదు చేసిన బులియన్‌ ట్రేడర్స్‌కు చెందినవీ కలిపి మొత్తం 15 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. దీంతో దేశంలోని అనేక ప్రాంతాలకు  చెందిన బులియన్‌ ట్రేడర్స్‌ సీసీఎస్‌ అధికారుల్ని ఆశ్రయించి తాము ముసద్దీలాల్‌ యాజమాన్యానికి బంగారం విక్రయించినట్లు ఆధారాలు సమర్పిస్తున్నారు. సంతృప్తికర వివరణ ఇచ్చిన సంస్థల ఖాతాలను అధికారులు డీఫ్రీజ్‌ చేసు ్తన్నారు. ముసద్దీలాల్‌ యాజమాన్యం సైతం రూ.12 కోట్లు ఉన్న తమ వ్యక్తిగత ఖాతాలను డీఫ్రీజ్‌ చేస్తే తాము ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు చెల్లిస్తామని చెపుతున్నారు. దీనికి ససేమిరా అన్న అధికారులు ఐటీ అధికారులు పన్ను వసూలుకు  అంగీకరిస్తే.. ఆ మొత్తం నేరుగా వారి ఖాతాలోకి మళ్లించేలా మాత్రమే బ్యాంకుకు లేఖ రాస్తామని స్పష్టం చేశారు.

    పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటాం..
    ఈ కేసులో నిందితుల అరెస్టుపై మధ్యంతర స్టే ఉన్నప్పుడు అందుబాటులో ఉండే ముసద్దీలాల్‌ యాజమాన్యం.. ఆపై పత్తా లేకుండా పోతోంది. షెల్టర్లతో పాటు సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డుల్ని తరచుగా మార్చేస్తూ తప్పించుకు తిరుగుతోంది. వీరికోసం గాలిస్తున్న పోలీసులపై రకరకాల ఒత్తిళ్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా తమ కోసం గాలిస్తే పోలీసుల పేర్లు రాసి ఆత్మహత్య కేసుకుంటామంటూ ఓ నిందితుడు బెదిరిస్తున్నాడని తెలిసింది. దీంతో ఈ అంశాన్నీ రికార్డుల్లో  పొందుపరచడం ద్వారా చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement