ఇంటింటా బంగారం
♦ అక్షయ తృతీయకు జిల్లాలో గణనీయంగా బంగారం అమ్మకాలు
♦ 30 కేజీల విక్రయాలు.. రూ.30 వేలకు దిగిన 24 క్యారెట్ల గోల్డ్
అక్షయ తృతీయకు ప్రజలు జై కొట్టారు. మూడు నెలల పాటు మంచి ముహూర్తం లేకున్నా.. ప్రస్తుతం మూఢాలున్నా పసిడి ప్రియులు ‘నమ్మకాని’కే ఓటేశారు. వ్యాపారులు గ్రాముల వారీగా అమ్మకాలు జరగడంతో ఎద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగాయి. అనధికారికంగా జిల్లాలో సుమారు 30 కిలోల బంగారం అమ్మకాలు జరిగినట్టు సమాచారం.
సిద్దిపేట జోన్: చైత్రశుక్లా పక్ష తదియ రోజైన సోమవారం అక్షయ తృతీయ రావడంతో లక్ష్మి స్వరూపమైన పసిడిని కొనుగోలు చేస్తే అమ్మవారిని ఇంటికి ఆహ్వానించినట్టుగా ప్రజలు నమ్ముతారు. కాబట్టే గత నెల చివరి నాటికి బంగారం ధర పెరిగినప్పటికీ, అక్షయ తృతీయ రోజు ధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు నెలలుగా మంచి ముహుర్తాలు ఉండటంతో పసిడి ధర రూ.32 వేల వరకు చేరింది. అయితే, ఏప్రిల్ 29 నుంచి మూఢాలుండటంతో పసిడి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,400లకు దిగడం విశేషం. గత ఏడాది అక్షయ తృతీయకు 24
♦ క్యారెట్ల బంగారం రూ.27 వేలు పలికింది.
♦ 400 దుకాణాల్లో విక్రయాలు
జిల్లాలోని సుమారు 400 బంగారం విక్రయ దుకాణాల్లో అక్షయ తృతీయ సందర్భంగా సుమారు 30 కిలోల బంగారం అమ్మకాల లావాదేవీలు జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా సం గారెడ్డి, రామాయంపేట, గజ్వేల్, పటాన్‌చెరు, మెదక్, నారాయణ్‌ఖేడ్, సదాశివపేట, రాంచంద్రాపురంలోని కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జ రిగాయి. ఇక వాణిజ్య, వ్యాపార కేంద్రంగా బా సిల్లుతున్న సిద్దిపేటలోనూ సుమారు 40 దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగాయి.
నమ్మకానికి జై
మధ్య తరగతి వర్గ ప్రజల్ని ఆకర్షించేందుకు వ్యాపారులు గ్రాముల్లో బంగారం విక్రయాలు జరిపారు. గ్రాము బంగారం లక్ష్మి బిళ్లను రూ.3,100, అదే 2.5 గ్రాముల అమ్మవారి బిళ్లను రూ.7,650కి, 10 గ్రాములను రూ.30,400కు విక్రయించారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సిద్దిపేటలోని కమాన్ పరిసర ప్రాంత జ్యూయలరీ షాపుల్లో రద్దీగా ఉన్నాయంటే పిసిడి ప్రియుల నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు.
జహీరాబాద్‌లో రూ.40 లక్షల అమ్మకాలు
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని సోమవారం ఒక్కరోజే దాదాపు రూ.40 లక్షల బంగారం విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు రూ.30,200 ఉన్న ధర.. సోమవారం రూ.30,500లకు చేరింది.